SEBI FIR Case: సెబీ మాజీ ఛీఫ్ మదాభి పూరి బుచ్ , ముంబై స్టాక్ ఎక్స్చేంజ్, సెబీ అధికారులపై ఎఫ్ఐఆర్ నమోదుకు ముంబై ప్రత్యేక కోర్డు జారీ చేసిన ఆదేశాలు సంచలనంగా మారాయి. స్టాక్ మార్కెట్ మోసాలు, అవకతవకలు ఇలా వివిధ ఆరోపణలతో కటకటాలు లెక్కపెట్టే పరిస్థితికి వచ్చింది ఈమె.
ముంబై ప్రత్యేక కోర్టు ఇవాళ జారీ చేసిన ఆదేశాలు స్టాక్ మార్కెట్‌లో కలకల రేపాయి. స్టాక్ మార్కెట్ మోసం, రెగ్యులేటరీ అథారిటీ నిబంధనల ఉల్లంఘన అవినీతి, ఇన్వెస్టర్లకు అనుకూలమైన నిర్ణయాలు తీసుకోవడం వంటి ఆరోపణలపై సెమీ మాజీ ఛీఫ్ మదాభి పూరి బుచ్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేయాల్సిందిగా ఏసీబీకు ముంబై ప్రత్యేక న్యాయస్థానం ఆదేశించింది. సెబీ మాజీ ఛీఫ్ మదాభి పూరి బుచ్ తో పాటు ముంబై స్టాక్ ఎక్స్చేంజ్, ఐదుగురు సెబీ అధికారులపై కూడా కేసు నమోదుకు ముంబై కోర్టు ఆదేశించింది. ఓ కంపెనీ స్టాక్ మార్కెట్‌లో నిబంధనలు విరుద్ధంగా లిస్ట్ అయ్యేందుకు సహకరించడం, ఎలాంటి రెగ్యులేటరీ నిబంధనలు లేకపోయినా అనుమతించడం కారణంగా చాలా మంది ఇన్వెస్టర్లు నష్టపోయారని ఓ మీడియా జర్నలిస్టు సెబీ మాజీ ఛీఫ్ మదాభితో పాటు మరి కొందరికి వ్యతిరేకంగా పిటీషన్ దాఖలు చేశారు. ఈ పిటీషన్‌పై ముంబై ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి శశికాంత ఏక్‌నాథరావ్ బంకర్ విచారణకు ఆదేశించారు.
సెబీ మాజీ ఛీఫ్ మదాభి పూరి బుచ్‌తో పాటు మరో ఐదుగురు సెబీ అధికారులు, ముంబై స్టాక్ ఎక్స్చేంజ్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేసి 30 రోజుల్లో కేసు పురోగతి తెలియజేయాలని ఏసీబీను ఆదేశించింది. వాస్తవానికి గతంలోనే ఈమెపై చాలా ఫిర్యాదులు వచ్చినా సెబీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని పిటీషనర్ తెలిపారు. సెబీ మాజీ ఛీఫ్ మదాభి పూరి బుచ్‌తో పాటు ఇతర అధికారులు అశ్వని భాటియా, అనంత్ నారాయణ్, కమ్లేశ్ చంద్ర వర్షని, ముంబై స్టాక్ ఎక్స్చేంజ్ ఛైర్మన్ ప్రమోద్ అగర్వాల్, సీఈవో సుందరరామన్ రామమూర్తిలపై ఇప్పుడు ఎఫ్ఐఆర్ నమోదు కానుంది. కేవలం రెండ్రోజుల క్రితం అంటే ఫిబ్రవరి 28న ఆమె సెబీ చైర్ పర్సన్ పదవీకాలం పూర్తయింది.
Also read: 8th Pay Commission Major Update: కళ్లు చెదిరే జీతం, 46-51 వేలకు చేరనున్న కనీస వేతనం, భారీగా పెన్షన్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి









