
Ola Akshaya Tritiya Bumper Sale: అక్షయ త్రుతీయ సందర్భంగా విద్యుత్ వాహన తయారీదారు సంస్థ అయిన ఓలా ఎలక్ట్రిక్ ప్రత్యేక సేల్ ను ప్రకటించింది. తన ఎస్1 పోర్ట్ పోలియోపై పెద్దఎత్తున డిస్కౌంట్ అందిస్తోంది. జెన్2, జెన్ 3 మోడల్స్ పై రూ. 40వేల వరకు డిస్కౌంట్ తోపాటు ఫ్రీ వారెంటీని అందిస్తున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే ప్రారంభమైన ఈ ఆఫర్లు రేపటి వరకు అందుబాటులో ఉంటాయి. దీంతోపాటు ఎంపిక చేసిన ప్రాంతాల్లో తమ స్కూటర్లపై హైపర్ డెలివరీ అందించనుంది.
- ఓలా జెన్2 ఎస్ 1 ఎక్స్ 2kWh బ్యాటరీ సామర్థ్యం కలిగిన స్కూటర్ ధర ఆఫర్లతో కలుపుకుంటే ప్రస్తుతం రూ. 67,499గా ఉంది. ఇక 3kWh బ్యాటరీ స్కూటర్ ధర రూ. 83,999, 4kWh బ్యాటరీ ధర రూ. 90, 999, ఎస్ 1 ప్రో ధర రూ. 1,11,999 నుంచి ప్రారంభం అవుతుంది.
- ఇక కంపెనీ జెన్ 3 పోర్ట్ ఫోలియోలో ఎస్ 1 ఎక్స్ రేంజ్ లో తీసుకువచ్చిన స్కూటర్లలో 2kwh బ్యాటరీ వేరియంట్ ధర రూ. 73,999, 3kwh ధర రూ. 1,04,999 నుంచి ప్రారంభం అవుతుంది. ఎస్ 1 ఎక్స్ ప్లస్ 4kwh బ్యాటరీతో తీసుకువచ్చిన స్కూటర్ ధర రూ. 1,09, 999
- ఫ్లాగ్ షిప్ ఎస్ 1 ప్రో ప్లస్ 4kwh స్కూటర్ ధర రూ. 1,48,999, 5.3kwh బ్యాటరీ సామర్థ్యం ఉన్న స్కూటర్ ధర రూ. 1,88,200గా ఉంది. ఎస్ 1 ప్రో 3kwh బ్యాటరీ వేరియంట్ ధర రూ. 1,12,999, 4kwh బ్యాటరీ వేరియంట్ ధర రూ. 1,29,999గా ఉంది.
ఇక ఓలా తన సర్వీసులను మరింత మెరుగుపరుస్తోంది. హైపర్ డెలివరీ కింద వెహికల్స్ కొనుగోలు చేసిన రోజే రిజిస్ట్రేషన్, డెలివరీలను ప్రారంభించింది. తొలుత ఈ హైపర్ డెలివరీ సేవలు బెంగళూరులో ప్రారంభించింది. క్రమంగా దేశవ్యాప్తంగా ఈ సేవలను విస్తరించనుంది. ఓలా ఎలక్ట్రిక్ వాహనాలను ఆన్ లైన్ లేదా ఆఫ్ లైన్ స్టోర్లలో కొనుగోలు చేసినవారు కొన్ని గంటల వ్యవధిలోనే పూర్తిగా రిజిస్ట్రేషన్ చేసుకుని వాహనాన్ని తీసుకెళ్లవచ్చు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe