Global Investors Summit: మధ్య ప్రదేశ్ రాజధాని భోపాల్ లో ప్రపంచస్థాయి ఇన్వెస్టర్ల శిఖరాగ్ర సదస్సు జరిగింది. రెండు రోజులపాటు జరిగిన ఈ సదస్సును ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రారంభించారు. ఈ సదస్సుకు దేశ విదేశాల నుంచి పెద్దెత్తున ఇన్వెస్టర్లు హాజరయ్యారు. లక్షల కోట్ల మేర పెట్టుబడులను ప్రకటించారు. అయితే ఈ కార్యక్రమంలో సామాన్య ప్రజల కోసం ఏర్పాట్లు మాత్రం అరకొరగా ఉన్నాయి.
ఈ సదస్సు కు వచ్చిన సామాన్యులు భోజన ప్లేట్ల కోసం కొట్టాడుకుంటున్న ద్రుశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో గెస్టులు హాజరయ్యారు. అయితే సరైన సౌకర్యాలు లేకపోవడంతో భోజన సమయంలో వారంతా ప్లేట్ల కోసం పోటీ పడ్డారు. దీంతో కొన్ని ప్లేట్లు విరిగిపోయాయి. ఈ ద్రుశ్యాలపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. ప్రపంచస్థాయి సదస్సులో ఇలాంటి ఏర్పాట్లు బాధాకరమంటూ మండిపడుతున్నాయి.
ఫిబ్రవరి 24నుంచి 25 వరకు ఈ ఇన్వెస్టర్ల సదస్సు జరిగింది. ఇందులో తమ రాష్ట్రంలో రూ. 26.61లక్షల కోట్లకు పైగా పెట్టుబడులకు ఒప్పందాలు కుదిరినట్లు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ వెల్లడించారు. ఈ ప్రతిపాదిత ఒప్పందాలు అమలు అయితే రాష్ట్రంలో 17.3లక్షల ఉపాధి అవకాశం స్రుష్టించవచ్చని తెలిపారు.
Urban dehaatism in display at MP investors summit. Soon, Netas and Babus will fight for their share of commision. pic.twitter.com/2hI8UJr2yA
— Lord Immy Kant (Eastern Exile) (@KantInEast) February 26, 2025
Also Read: Gold Rate Today: మహాశివరాత్రి వేళ మహిళలకు గుడ్ న్యూస్..భారీగా పడిపోయిన బంగారం ధరలు..ఎంతంటే?
MP Global Investors Summit or
PM Gareeb Kalyan Anna Yojna ? pic.twitter.com/c4V1INYLQS— Newton Bank Kumar (@idesibanda) February 26, 2025
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook









