Muttiah Muralitharan: నేడు ముత్తయ్య మురళీధరన్ పుట్టినరోజు. క్రికెట్ చరిత్రలో అత్యంత విజయవంతమైన బౌలర్. మురళీ టెస్ట్ క్రికెట్‌లో 800 వికెట్లు, వన్డే ఇంటర్నేషనల్స్‌లో 534 వికెట్లు పడగొట్టాడు. రెండు ఫార్మాట్లలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ అతనే. వింత యాక్షన్ లో ఉన్న ఈ కుడి చేయి ఆఫ్ బ్రేక్ స్పిన్ మాస్టర్ కు భారత్ తో లోతైన బంధం ఉంది. 1992లో ఆస్ట్రేలియాపై టెస్ట్ అరంగేట్రం చేసిన మురళీధరన్, భారత్ పై తొలి వన్డే ఆడాడు. 1993 ఆగస్టు 12న జరిగిన ఆ మ్యాచులో 21ఏళ్ల మురళీధరన్ ఒకే ఒక వికెట్ పడగొట్టాడు. అప్పుడు ఈ బౌలర్ 1347అంతర్జాతీయ వికెట్లు తీస్తాడని ఎవరూ ఊహించి ఉండరు.
ముత్తయ్య మురళీధరన్ చెన్నై అమ్మాయి మద్దిమలర్ రామమూర్తిని వివాహం చేసుకున్నాడు. మధిమలర్ ప్రఖ్యాత మలర్ గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ వ్యవస్థాపకుడు డాక్టర్ ఎస్ రామమూర్తి డాక్టర్ నిత్య రామమూర్తి దంపతుల కూతురు . వారి వివాహ కథ ఒక బాలీవుడ్ సినిమా స్క్రిప్ట్ వంటిది. ఈ వివాహంలో ప్రముఖ తమిళ నటుడు వాగై చంద్రశేఖర్ ఒక ముఖ్యపాత్ర పోషించారు. నిజానికి చెన్నైలోని సన్ టీవీ నెట్ వర్క్ స్టూడియోలో మురళీధరన్, వాగై చంద్రశేఖర్ ఆకస్మాత్తుగా కలిసినప్పుడు శ్రీలంక క్రికెటర్ తన తల్లి చంద్రశేఖర్ ఫొటోలను పెద్దెత్తున అభిమాని అని సంకోచించుకుండా చెప్పాడు. ఆ తర్వాత ఇద్దరు మంచి స్నేహితులుగా మారారు. తర్వాత చంద్రశేఖర్ మురళీధరన్ తల్లిని కలిసి..ఆమె తన కొడుకోసం వధువు వెతుకుతున్నట్లు చెప్పింది. అప్పుడు చంద్రశేశఖర్ మొదటిసారిగా తనకు చిన్నప్పటి నుంచి తెలిసిన మధిమలర్ గురించి చెప్పాడు.
మదమలర్ కుటుంబం కూడా వారి 24 ఏళ్ల కుమార్తెకు వరుడి కోసం చూస్తుండగా..మురళీధరన్ తల్లి తన కొడుకు మధిమలర్ రామమూర్తి గురించి చెప్పింది. కానీ అతను కెరీర్ పై ద్రుష్టిపెట్టాలనుకున్నందున మొదట్లో వివాహం పట్ల ఇంట్రెస్ట్ చూపించలేదు. చాలా ఒప్పించిన తర్వాత మురళీధరన్ మధిమలర్ ను కలవాలని నిర్ణయించుకున్నాడు. వారిద్దరూ ఒకరినొకరు కలుసుకున్నారు. వెంటనే కలిసిపోయారు. ఈ మొదటి మీట్ లోనే కలిసిపోవడంతో ఇద్దరు మనసులు కలిశాయి. శ్రీలంక క్రికెటర్ వెంటనే మధిమలర్ కు నిశ్చితార్థ ఉంగరాన్ని తొడిగించారు. ఈ జంట 21 మార్చి 2005న చెన్నైలోని సాంప్రదాయ తమిళ ఆచారాలతో పెళ్లి చేసుకున్నారు ఆ దంపతులకు ఇప్పుడు నరేశ్ , క్రిష అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు.
Also Read: Gold Rate: 6500కే గ్రాము బంగారం.. ఈ ఛాన్స్ మిస్ చేసుకోవద్దు!
2008లో ఐపీఎల్ ప్రారంభమైనప్పుడు ధోనీ కెప్టెన్సీలో చెన్నై సూపర్ కింగ్స్ అనేక మంది దిగ్గజ ఆటగాళ్లతో ఒప్పందం కుదుర్చుకుంది. శ్రీలంక గొప్ప స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ కూడా వారందరిలో ఒకరు. అతన్ని రూ. 4.5 కోట్లకు కొనుగోలు చేశారు. 2010లో చెన్నై సూపర్ కింగ్స్ తో ఐపీఎల్ ట్రోఫీని గెలుచుకున్న తర్వాత అతను 2011లో కొత్త ఫ్రాంచైజీ కొచ్చి టస్కర్స్ కేరళతో ఒప్పందం కుదుర్చుకుంది. అతను 2012-2014 వరకు ఆర్సీబీ తరపున ఆడాడు. 66 మ్యాచుల్లో 63 వికెట్లు తీసిన తర్వాత అతను చాలా కాలంగా సన్ రైజర్స్ హైదరాబాద్ కోచింగ్ స్టాఫ్ లో భాగంగా ఉన్నాడు. యువ ఆటగాళ్లను తీర్చిదిద్దుతున్నాడు.
దాదాపు 20ఏళ్ల అంతర్జాతీయ కెరీర్ లో 133 టెస్టులు, 350 వన్డేలు, 12 టీ20 మ్యాచులు ఆడిన మురళీధరన్ టెస్టుల్లో అత్యధికంగా 67సార్లు ఐదు వికెట్లు పడగొట్టిన రికార్డును తన పేరుతో క్రియేట్ చేసుకున్నాడు. 22 సార్లు 10 వికెట్లు తీసిన ఈ అనుభవజ్నుడు రిటైర్ మెంట్ తర్వాత తన రెండవ ఇన్నింగ్స్ లో కూడా విజయం సాధించాడు. ముత్తయ్య ఇప్పుడు వ్యాపారవేత్త అయ్యాడు. అతని కంపెనీ పేరు ముత్తయ్య బేవరేజెస్ అండ్ కన్ఫెక్షనరీ. ఇది భారతదేశంలోని కర్నాటకలో కూడా తన వ్యాపారాన్ని ప్రారంభించింది. అతని కంపెనీ కూల్ డ్రింక్స్, స్వీట్లను తయారు చేస్తుంది. ఈ ప్రాజెక్టు కోసం ఆయన రూ. 1400కోట్లు ఖర్చు చేస్తున్నారు.
Also Read: FD Rate Cut: బిగ్ షాకిచ్చిన ప్రభుత్వ బ్యాంక్...ఆర్బీఐ బాటలోనే వడ్డీ రేట్లపై కోత
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









