Pakistan Stock Market: మోదీ దెబ్బకు పాకిస్తాన్ స్టాక్స్ అండర్ గ్రౌండ్.. అల్లాడిపోతున్న కరాచీ స్టాక్ ఎక్స్ఛేంజీ

Pakistan Stock Market:  పహల్గామ్ దాడి తర్వాత భారతదేశం ప్రతీకారం తీర్చుకుంటుందనే భయంతో పాకిస్తాన్ భయపడుతోంది. ఈ భయాందోళన ప్రభావం పాకిస్తాన్ స్టాక్ మార్కెట్‌పై కూడా స్పష్టంగా కనిపిస్తోంది. గురువారం మార్కెట్లో పెద్ద క్షీణత కనిపించింది. భారతదేశం ఒక్క బుల్లెట్ కూడా పేల్చకుండానే పాకిస్తాన్‌ను పాతాళంలోకి తొక్కింది.   

Written by - Bhoomi | Last Updated : Apr 24, 2025, 04:26 PM IST
Pakistan Stock Market: మోదీ దెబ్బకు పాకిస్తాన్ స్టాక్స్ అండర్ గ్రౌండ్.. అల్లాడిపోతున్న కరాచీ స్టాక్ ఎక్స్ఛేంజీ

Pakistan Stock Market:  ఓవైపు కాశ్మీర్లో ఉగ్రవాదులు అమాయక భారతీయ ప్రజల పైన కాల్పులు జరిపి పైశాచిక ఆనందం పొందితే మరోవైపు ఎట్టి పరిస్థితుల్లో ఈ దుశ్చర్యలకు సహకారం అందించిన పాకిస్తాన్ పని పట్టాలని భారత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే సింధు జలాల ఒప్పందం నిలిపివేతతో పాటు పలు కీలకమైన నిర్ణయాలను కేంద్ర ప్రభుత్వం తీసుకుంది.

Add Zee News as a Preferred Source

అయితే భారత తీసుకునే చర్యలు కారణంగా పాకిస్తాన్ తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. అయితే భారత్ పై ఉగ్రదాడిని యావత్తు ప్రపంచం ముక్తకంఠంతో ఖండించింది. పాకిస్తాన్ తమ దేశం అంతర్జాతీయ సమాజం ముందు ముద్దాయిగా నిలిచే అవకాశం ఉందని భయపడుతోంది. అంతేకాదు భారత్ ఎలాంటి ప్రతీకార చర్యలు తీసుకుంటుంది అనే దానిపై కూడా పాక్ ప్రభుత్వం, సైనిక వర్గాలు భయపడుతున్నాయి. 

మరోవైపు పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితి అసలే మూలిగే నక్కపైన తాటిపండు పడ్డట్టుగా ఉన్న ఈ సందర్భంలో ఏకంగా మురుగే నక్క పైన బాంబు పడ్డ చందంగా మారిందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అందుకు సూచికగా పాకిస్తాన్ స్టాక్ మార్కెట్ పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. పహల్గాం పై ఉగ్రవాదుల దాడి అనంతరం కరాచీ కేంద్రంగా నడిచే స్టాక్ ఎక్స్చేంజ్ భారీ నష్టాలను నమోదు చేసింది. 

భారత్ మరోసారి సర్జికల్ స్ట్రైక్ లాంటి ప్రతీకార చర్య తీసుకుంటుందనే భయంతో పాకిస్థాన్ స్టాక్ మార్కెట్‌  భారీగా నష్టపోవడం ప్రారంభించింది.  కరాచీ స్టాక్ ఎక్స్చేంజ్ ఏప్రిల్ 23వ తేదీన 1300 పాయింట్లు నష్టపోయింది.  ఇక ఏప్రిల్ 24వ తేదీన ఇప్పటికే నష్టపోయింది.  ఈ రెండు రోజులలోనే పాకిస్తాన్ పెట్టుబడిదారులు భారీ నష్టాలను చవిచూశారు.  

Also Read:  IAS Success Story: మొబైల్ ముట్టుకోలేదు...భగవద్గీతనే నమ్ముకున్నా.. సివిల్స్ 11వ ర్యాంక్ సాయి శివాని సక్సెస్ సీక్రెట్ ఇదే  

కరాచీ స్టాక్ ఎక్స్చేంజ్ అత్యధిక విలువ కలిగి ఉన్న మార్కెట్ క్యాపిటల్ కలిగి ఉన్న యునైటెడ్ బ్యాంక్ లిమిటెడ్ (UBL), హబ్ పవర్ కంపెనీ (HUBC), హబీబ్ మెట్రో బ్యాంక్ (HMB), మారీ పెట్రోలియం (MARI), ఎంగ్రో కార్పొరేషన్ (ENGRO)  స్టాక్స్ భారీగా నష్టపోయాయి.  దీనికి తోడు IMF తన World Economic Outlookలో పాక్ వృద్ధి అంచనాలను 3% నుంచి 2.6%కు తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. Fitch రేటింగ్స్ ప్రకారం పాకిస్థాన్ రూపాయి మరింత బలహీనపడే అవకాశం ఉందని తేల్చింది.  ఈ దెబ్బతో కరాచీ స్టాక్ మార్కెట్ నుంచి ఇన్వెస్టర్లు పోలోమని తమ డబ్బులు తీసుకునేందుకు వెళ్తున్నారు దీంతో స్టాక్ మార్కెట్ కుప్పకూలే పరిస్థితి ఏర్పడింది. నిజానికి ఆసియా మార్కెట్లలో కరాచీ స్టాక్ ఎక్స్చేంజ్ మార్కెట్ క్యాప్ చాలా తక్కువ అని చెప్పవచ్చు.

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

About the Author

Bhoomi

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.  

...Read More

Trending News