Multibagger Stock : రూ.2 స్టాక్‌తో .. 9000శాతానికి పెరిగిన కంపెనీ షేర్లు.. ఈ మల్టీబ్యాగర్‌ రాబడి గురించి తెలుసా?

Kothari Industrial Corporation share: భారత స్టాక్ మార్కెట్లో సూచీలు గత కొంత కాలంగా తీవ్ర ఒడుదొడుకుల్లో కొనసాగుతున్న విషయం తెలిసిందే. అంతర్జాతీయ అనిశ్చిత పరిస్థితులు మార్కెట్లు పడిపోయేందుకు కారణం అవతున్నాయి. అయితే మార్కెట్లు పడిపోతున్నప్పటికీ కొన్ని స్టాక్స్ మాత్రం ఊహించని రీతిలో ఇన్వెస్టర్లకు మంచి లాభాలను అందిస్తున్నాయి. అలాంటి ఒక మల్టీ బ్యాగర్ స్టాక్ గురించి ఇఫ్పుడు మనం తెలుసుకుందాం.   

Written by - Bhoomi | Last Updated : Mar 17, 2025, 08:38 PM IST
Multibagger Stock : రూ.2 స్టాక్‌తో .. 9000శాతానికి పెరిగిన కంపెనీ షేర్లు.. ఈ మల్టీబ్యాగర్‌ రాబడి గురించి తెలుసా?

Kothari Industrial Corporation share:  కొంత కాలగా మార్కెట్లు భారీగ పడిపోతున్న విషయం తెలిసిందే. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాల కారణంగానే ఇలా జరుగుతోందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఆయా దేశాల నుంచి వచ్చే ఉత్పత్తులపై దిగుమతి సుంకాలను భారీగా పెంచుతుండటం కూడా ఇందుకు ప్రధాన కాణం. మెక్సికో, కెనడా , చైనా వంటి దేశాల నుంచి దిగుమతులపై భారీగా సుంకాలను ప్రకటించారు. స్టీల్, అల్యూమినియం, దిగుమతులపై 25శాతం సుంకాలను ప్రకటించారు. చైనా నుంచి వచ్చే ఉత్పత్తులపై 20శాతం కెనడా ఉక్కుపై 50శాతం సుంకాలను ప్రకటించారు. ఇంకా పలు దేశాల ఉత్పత్తులపై ప్రతీకార సుంకాలను కూడా ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే వాణిజ్య యుద్ధ భయాలు, అమెరికా వృద్ధి మందగమనం అంచనాలు మార్కెట్లను పడేస్తున్నాయని మార్కెట్ నిపుణులు అంటున్నారు. 

Add Zee News as a Preferred Source

ఈ క్రమంలోనే కొఠారి ఇండస్ట్రియల్ కార్పొరేషన్ లిమిటెడ్ షేర్లు సోమవారం మంచి ఫోకస్ లో ఉన్నాయి. కంపెనీ షేర్లు 2శాతం అప్పర్ సర్క్యూట్ ను తాకాయి. స్టాక్ ఇంట్రాడే గరిష్ట స్థాయి రూ. 162.40కి చేరుకుంది. గతేడాది కాలంలో కంపెనీ షేర్లు దాదాపు 9,000శాతం పెరిగాయి. ఒక ఏడాదిలోపు ఈ షేరు రూ. .189 నుంచి ప్రస్తుత ధరకు పెరిగింది. 

Also Read: ​IndusInd Bank Share Price: ఇండస్ఇండ్ బ్యాంక్ షేర్ల జోరు... RBI ప్రకటనతో 5శాతం పెరిగిన స్టాక్!  

ఏప్రిల్ 2, 2024న 52 వారాల కనిష్ట స్థాయి రూ. 1.82 నుండి నేడు రికార్డు గరిష్ట స్థాయికి పెరిగింది. కొఠారి ఇండస్ట్రియల్ షేర్లు BSEలో రూ.  162.40 జీవితకాల గరిష్ట స్థాయిని తాకాయి. ప్రస్తుత సెషన్‌లో, కొఠారి ఇండస్ట్రియల్ షేర్లు బిఎస్‌ఇలో మునుపటి ముగింపు రూ.159.25 నుండి 2శాతం పెరిగి రూ.162.40కి చేరుకున్నాయి. సంస్థ మార్కెట్ క్యాప్ రూ.689.94 కోట్లకు పెరిగింది. ఈ సంవత్సరం 52 వారాల కనిష్ట స్థాయి నుండి మల్టీబ్యాగర్ రాబడిని ఇచ్చింది. కొఠారి ఇండస్ట్రియల్ షేర్లు మూడు నెలల్లో 115.47%,  ఒక సంవత్సరంలో 92% పెరిగాయి. ఈ స్టాక్ ఈరోజు రికార్డు స్థాయిలో రూ.162.40ని తాకింది. ఏప్రిల్ 2, 2024న 52 వారాల కనిష్ట స్థాయి రూ.1.80కి పడిపోయింది. సాంకేతికంగా, కొఠారి ఇండస్ట్రియల్  రిలేటివ్ స్ట్రెంత్ ఇండెక్స్ (RSI) 84.5 వద్ద ఉంది. ఇది బలంగా ఓవర్‌బాట్ జోన్‌లో ట్రేడవుతోందని సూచిస్తుంది. ఈ స్టాక్ 10 రోజులు, 20 రోజులు, 30 రోజులు, 50 రోజులు, 100 రోజులు, 150 రోజులు,  200 రోజుల మూవింగ్ యావరేజ్‌లకు మించి ట్రేడవుతోంది.

Also Read: Jio Recharge Plans: జియో చీప్ అండ్ బెస్ట్ అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్ రీఛార్జ్

పెట్టుబడి పరంగా చూసినట్లయితే సరిగ్గా 11నెల కిందట ఈ స్టాక్ లో రూ. లక్ష పెట్టుబడి పెట్టినవారికి 88.50లక్షలు వచ్చాయని చెప్పవచ్చు. డిసెంబర్ త్రైమాసికంలో రిటైన్ పెట్టుబడిదారులు ఇందులో తమ పెట్టుబడులను పెంచుకున్నారు. సెప్టెంబర్ త్రైమాసికంలో వీరి వాటా 41.3శాతం ఉండగా..డిసెంబర్ నాటికి అది 53శాతానికి పెరిగింది. ఈ కంపెనీలో లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు కూడా 1.89శాతం వాటా ఉంది. మిగతా 44.1 శాతం వాటా కంపెనీ ప్రమోటర్ల దగ్గర ఉంది. ఈ కంపెనీ విషయానికి వస్తే ఇది ఫెర్టిలైజర్స్ మాన్యుఫ్యాక్షరింగ్, బ్లెండింగ్ రంగంలో ఉంది. ఫిబ్రవరి నెలల ఈ కంపెనీ అసోం ప్రభుత్వంలో ఒక కీలక ఒప్పందం చేసుకుంది. దీని కారణంగా కూడా స్టాక్ ధర పెరుగుతోంది. ముఖ్యంగా గత పదిరోజులుగా ఈ స్టాక్ అప్పర్ సర్క్యూట్ కొడుతూనే ఉంది. 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

 

About the Author

Bhoomi

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.  

...Read More

Trending News