Indian billionaires: ట్రంప్‌ దెబ్బకు అంబానీ, అదాని ఫ్యూజులౌట్.. ఒక్క రోజే ఎంత కోల్పోయారంటే?

Indian billionaires: భారత్ లో టాప్ 4 ధనవంతుల సంపద సోమవారం ఒక్కరోజే 10 బిలియన్ డాలర్లకు పైగా పతనం అయ్యింది. ప్రపంచ మార్కెట్లు కుప్పకూలడం వీర సంపదను గణనీయంగా తగ్గించేలా చేసింది. ఈ ఏడాది ప్రపంచ కుబేరులు కూడా భారీగా నష్టాలను చవిచూశారు.   

Written by - Bhoomi | Last Updated : Apr 7, 2025, 09:59 PM IST
Indian billionaires:  ట్రంప్‌ దెబ్బకు అంబానీ, అదాని ఫ్యూజులౌట్.. ఒక్క రోజే ఎంత కోల్పోయారంటే?

Indian billionaires: భారతదేశ సంపన్నుల జాబితాలో మొదటి నాలుగు స్థానాల్లో ఉన్న అంబానీ, గౌతమ్ అదానీ, సావిత్రి జిందాల్ కుటుంబం, శివ్ నాడార్ సంపద ఈ ఒక్క రోజే భారీగా తగ్గినట్లు ఫోర్బ్స్ రియల్ టైమ్ బిలియనీర్ జాబితా పేర్కొంది. వీరందరి సంపద విలువ సోమవారం 10.3 బిలియన్ డాలర్లు క్షీణించినట్లు పేర్కొంది. డొనాల్డ్ ట్రంప్ టారిఫ్స్ కారణంగా ప్రపంచ మార్కెట్లు కుప్పకూలడం వల్ల వీరి సంపదను తగ్గించేలా చేసింది. 

Add Zee News as a Preferred Source

ముకేశ్ అంబానీ
భారతదేశంలో అత్యంత ధనికుడైన ముకేశ్ అంబానీ సంపద విలువ ఒక్కరోజే 3.6 బిలియన్ డాలర్లకు తగ్గిపోయింది. ఆయన మొత్తం సంపద 87.7 బిలియన్ డాలర్లకు పడిపోయింది. 

గౌతమ్ అదానీ 
అంబానీ తర్వాత రెండో స్థానంలో ఉన్న అదానీ ఒక్కరోజే 3 బిలియన్ డాలర్ల నష్టాలను ఎదుర్కొన్నారు.దీంతో ఆయన సంపద విలువ 57.3బిలియన్ డాలర్లకు తగ్గింది. 

సావిత్రి జిందల్ 
భారతదేశ ధనవంతుల జాబితాలో మూడోస్థానంలో ఉన్న సావిత్రి జిందల్ కుటుంబం నేడు 2.2 బిలియన్ డాలర్ల నష్టాన్ని చూసింది. వీరిమొత్తం సంపద విలువ 33.9 బిలియన్ డాలర్లకు పడిపోయింది. 

శివ్ నాడార్ 
సంపన్నుల జాబితాలో నాలుగో స్థానంలో ఉన్న శివ్ నాడార్ 1.5బిలియన్ డాలర్ల నష్టాన్ని చవిచూశారు. దీంతో ఆయన మొత్తం సంపద విలువ 30.9 బిలియన్లుగా ఉంది. 

ప్రపంచ వాణిజ్య యుద్ధ భయాలు,అమెరికా స్టాక్ మార్కెట్లు నష్టాల నేపథ్యంలో భారత మార్కెట్లు కూడా తీవ్రంగా ప్రభావితం అయ్యాయి. 2020 తర్వాత సెన్సెక్స్ దాదాపు 4,000 పాయింట్లు కోల్పోయింది. నిఫ్టీ సుమారు 1200పాయింట్లు క్షీణించింది. ఫలితంగా కంపెనీ మార్కెట్ కాప్ తగ్గి బిలియనీర్ల సంపద విలువ క్షీణించింది. 

Also Read: expensive residential communities: ఫ్లాట్ కొనాలంటే కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సిందే.. దేశంలో ఖరీదైన, విలాసవంతమైన ప్రాంతం ఇదే!  

ఇక ప్రపంచ బిలియనీర్ల జాబితా చూస్తే... 2025 లో వారెన్ బఫెట్ సంపద మాత్రమే 12.7 బిలియన్ డాలర్లు పెరిగి 155 బిలియన్ డాలర్లకు చేరింది. ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ సంపద అయితే 130 బిలియన్ డాలర్లు తగ్గి 302 బిలియన్ డాలర్లకు చేరుకుంది. జెఫ్ బెజోస్ సంపద 45.2 బిలియన్ డాలర్లు తగ్గి 193 బిలియన డాలర్లకు క్షీణించగా.. మార్క్ జూకర్ బర్గ్ సంపద 28.1 బిలియన్ డాలర్లు తగ్గి 179 బిలియన్ డాలర్లకు  చేరింది. బెర్నార్డ్ ఆర్నాల్ట్ సంపద 18.6 బిలియన్లు తగ్గి 158 బిలియన్ డాలర్లకు దిగిరాగా... బిల్ గేట్స్ సంపద కూడా 3.38 బిలియన్ డాలర్లు క్షీణించి 155 బిలియన్ డాలర్లు ఉంది.

Also Read: Lowest petrol price: రూ. 2కే ఒక లీటరు పెట్రోల్...ఈ ప్రాంతంలో డె*డ్‌ చీప్‌ రేట్స్‌ 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

Bhoomi

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.  

...Read More

Trending News