)
National Overseas Scholarship (NOS): కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ఇప్పటికి అన్ని వర్గాలకు సంబంధించిన ప్రజల కోసం పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలను అమలు చేస్తుంది. రైతుల కోసం, కార్మికుల కోసం, మహిళల కోసం, వ్యాపారవేత్తల కోసం అనేక రకాల సంక్షేమ పథకాలను అమలు చేస్తోంది. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ముద్ర యోజన పథకం ఇప్పటికే దేశంలోని 50 కోట్ల మంది ప్రజలకు చేరినట్లు గణాంకాలు చెబుతున్నాయి. దీంతో ప్రైవేటు వ్యాపారుల నుంచి రుణాలను పొందే బదులు ప్రజలు బ్యాంకుల నుంచి తక్కువ వడ్డీతో రుణాలను పొందుతున్నారు. ప్రస్తుతం విదేశాల్లో ఉన్నత విద్య చదవాలి అనుకునే పేద కుటుంబాలకు చెందిన విద్యార్థుల కోసం కేంద్ర ప్రభుత్వం National Overseas Scholarship (NOS) పేరిట స్కీం ప్రారంభించింది. ఈ స్కీం కింద విద్యార్థులకు ఏకంగా విదేశీ యూనివర్సిటీలో చదివేందుకు ఒక కోటి రూపాయలకు పైగా స్కాలర్షిప్ లభిస్తుంది.
SC, ST, వెనుకబడిన వర్గాల విద్యార్థులకు విదేశీ ఉన్నత విద్యను పొందే అవకాశం కల్పించడానికి National Overseas Scholarship (NOS) అనే ప్రతిష్ఠాత్మక పథకాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఈ స్కీంను కేంద్ర సామాజిక న్యాయ శాఖ నిర్వహిస్తుంది.
సాధారణంగా ఉన్నత కుటుంబాలకు చెందిన విద్యార్థులు మాత్రమే విదేశాలకు వెళ్లి ప్రఖ్యాత యూనివర్సిటీలలో చదువుకునే అవకాశం కలుగుతుంది. విదేశాల్లో విద్య అంటే లక్షలు కోట్లు ఖర్చయ్యే అవకాశం ఉంది. ప్రపంచ ప్రఖ్యాత యూనివర్సిటీలలో పేదింటి పిల్లలు కూడా చదువుకునేందుకు వీలుగా కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకంలో భాగంగా Master’s, Ph.D, Post-Doctoral వరకు చదివేందుకు స్కాలర్షిప్ అవకాశం కల్పిస్తున్నారు.
ఈ స్కాలర్షిప్ కోసం అప్లై చేసుకునేందుకు విద్యార్థులకు ఉండాల్సిన అర్హతలు ఇవే
>> ఈ స్కాలర్ షిప్ కోసం అప్లై చేసుకునే విద్యార్థి షెడ్యూల్డ్ కులం, సంచార తెగలు, భూమిలేని నిరుపేదలు, ఈబిసి వర్గాలకు చెందిన వారే ఉండాలి.
>> పోస్టు గ్రాడ్యుయేషన్ కోసం విదేశాలకు వెళ్లాలనుకునే వారు డిగ్రీలో కనీసం 55% మార్కులు తెచ్చుకోవాలి. Ph.D కోసం విదేశాలకు వెళ్లేవారు PGలో కనీసం 55% మార్కులు తెచ్చుకొని ఉండాలి.
>> దరఖాస్తు చేసుకునే అభ్యర్థి వయసు 35 సంవత్సరాల లోపు ఉండాలి.
>> కుటుంబం వార్షిక ఆదాయం ఎనిమిది లక్షలు మించకూడదు.
పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోసం అమెరికా, ఇతర దేశాలకు వెళ్లేందుకు అందుబాటులో ఉన్న స్కాలర్ షిప్ - సుమారు రూ. 48–58 లక్షలు
యూకే వెళ్లేందుకు రూ. 38–48 లక్షలు
ఇక నాలుగు సంవత్సరాల Ph.D కోసం :
అమెరికాలో డాక్టరేట్ చేసేందుకు 96 లక్షలు – రూ. 1 కోటి వరకు స్కాలర్ షిప్ అందుబాటులో ఉంది.
యూకే లో డాక్టరేట్ చేసేందుకు సుమారు రూ. 76–96 లక్షల స్కాలర్ షిప్ అందుబాటులో ఉంది.
ఇలా అప్లై చేసుకోండి:
ముందుగా అధికారిక వెబ్సైట్ https://nosmsje.gov.in ఓపెన్ చేసి, అందులో కావాల్సిన వివరాలను నమోదు చేసుకోవాలి. ఆన్ లైన్ అప్లికేషన్ సమర్పించడం ద్వారా, ఈ స్కాలర్షిప్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ముఖ్యంగా మీ కుల ధ్రువీకరణ పత్రము, విద్యార్హత, మీరు ఏ విదేశీ యూనివర్సిటీలో చదవాలి అనుకుంటున్నారో ఆ యూనివర్సిటీ కి చెందిన అడ్మిషన్ ప్రూఫ్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook