Business News in Telugu: ప్రముఖ ఉక్కు ఉత్పాదక సంస్థ ఎంఎస్ అగర్వాల్ ఫౌండ్రీస్ దేశవ్యాప్తంగా 1000కిపైగా డీలర్లతో తమ వ్యాపార పరిధిని విస్తరించేలా ప్రణాళికలు రూపొందించింది. రూ.1200 కోట్లకు పైగా పెట్టుబడులతో 1.2 మిలియన్ టీపీఎ ఉత్పత్తి చేయడమే లక్ష్యంగా ముందుకు వెళుతోంది. తద్వారా 5 వేల మందికి పైగా ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ఏర్పాటు చేయనుంది. ఎంఎస్ లైఫ్ 2024లో 25 వేల ఇళ్ల నిర్మాణానికి ఉక్కును అందించగా... 2025-26 నాటికి రెట్టింపు సంఖ్యలో చేరువయ్యేలా కార్యాచరణ రూపొందించింది. అధునాతన తుప్పు నిరోధకతను కలిగిన ఉక్కును అందిస్తోంది. ఇటీవల సికింద్రాబాద్‌లోని T19 టవర్స్‌లో జరిగిన ప్రత్యేక లాంచ్ ఈవెంట్‌లో MS అగర్వాల్ ఫౌండ్రీస్ నూతన ఉత్పత్తి MS లైఫ్ 600+ CRS (తుప్పు నిరోధక స్టీల్)ను ఆవిష్కరించింది. రానున్న నాలుగేళ్లలో ఉత్పత్తి సామర్థ్యాన్ని ఐదు రెట్లు పెంచడానికి రూ.1,200 కోట్ల పెట్టుబడితో విస్తరణ ప్రణాళికను కంపెనీ ప్రకటించింది.
ఈ సందర్భంగా ఎంఎస్ అగర్వాల్ ఫౌండ్రీస్ మేనేజింగ్ డైరెక్టర్ ప్రమోద్ అగర్వాల్ మాట్లాడుతూ.. అత్యాధునిక ఆర్ అండ్ డీ ద్వారా తాము ఎంఎస్ లైఫ్ 600+ CRS TMTని రూపొందించామని వెల్లడించారు. ధృడమైన ఉక్కుతో నిర్మాణాలను బలోపేతం చేస్తూ.. ప్రపంచ స్థాయి ఉక్కుతో గృహ కొనుగోలుదారులను శక్తివంతం చేయడమే తమ లక్ష్యమన్నారు. ఉత్పత్తిని పెంచడంతో పాటు, పవర్ ప్లాంట్, అదనపు ఉక్కు ఉత్పత్తులు, మెరుగైన కట్ & బెండ్ సేవలతో వైవిధ్యమైన పోర్ట్‌ఫోలియోను విస్తరిస్తున్నామని అన్నారు. జర్మన్ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి MS లైఫ్ 600+ CRS TMT రీబార్లు తెలంగాణలోని తూప్రాన్ మండలంలోని యూనిట్ 1, ఏపీలోని నాయుడుపేట యూనిట్2లో ఉత్పత్తి చేస్తున్నామని తెలిపారు.
అంతర్జాతీయ నాణ్యతా ప్రమాణాలకు కట్టుబడి జీరో-కాలుష్య తయారీకి ఉక్కు పరిష్కారాలతో పరిశ్రమకు తమ కంపెనీ నాయకత్వం వహిస్తోందన్నారు. 2010లో FE 500 ను మార్కెట్‌లోకి ప్రవేశపెట్టడం ద్వారా ఎంఎస్ వారసత్వాన్ని పెంపొందించుకుందని... MS లైఫ్ 600+ CRS ఆవిష్కరణతో బలమైన, స్థితిస్థాపకతలో కొత్త ప్రమాణాలను నిర్దేశించే కంపెనీ ప్రయాణంలో మరో మైలురాయిని సూచిస్తుందని అన్నారు. 2024లో MS లైఫ్ 25,000 ఇళ్ల నిర్మాణానికి దోహదపడిందని.. 2025 నాటికి ఆ సంఖ్యను 50 వేల ఇళ్లకు పెంచాలనే ప్రణాలికతో పని చేస్తున్నామని వెల్లడించారు. తుప్పు నుంచి రక్షిస్తూ.. కాల పరీక్షను తట్టుకునే బలమైన భారత నిర్మాణానికి ఉక్కును అందించడమే తమ ఉద్దేశమన్నారు.
Also Read: Kancha Gachibowli: హెచ్‌సీయూ, కంచ గచ్చిబౌలి భూములపై కేటీఆర్ సంచలన లేఖ
Also Read: Golden Cave: బంగారు నిధితో నిండిన గుహ.. ఆ ద్వారం తెరిస్తే ఇండియా ఫుల్ రిచ్ అవుతుంది..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









