RBI new Rule: బ్యాంకు ఖాతాదారులకు బిగ్ అలర్ట్..ఏప్రిల్ నుంచి మారనున్న బ్యాంక్ సెలవులు, టైమింగ్స్?

RBI new Rule: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త రూల్స్ తీసుకువచ్చింది. ఈ రూల్స్ ప్రకారం బ్యాంకు సెలవుల్లో, టైమింగ్స్ లో మార్పులు రానున్నట్లు సమాచారం. మరి ఆ వివరాలు ఏంటో తెలుసుకుందాం.   

Written by - Bhoomi | Last Updated : Mar 18, 2025, 08:54 PM IST
RBI new Rule: బ్యాంకు ఖాతాదారులకు బిగ్ అలర్ట్..ఏప్రిల్ నుంచి మారనున్న బ్యాంక్ సెలవులు, టైమింగ్స్?

RBI new Rule: రిజర్వ్ బ్యాంక్ కొత్త రూల్స్ తీసుకువచ్చింది. బ్యాంకు సెలవులు, పని దినాల్లో ఈ రూల్స్ అమలు చేయనుంది. ఇది వరకు బ్యాంకులు వారంలో ఆరు రోజులు పనిచేసేవి. కేవలం రెండో శనివారం, నాలుగో శనివారం మాత్రమే ఐదు రోజులు పనిచేస్తాయి. కానీ ఇప్పుడు ఈ నియమాన్ని ఆర్బిఐ మార్చే ఛాన్స్ ఉంది. వారానికి రెండు రోజులు సెలవులు ఇచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. 

Add Zee News as a Preferred Source

ఇది నిజంగా బ్యాంకు ఉద్యోగులకు వరంగా మారనుంది. ఎప్పటి నుంచో వారానికి రెండు రోజులు సెలవులు ఇవ్వమని అడుగుతున్నారు. వారి కోరికను కేంద్రం ప్రభుత్వం మన్నించింది. కాబట్టి ఇక పై వారానికి రెండు రోజులు సెలవులు ఉండే ఛాన్స్ ఉంది. ఏప్రిల్ మొదటి నెలలో మొదటివారం నుంచి 5రోజులు మాత్రమే బ్యాంకు తెరిచి ఉంటుంది. మిగిలిన రోజుల్లో బ్యాంకు మూసివేసి ఉంటుంది. అంటే శనివారం, ఆదివారం బ్యాంకులు మూసివేసి ఉంటాయి. సోమవారం నుంచి శుక్రవారం వరకు మాత్రమే బ్యాంకు పనిచేస్తుంది. కార్పొరేట్ ఆఫీసుల మాదిరిగా బ్యాంకు 5రోజుల పని 2 రోజులు సెలవు దినాలుగా ఉంటుంది. 

Also Read: Stock market: రెండు నెలల తర్వాత దుమ్ములేపిన నిఫ్టీ.. చాలా రోజుల తర్వాత స్టాక్ మార్కెట్‎కి గుడ్ న్యూస్  

శని ఆదివారాలు రెండు రోజులు సెలవు కావాలని బ్యాంకు ఉద్యోగులు చాలా సార్లు అడిగారు. దీని గురించి పోరాటాలు, నిరసనలు కూడా జరిగాయి. ఆర్బిఐకి చాలా వినతులు కూడా అందాయి. చివరికి ఉద్యోగుల కోరిక మేరకు వారానికి రెండు రోజులు సెలవు దినంగా ప్రకటించడానికి ప్రభుత్వం ముందుకు వచ్చింది. ఏప్రిల్ నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి. కాబట్టి కస్టమర్లు బ్యాంకు పనికోసం వెళ్లే ముందు వారం ఏదో గమనించండి. ఎప్పటివలే శనివారం బ్యాంకు పనులు పూర్తి చేసుకుందామనుకుంటే ఏప్రిల్ నెల నుంచి సాధ్యం కాదు. 

Also Read: Money: 60ఏళ్లు దాటిన వారిని ఈ ప్లాన్‌లో చేర్చండి.. 5 వేల పెన్షన్ వస్తుంది!   

శనివారం బ్యాంకు మూసివేయడం వల్ల రెండు షిఫ్టుల్లో బ్యాంకును తెరవడానికి కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తుంది. అంటే సాయంత్రం వరకు కూడా తెరిచి ఉండే అవకాశం ఉంది. దీని గురించి కూడా చర్చలు జరుగుతున్నాయి. నిజానికి వారం మొత్తం అందరికీ పని ఉంటుంది. శనివారం మాత్రమే బ్యాంకులకు వెళ్లే ఛాన్స్ ఉంటుంది. కానీ ఇప్పుడు శనివారం సెలవు అయితే చాలా మంది ఇబ్బంది పడతారు. అందుకే ఐదు రోజులు సెలవులు అయినా బ్యాంకు పనివేళల్లో తేడా వచ్చే అవకాశం ఉంది. సాయంత్రంపూట ఎక్కువ సేపు బ్యాంకు తెరచి ఉంచే ఛాన్స్ ఉంది. ఈ విషయంలో ఇంకా చర్చలు జరుగుతూనే ఉన్నాయి. త్వరలోనే ఈ విషయంలోనూ ఆర్బిఐ కీలక ప్రకటన చేయనుంది. 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

About the Author

Bhoomi

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.  

...Read More

Trending News