)
Richest People's Investment Secret: భారతదేశంలో ఎంతో మంది ధనవంతులు ఉన్నారు. వీరంతా భారీ డబ్బును కలిగి ఉన్న సంపన్నులు. భారీగా ఆస్తిపాస్తులను కలిగి ఉన్నవారిని ఉబెర్ రిచ్ కేటగిరి వారీగా పిలుస్తారు. మన దేశ సంపదలో ఇలాంటి శ్రీమంతుల వాటా ఎంత ఉంటుంది. వీరి పెట్టుబడి అలవాట్లు ఏంటి. ఏ విభాగాల్లో ఎక్కువగా ఇన్వెస్ట్ చేస్తుంటారు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలను అమెరికాకు చెందిన అంతర్జాతీయ ఆస్తుల నిర్వహణ కంపెనీ బెర్న్ స్టీవ్ విడుదల చేసింది. ఆ వివరాలు చూద్దాం.
ఇప్పుడు ముందుగా ఉబెర్ రిచ్ కేటగిరి అంటే ఏంటో తెలుసుకుందాం. అల్ట్రా హై నెట్ వర్త్ వ్యక్తులు, హై నెట్ వర్త్ వ్యక్తులు, సంపన్నులు ఈ కేటగిరీలోకి వస్తారు. ఉబెర్ అనేది జర్మన్ పదం. అతిగా, అవసరమైన దాని కంటే ఎక్కువ అని అర్థం. అతిగా సంపద ఉన్నవారికి ఉబెర్ రిచ్ వ్యక్తులు అని పిలుస్తుంటారు. దేశ జనాభాలోని కేవలం 1శాతం మంది మాత్రమే ఈ కేటగిరీలోకి వస్తారు.
ఈ సంపన్న వ్యక్తుల వద్ద ఉన్న మొత్తం 11.6 ట్రిలియన్ల డాలర్ల సంపదలో, మ్యూచువల్ ఫండ్స్, స్టాక్స్, బీమా లేదా బ్యాంక్ డిపాజిట్ల ద్వారా నిర్వహించగల ఆర్థిక ఆస్తులలో 2.7 ట్రిలియన్ల డాలర్లు మాత్రమే ఉన్నాయని బెర్న్ స్టీవ్ నివేదిక పేర్కొంది. మిగిలిన 8.9 ట్రిలియన్ల డాలర్ల ఆస్తి, బంగారం, ప్రమోటర్ ఈక్విటీ లేదా నగదు హోల్డింగ్‌లు వంటి వెంటనే డబ్బు ఆర్జించలేని లేదా మళ్లించలేని ఆస్తులలో లాక్ అయ్యాయి.
నివేదిక ప్రకారం, ఈ టాప్ 1శాతం మంది అల్ట్రా హై నెట్ వర్త్ వ్యక్తులు (UHNI), హై నెట్ వర్త్ వ్యక్తులు (HNI)' ఇతర సంపన్న తరగతుల వారు ఉన్నారు. దాదాపు 35,000 UHNI కుటుంబాలు ఉన్నాయి. వీరి సగటు సంపద 54 మిలియన్ డాలర్లు (సుమారు ₹472.5 కోట్లు). ఇందులో 24 మిలియన్ డాలర్లు (₹210 కోట్లు) ఆర్థిక ఆస్తుల రూపంలో ఉన్నాయి. ఈ కారణాల వల్లే ఇలాంటి ఆర్థిక ఆస్తులు భారత్ లోని వెల్త్ మేనేజర్ల పరిశీలనలోకి, నిర్వహణలోకి రావడం లేదని బెర్న్ స్టీన్ నివేదిక తెలిపింది.
భారత్ లోని అత్యంత సంపన్నులు తమ సంపదలో దాదాపు 60శాతాన్ని ప్రధానంగా 2 విభాగాల్లోకి పెట్టుబడులు మళ్లిస్తున్నారని రిపోర్టు తెలిపింది. రియల్ ఎస్టేట్, బంగారం అనేవి వారికి హాట్ ఫేవరేట్ ఇన్వెస్ట్ మెంట్ ఆప్షన్స్ గా ఉన్నాయని తెలిపింది. భారత్ లోని మొత్తం ఆర్థిక ఆస్తుల్లో 70శాతం వాటా ఉబెర్ రిచ్ వర్గీయుల చేతుల్లోనే ఉందని నివేదిక పేర్కొంది.
భారత్ లోని దాదాపు 35వేల మంది అల్ట్రా హై నెట్ వర్త్ వ్యక్తులు ఉండగా వీరి సగటు నెట్ వర్త్ 12 మిలియన్ డాలర్లకు పైనే ఉంటుంది. అల్ట్రా హై నెట్ వర్త్ ఉన్న కుటుంబాల సగటు వార్షిక ఆదాయం 4.8మిలియన్ డాలర్లు ఉంది. వీరి సగటు ఆస్తుల విలువ 54 మిలియన్ డాలర్లుగా ఉంది. దీనిలో 24 మిలియన్ డాలర్ల ఆర్థిక ఆస్తులు ఉన్నాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి