Patanjali Rose Sharbat: పతంజలి రోజ్ షర్బత్ .. రుచి, ఆరోగ్యం, దేశభక్తి మేళవింపు

Patanjali Rose Sharbat: ప్రముఖ యోగ గురువు బాబా రాందేవ్ రూపొందించిన పతంజలి రోజ్  షర్బత్  ప్రస్తుతం మార్కెట్లో మంచి ప్రాచుర్యం పొందుతుంది దీనికి కారణం ఈ ఆయుర్వేద షర్బత్ లో వాడే  పదార్థాల్లో ఎలాంటి కృత్రిమ రంగులు, ప్రిజర్వేటివ్‌లు, అధిక చక్కెరలు  వంటివి వాడకుండా సహజసిద్ధమైనటువంటి పదార్థాలతోనే రూపొందించడం జరిగింది. పతంజలి  ప్రాచీనమైన  పద్ధతుల ద్వారా ఆరోగ్యానికి మేలు చేసే ఈ ప్రకృతిసిద్ధమైన షర్బత్  అందించడమే  లక్ష్యంగా పనిచేసి  దాన్ని సాకారం చేసింది. 

Written by - Bhoomi | Last Updated : Apr 28, 2025, 02:03 PM IST
Patanjali Rose Sharbat: పతంజలి రోజ్  షర్బత్ .. రుచి, ఆరోగ్యం, దేశభక్తి మేళవింపు

Patanjali Rose Sharbat: ప్రముఖ యోగ గురువు బాబా రాందేవ్ రూపొందించిన పతంజలి రోజ్  షర్బత్  ప్రస్తుతం మార్కెట్లో మంచి ప్రాచుర్యం పొందుతుంది దీనికి కారణం ఈ ఆయుర్వేద షర్బత్ లో వాడే  పదార్థాల్లో ఎలాంటి కృత్రిమ రంగులు, ప్రిజర్వేటివ్‌లు, అధిక చక్కెరలు  వంటివి వాడకుండా సహజసిద్ధమైనటువంటి పదార్థాలతోనే రూపొందించడం జరిగింది. పతంజలి  ప్రాచీనమైన  పద్ధతుల ద్వారా ఆరోగ్యానికి మేలు చేసే ఈ ప్రకృతిసిద్ధమైన షర్బత్  అందించడమే  లక్ష్యంగా పనిచేసి  దాన్ని సాకారం చేసింది. 

Add Zee News as a Preferred Source

పతంజలి సంస్థ సందేశం ఏమిటంటే:

షర్బత్ లోని ప్రతి  చుక్కలోను చల్లదనం, రుచిని మాత్రమే కాదు, ఆయుర్వేద సూత్రాలను కూడా అందించాలనే లక్ష్యంగా పనిచేస్తోంది.  ప్రస్తుతం మార్కెట్లో ఉన్న కెఫీన్‌, సోడా వంటి ఆరోగ్యానికి హానికరమైన పానీయాల బదులుగా సహజమైన ఆరోగ్యకరమైన ఎంపికలను ప్రజలు ఎంచుకోవాలనే సందేశాన్ని పతంజలి ప్రచారం చేస్తోంది.

పతంజలి సంస్థ ఏం చెబుతోంది: 

వారి ఉద్దేశం కేవలం ఉత్పత్తులు అమ్మడం మాత్రమే కాదు, దాని ద్వారా గ్రామీణ పేద, గిరిజన సముదాయాలకు కూడా మద్దతు ఇవ్వడం కూడా ఒక .అంతేకాదు, పతంజలి విద్యా రంగంలో కూడా పనిచేస్తోంది. దేశ అభివృద్ధికి ప్రజలు ఆరోగ్యంగా, చదువుకొని ఉండాల్సిన అవసరం ఉందని సంస్థ నమ్ముతుంది. రోజ్  షర్బత్  వంటి ఉత్పత్తుల నుంచి వచ్చే ఆదాయంలో భాగం సామాజిక మేలు కోసం ఉపయోగించనుంది. 

పతంజలి రోజ్  షర్బత్  ప్రత్యేకత ఏమిటి?

ఇది పూర్తిగా సహజ పదార్థాలతో తయారవుతుంది. ఇందులో ఉన్న గులాబీ పూల సారం షర్బత్ ‌కు అద్భుతమైన రుచి ఇచ్చి, శరీరానికి చల్లదనాన్ని అందిస్తుంది. ఇది వేసవిలో ప్రత్యేకంగా పేరు పొందింది. ఎందుకంటే ఇది కేవలం దాహాన్ని తీర్చడం మాత్రమే కాకుండా, ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది.

Also Read:  Gold Rate Today: భారీగా తగ్గిన బంగారం ధర... అక్షయ తృతీయ ముందే మహిళలకు గుడ్ న్యూస్... ఎంత తగ్గిందో తెలిస్తే పండగే  

పతంజలి లక్ష్యం:

ఆయుర్వేద సంప్రదాయాలను ఆధునిక జీవనశైలిలో అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా పనిచేస్తోంది. 

పతంజలి దేశ సేవ పట్ల కట్టుబాటు: 

పతంజలి ఏం చెబుతోంది అంటే  “మా ప్రయత్నాలు దేశం అంతటా వ్యాప్తి చెందుతున్నాయి. ప్రతి భారతీయుడికి ఆయుర్వేదాన్ని చేరవేసి, ఆరోగ్యానికి హాని చేసే పానీయాలను దూరం చేయడమే మా లక్ష్యం. మేము పేద విద్యార్థులకు విద్యను అందించడానికి, గిరిజన ప్రజల జీవితాలను మెరుగుపరచడానికి కూడా కృషి చేస్తున్నాం. అందువల్ల, పతంజలి రోజ్  షర్బత్  కేవలం ఒక పానీయం కాదు, ఇది ఒక పెద్ద సామాజిక ఉద్యమానికి భాగం కూడా.” అని పేర్కొంది.

 

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

Bhoomi

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.  

...Read More

Trending News