Patanjali Unit: పతంజలి సంచలనం.. ఆసియాలోనే అతిపెద్ద నారింజ ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్‌

Patanjali Asias Largest Orange Processing Plant At Nagapur: ఆయుర్వేద ఉత్పత్తులు అందిస్తున్న పతంజలి సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. ఆసియాలోనే అతి పెద్ద నారింజ మొక్కల ప్రాసెసింగ్‌ యూనిట్‌ నెలకొల్పుతున్నట్లు పతంజలి సంస్థ ప్రకటించింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Mar 7, 2025, 07:50 PM IST
Patanjali Unit: పతంజలి సంచలనం.. ఆసియాలోనే అతిపెద్ద నారింజ ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్‌

Patanjali Asias Largest Orange Processing Plant: ఆయుర్వేద ఉత్పత్తులకు కేంద్రంగా ఉన్న పతంజలి సంస్థ మరో కీలక నిర్ణయం తీసుకుంది. దేశీయ ఉత్పత్తులను ప్రోత్సహిస్తున్న ఈ సంస్థ ఆసియాలోనే అతిపెద్ద ఫుడ్ ప్రాసెసింగ్ సింగిల్ పాయింట్‌.. అతిపెద్ద యూనిట్ నెలకొల్పుతున్నట్లు ప్రకటించింది. మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో పతంజలి మెగా ఫుడ్ అండ్ హెర్బల్ పార్క్ ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించింది. దీనికి సంబంధించిన వివరాలు సంస్థ వెల్లడించింది.

Add Zee News as a Preferred Source

Also Read: Patanjali Jobs: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. పతంజలి నుంచి 10,000 జాబ్స్

నాగ్‌పూర్‌లో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో పతంజలి సంస్థ యజమాని ఆచార్య బాలకృష్ణ కీలక విషయాలు వెల్లడించారు. రైతులు, వ్యవసాయ వ్యవస్థ రూపాన్ని తాము మారుస్తామని ఆచార్య బాలకృష్ణ ప్రకటించారు. నాగ్‌పూర్‌లోని మిహాన్‌ ప్రాంతంలో ఫుడ్ పార్క్ జీరో వెస్టేజ్ సిస్టమ్ కింద బాయ్ ప్రొడక్ట్స్‌పై కూడా పని చేస్తుందని తెలిపారు. నాగ్‌పూర్‌లోని మిహాన్‌లో పతంజలి స్థాపించిన 'పతంజలి మెగా ఫుడ్ అండ్ హెర్బల్ పార్క్' ఆసియాలో అతిపెద్ద యూనిట్‌గా ఉంటుందని ఆచార్య బాలకృష్ణ వివరించారు.

Also Read: Vivo T4x 5G: అద్భుతమైన ఫీచర్లు కలిగిన 5జీ ఫోన్ రూ.17 వేలలోపే! వివో టీ4ఎక్స్‌ ఫీచర్లు ఇవే!

'నాగ్‌పూర్ భూమి దేశానికి, రాజ్యాంగానికి స్పష్టమైన రూపాన్ని ఇచ్చింది. ఇప్పుడు ఈ భూమితో దేశ రైతుల శ్రేయస్సులో విప్లవం రానుంది' అని పతంజలి సంస్థ యజమాని ఆచార్య బాలకృష్ణ తెలిపారు. ఈ నారింజ యూనిట్‌ ఆహార ప్రాసెసింగ్ ఒకే పాయింట్ అని.. ఆసియాలో అతిపెద్ద యూనిట్ అని చెప్పారు. ఈ యూనిట్‌ను స్థాపించడంలో చాలా అడ్డంకులు ఉన్నాయని వాటన్నింటినీ అధిగమించినట్లు వెల్లడించారు. ఈ యూనిట్‌ను కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ మార్చి 9వ తేదీన ఆదివారం ప్రారంభిస్తామని ప్రకటించారు. ఈ యూనిట్‌ ప్రారంభంతో విదర్భ ప్రాంత రైతులకు మంచి రోజులు లభిస్తాయని తెలిపారు. ఇక్కడి రైతుల ఆత్మహత్యలు, దుర్భర పరిస్థితులు మారిపోతాయని తమకు పూర్తి విశ్వాసం ఉన్నట్లు ఆచార్య బాలకృష్ణ ప్రకటించారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

About the Author

Ravi Kumar Sargam

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News