Minimum Bank Balance: ఏప్రిల్ ఒకటి 2025 నుంచి మొదలు కానున్న కొత్త ఆర్థిక సంవత్సరం సామాన్యుల జేబులను గుల్ల చేసేలా కనిపిస్తుంది. ఎందుకంటే కొత్తగా అమలు కానున్న నిబంధనల విషయంలో మధ్యతరగతి ప్రజలు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొనున్నారు. వీటిలో ప్రధానంగా పలు బ్యాంకుల్లో మినిమం బ్యాలెన్స్ మెయిన్ టైన్, యూపీఐ రూల్స్ వంటివి ఇబ్బందిగా మారే అవకాశం ఉందని పలువురు అంటున్నారు. ఈ క్రమంలో ఏప్రిల్ 1 నుంచి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, కెనరా బ్యాంక్ మరికొన్ని బ్యాంకులు తమ ఖాతాదారులకు కనీస బ్యాలెన్స్ నిబంధనలో అమలు చేస్తున్నాయి.
బ్యాంకులు ఈ నియమాలను ఖాతా ప్రాంతాన్ని బట్టి కనీస బ్యాలెన్స్ అవసరాలను అమలు చేస్తాయి. అంటే పట్టణ ఈ ప్రాంతాలలో అధిక కనీస బ్యాలెన్స్ అవసరం ఉంటుంది. సేమి అర్బన్ ఈ ప్రాంతాలలో మితమైన కనీస బ్యాలెన్స్ అవసరం ఉంటుంది. గ్రామీణ ప్రాంతాల్లోనే రూల్స్ అమలు చేస్తారు. అంతేకాదు వీరు నిర్దేశించిన కనీస బ్యాలెన్స్ మీ అకౌంట్ లో ఉండకపోతే మీరు జరిమానా చెల్లించాల్సి రావచ్చు. కాబట్టి ఖాతాదారులు సరిగ్గా నిర్వహించడానికి పరిగణలోకి తీసుకొని మినిమం బ్యాలెన్స్ మెయింటెన్ చేయాల్సి ఉంటుంది.
Also Read: Myanmar: స్మశాన వాటికను తలపిస్తున్న మాయన్మార్.. 10 వేల మంది మృతి? హృదయవిదారక దృశ్యాలు
బ్యాంకు ఖాతాను బట్టి ఈ మొత్తం అనేది మారుతూ ఉంటుంది. అంటే కొన్ని బ్యాంకు ఖాతాదారులు పట్టణ ప్రాంతాల్లో 5000 రూపాయలు గ్రామీణ ప్రాంతాల్లో 2000 రూపాయల కనీస బ్యాలెన్స్ను ఉంచుకోవాల్సి ఉంటుంది. దీంతో పాటు ట్రాన్సాక్షన్స్ సెక్యూరిటీ పెంచడానికి అమలు చేస్తున్నాయి. ఈ పద్ధతి ద్వారా 5000 కంటే ఎక్కువ విలువ ఉన్న చెక్కులలో వర్తిస్తుంది. దీని ప్రకారం చెక్ నెంబర్, తేదీ, చెక్ చెల్లింపుదారుని పేరు, చెక్కు మొత్తం, వంటి విషయాలు ప్రస్తావించాల్సి ఉంటుంది. చెక్కుల పేరుతో జరుగుతున్న మోసాలను తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు.
Also Read: School Holidays: విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఏప్రిల్ నెలలో స్కూళ్లకు భారీగా సెలవులు..
నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఏప్రిల్ ఒకటి 2025 నుంచి చాలాకాలంగా పనిచేయకుండా ఉన్న మొబైల్ బ్యాంకుల యుపిఐ లావాదేవీలను నిలిపివేయబోతుంది .అంటే మీ బ్యాంకు ఖాతాకు పాత నెంబర్ లింక్ చేసి ఉంటే అది చాలా కాలం పాటు ఉపయోగించకుండా ఉంటే ఆ యుపిఐ లావాదేవీలు కొనసాగించడానికి మీరు ఏప్రిల్ ఒకటి 2025 లోపు మీ బ్యాంక్ అకౌంట్ ను కొత్త నెంబర్కు లింక్ చేయాల్సి ఉంటుంది. లేదంటే ఆ నెంబర్తో యూపీఐ ట్రాన్సాక్షన్స్ చేయలేరు. మోసం, ఫిషింగ్ స్కామ్స్ నివారించడానికి గత 12 నెలలుగా ఉపయోగించిన నిలిపివేస్తుంది. ఈ క్రమంలో పనిచేయకుండా ఉన్న యూపీఐ ఐడి లను తిరిగి యాక్టివేట్ చేయని వినియోగదారులు వాటిని పూర్తిగా కోల్పోయే ఛాన్స్ ఉంటుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Facebook, Twitter









