Pan Card Key Updates: దేశంలో పాన్ కార్డును ఇన్‌కంటాక్స్ శాఖ జారీ చేస్తుంటుంది. పాన్ అంటే పర్మినెంట్ ఎక్కౌంట్ నెంబర్. 10 అంకెల నెంబర్ వ్యక్తి ఆర్థికపరమైన లావాదేవీలకు కీలకంగా ఉపయోగపడుతుంటుంది. పాన్ కార్డు లేకపోతే చాలా రకాల లావాదేవీలకు సమస్య ఏర్పడుతుంది.
పాన్ కార్డు అనేది ఎప్పుడూ అప్‌డేట్ అయి ఉండాలి. ముఖ్యంగా పేరు, అడ్రస్, ఫోన్ నెంబర్‌లో ఏమైనా మార్పులుంటే తప్పకుండా సరి చేసుకోవాలి. మీరు కూడా మీ పాన్ కార్డు సరిగ్గా అప్‌డేట్ అయి ఉందో లేదో సరిచూసుకోవడం చాలా అవసరం. బ్యాంక్ ఎక్కౌంట్ తెరిచేందుకు, స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ , మ్యూచ్యువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టేందుకు ఇలా ఆర్ధిక లావాదేవీలకు చాలా అవసరం. బ్యాంక్ ఎక్కౌంట్ ఓపెన్ చేసేందుకు కూడా పాన్ కార్డు అవసరం. బ్యాంకు రుణాల కోసం అప్లై చేసేందుకు, ఇన్‌కంటాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసేందుకు అన్నింటికీ పాన్ కార్డు అవసరం.
వాస్తవానికి బంగారం నగలు కొనేందుకు కూడా పాన్ కార్డు అవసరం. కానీ 2 లక్షల కంటే తక్కువ బంగారం కొనేందుకు అవసరం లేదు. 10 లక్షల కంటే ఎక్కువ విలువైన ఆస్తి కొనేందుకు పాన్ కార్డు తప్పనిసరిగా కావల్సి ఉంటుది. ఒకవేళ ఆస్తి అమ్ముతుంటే మాత్రం సేల్ డీడ్ లో పాన్ కార్డు వివరాలు నమోదు చేయాలి. రెంటల్ అగ్రిమెంట్ విషయంలో కూడా పాన్ కార్డు అవసరమౌతుంది. అందుకే పాన్ కార్డు వివరాలు ఎప్పుడూ అప్‌డేట్ అయి ఉండాలి. పాన్ కార్డులో ఏ చిన్న తప్పు ఉన్నా మీ పనుల్లో ఆటంకం కలుగుతుంది. పాన్ కార్డులో సహజంగా ఇంటి పేరు, పేరు స్పెల్లింగ్ విషయంలో తప్పులు దొర్లుతుంటాయి.
ఇక మరో వైపు పాన్ కార్డును ఆధార్ కార్డుతో అనుసంధానం తప్పనిసరి. పాన్ కార్డు - ఆధార్ కార్డు లింక్ జరగకపోతే ఇన్‌కంటాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయడం, రిఫండ్ క్లెయిమింగ్ సాధ్యం కాదు. అందుకే పాన్ కార్డు అప్‌డేట్‌గా ఉండటంతో పాటు ఆధార్ కార్డుతో అనుసంధానం తప్పనిసరి.
Also read: Rain Alert: హైదరాబాద్ ప్రజలకు వార్నింగ్, రానున్న 24 గంటల్లో భారీ వర్షం, ఉరుములు, మెరుపులు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి









