)
Ola Stocks: గత నెల రోజులుగా పెట్టుబడిదారుల దృష్టిని ఆకర్షించిన ఓలా ఎలక్ట్రిక్ మొబిలిటీ షేర్లు గురువారం ఒక్కసారిగా కుప్పకూలాయి. దాదాపు 8 శాతం వరకు పడిపోవడంతో ఇన్వెస్టర్లు అలర్ట్ అయ్యారు. గత నెలలోనే ఈ స్టాక్ దాదాపు 77 శాతం పెరిగి, కొత్తగా లిస్టింగ్ అయిన షేర్లలో ఓలా అగ్రగామిగా నిలిచింది. అయితే నేటి ట్రేడింగ్‌లో భారీ పతనం నమోదు కావడం మార్కెట్లో చర్చనీయాంశంగా మారింది.
ఈ పతనానికి ప్రధాన కారణం తాజాగా ప్రకటించిన జీఎస్టీ 2.0 సంస్కరణల్లో ఎలక్ట్రిక్ వాహనాలపై ఎలాంటి మార్పులు చేయకపోవడం అని చెప్పవచ్చు. ప్రస్తుతం ఎలక్ట్రిక్ స్కూటర్లపై 5శాతం జీఎస్టీ కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో కొంతమంది పెట్టుబడిదారులు లాభాలను బుక్ చేసుకోవడంతో షేర్ ధరలు రూ.63.71 వరకు పడిపోయాయి. ఆ తర్వాత కొంత రికవరీ చేసి మధ్యాహ్నం వరకూ రూ.65 వద్ద ట్రేడ్ అయ్యాయి.
అయితే దీర్ఘకాలికంగా ఓలా ఎలక్ట్రిక్‌కు బలమైన ఆధారం ఏర్పడింది. ఎందుకంటే ఆటోమోటివ్ రీసెర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ARAI) ఇటీవలే ఓలా Gen 3 స్కూటర్లకు అంగీకారం తెలిపింది. ఈ సర్టిఫికేషన్ వల్ల కంపెనీకి 2028 వరకు అమ్మకాల విలువలో 13 నుంచి 18 శాతం వరకు ప్రోత్సాహకాలు లభించే అవకాశం ఉంది. ముఖ్యంగా ఏడు Gen 3 మోడళ్లకు ఈ అంగీకారం వర్తించడం విశేషం. ఇవే కంపెనీ అమ్మకాలలో సగం వాటా కలిగిన మోడళ్లుగా గుర్తించాయి.
మార్కెట్ నిపుణులు కూడా ఈ స్టాక్‌పై మిశ్రమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. రిలిగేర్ బ్రోకింగ్‌కి చెందిన అజిత్ మిశ్రా మాట్లాడుతూ.. గత రెండు వారాల్లోనే షేర్ 40 శాతం కంటే ఎక్కువ పెరిగిందని, ఇప్పుడు రూ.65-68 రేంజ్ వద్ద కీలక ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటోందని చెప్పారు. ఆ స్థాయిని దాటితే షేర్ మధ్యకాలంలో రూ.80-90 వరకు చేరే అవకాశం ఉందని అంచనా వేశారు. అదే సమయంలో రూ.52-50 రేంజ్ వరకు వస్తే అది కొనుగోలు చేసే మంచి అవకాశం అని తెలిపారు.
ఓలా ఐపీఓ 2024 ఆగస్టులో రూ.76 వద్ద లిస్టింగ్ అయి, మొదటి నెలలోనే రూ.123.9 వరకు పెరిగింది. కానీ 2025 జూలైలో భారీ పతనం చవిచూసి రూ.39.6 కనిష్టానికి పడిపోయింది. ప్రస్తుతం షేర్ మళ్లీ ఐపీఓ ధర దగ్గర రికవరీ సాధించడం పెట్టుబడిదారులకు ఆశ కలిగిస్తోంది. అంతేకాకుండా తాజాగా ARAI సర్టిఫికేషన్ రావడంతో భవిష్యత్తులో లాభదాయకత పెరగనుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మొత్తం మీద తాత్కాలిక ఒడిదుడుకులు ఉన్నప్పటికీ, PLI పథకం ప్రోత్సాహకాలు, బలమైన డిమాండ్, సాంకేతిక అప్డేట్స్ కారణంగా ఓలా ఎలక్ట్రిక్ దీర్ఘకాలికంగా ఇన్వెస్టర్లకు మంచి రాబడులు ఇవ్వగలదని విశ్లేషకులు చెబుతున్నారు.
Disclaimer: ఈక్విటీ మార్కెట్లలో పెట్టుబడులు రిస్కుతో కూడుకున్నవి. ఈ కథనంలో ఇక్కడ వ్యక్తీకరించిన అభిప్రాయాలు/సూచనలు/సలహాలు కేవలం పాఠకుల అవగాహన కోసం మాత్రమే. జీ తెలుగు ఎలాంటి షేర్ మార్కెట్ రికమండేషన్స్ ఇవ్వదు. ఏదైనా ఆర్థిక నిర్ణయం తీసుకునే ముందు నిపుణులైన సర్టిఫైడ్ ఇన్వెస్ట్ మెంట్ ఫైనాన్షియల్ అడ్వైజర్లను సంప్రదించాలని జీ తెలుగు పాఠకులను సూచిస్తుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.