)
Brahmins Benefiting from Russian Oil: భారత్ పై అమెరికా కుట్ర బయటపడుతోంది. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నామన్న అక్కసుతోనే భారత్ పై 50శాతం సుంకాలు విధించింది అమెరికా. ముడి చమురు కొనుగోలు చేయడం ద్వారా ఉక్రెయిన్ లో యుద్ధం చేసేందుకు భారత్ రష్యాకు నిధులు సమకూరుస్తోందని ట్రంప్ గతంలో ఆరోపించిన సంగతి తెలిసిందే. అప్పుడు వైట్ హౌస్ డొనాల్డ్ ట్రంప్ వ్యాపార సలహాదారుగా ఉన్న పీటర్ నువారో ఉక్రెయిన్ యుద్ధాన్ని మోదీ యుద్ధంగా పిలిచారు. తర్వాత నవారూ భారత్ లోని కొంతమంది వ్యాపారవేత్తలు రష్యాన్ చమురు నుంచి ప్రయోజనం పొందుతున్నారని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు పీటర్ నవారో మరోసారి రెచ్చిపోయారు. భారత్ లోని బ్రాహ్మణులు రష్యన్ చమురు నుంచి ప్రయోజనం పొందుతున్నారంటూ మెంటల్ కామెంట్స్ చేశారు. సాధారణంగా వాణిజ్య సంబంధమైన అంశాలకే పరిమితమయ్యే సలహాదారు ఇలా ఒక దేశపు కుల వ్యవస్థను ప్రస్తావించడం ఆశ్యర్యంగా ఉందని నిపుణులు సైతం అంటున్నారు.
భారత్, రష్యా నుంచి చమురు దిగుమతులు చేస్తోందన్న విషయం అంతర్జాతీయంగా కొత్తదేమీ కాదు. కానీ దాన్ని నేరుగా ఒక వర్గంతో పోల్చి చూడటం, కల వివాదాలను ప్రస్తావించడం వెనక వేరే రాజకీయ ఉద్దేశ్యం దాగి ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే అమెరికా ఎప్పుడూ కూడా ఆర్థిక ఒత్తిడిని పెంచే ప్రయత్నమే చేస్తుంది. కానీ ఇంత లోతైన సామాజిక విభజనపై మాటు రావడం ఒక కొత్త వ్యూహానికి సంకేతమని నిపుణులు చెబుతున్నారు.
భారత్, రష్యా నుంచి చమురు కొనుగోళ్ల చేయడాన్ని విమర్శించడం వేరే విషయం. కానీ ఆర్థిక విషయాన్ని కుల వ్యవహారాలతో ముడిపెట్టడం అనేది చాలా ప్రమాదకరమని అమెరికన్ థింక్ ట్యాంక్ కు చెందిన నిపుణులు డెరెక్ జె. గ్రాస్ మన్ వ్యాఖ్యానించారు. ఆయన మాటల్లో స్పష్టత ఉంది. కానీ అమెరికా విదేశాంగ విధానం ఎప్పటికీ ఒక దేశంలో కుల అశాంతిని రెచ్చగొట్టే విధంగా ఉండకూడదని అన్నారు.
అమెరికా 'బ్రాహ్మణులపై' హింసను కోరుకుంటుందా?
ఈ వ్యాఖ్యలు పీటర్ నవారో వ్యక్తిగత వ్యాఖ్యలు కాకపోవచ్చని.. ఇదంతా ఒక రాజకీయ కుట్ర కావచ్చని మరికొంతమంది విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అమెరికా అంతర్గత రాజకీయాలు, అంతర్జాతీయ వ్యూహాలు కలిపి ఇలాంటి ప్రకటనలు చేసేందుకు కారణమైన ఉండవచ్చని అంటున్నారు. భారత్ లో కుల విభజనలను చూపించి బలహీనపరిచే ప్రయత్నంలో భాగంగానే కొన్ని వర్గాలు ఉన్నాయన్నది స్పష్టంగా కనిపిస్తోందని చెబుతున్నారు.
మొత్తానికి రష్యా చమురు కొనుగోళ్లను ప్రశ్నించే పేరుతో అమెరికా మరో ఆట ఆడుతున్నట్లు సుస్పష్టంగా కనిపిస్తోంది. అది కేవలం ఆర్థిక ఒత్తిడి మాత్రమే కాదు..భారత సమాజంలో కుల విభేదాలను రగల్చే ప్రయత్నం కూడా కావచ్చని అర్థమవుతోంది. పీటర్ నవారో చేసిన తాజా వ్యాఖ్యలు సాధారణమైనవి కావు. వాటిని తేలికగా తీసుకోకూడదని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. రెచ్చగొట్డడం, ఉగ్రవాదం, అశాంతిని వ్యాప్తి చేయడం, ప్రతిపక్ష నాయకులకు డబ్బులు అందించడం, ఎన్జీవోలకు నిధులు సమకూర్చి ఆయా దేశాలను అస్థిరపరిచే సుదీర్ఘ చరిత్ర అమెరికాకు ఉంది. అమెరికా కొన్ని దేశాల్లో ఇలాంటి అరాచకాలకు పాల్పడిన ఘటనలు ఎన్నో ఉన్నాయి. అందులో కొన్ని చూసినట్లయితే..
ఇరాన్ (1953) - దేశంలో అల్లర్లను రెచ్చగొట్టినందుకు ప్రధాన మంత్రి మొహమ్మద్ మొస్సాదేగ్ను CIA తొలగించింది.
గ్వాటెమాల (1954) – అశాంతి కారణంగా డెమోక్రాటిక్ అధ్యక్షుడు జాకోబో అర్బెంజ్ అధికారం నుండి తొలగించారు.
కాంగో (1961) – ప్రధాన మంత్రి పాట్రిస్ లుముంబా హత్య,అధికార మార్పు, అమెరికాపై ప్రత్యక్ష నింద.
బ్రెజిల్ (1964) – అధ్యక్షుడు గౌలార్ట్పై సైనిక తిరుగుబాటుకు అమెరికా ప్రత్యక్షంగా మద్దతు ఇచ్చింది.
చిలీ (1973) - డెమొక్రాటిక్ అధ్యక్షుడు సాల్వడార్ అల్లెండేను అమెరికా అధికారం నుండి తొలగించింది.
గ్రీస్ (1967) - అమెరికా సహాయంతో, సైన్యం ఆ దేశ ప్రభుత్వాన్ని పడగొట్టి సైనిక పాలన విధించింది.
ఇరాక్ (2003) – సద్దాం హుస్సేన్‌ను అధికారం నుండి తొలగించి ఉరితీశారు.
లిబియా (2011) – గడాఫీ ప్రభుత్వం కూలదోచారు. తరువాత అల్లరిమూకలు చంపారు.
పాకిస్తాన్- ఇమ్రాన్ ఖాన్ తన ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు అమెరికా ప్రయత్నిస్తోందని ఆరోపించారు
2024లో బంగ్లాదేశ్‌లో షేక్ హసీనా ప్రభుత్వాన్ని పడగొట్టడం వెనుక అమెరికా హస్తం ఉందని ఆరోపణలు
వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురోను అధికారం నుంచి తొలగించడానికి అమెరికా చాలా కాలంగా ప్రయత్నిస్తోంది.
అమెరికా ప్రత్యక్ష్యంగా పాల్గొన్న జాబితా చిన్నదే. కానీ పరోక్షంగా రెచ్చగొట్టి జాబితా చాలా పెద్దగానే ఉంటుందని చెప్పవచ్చు. భారత్ లో అధికార మార్పు తీసుకువచ్చేందుకు అమెరికా చాలా ప్రయత్నించినప్పటికీ సీఐఏ, అమెరికన్ పాలన ఇప్పటి వరకు భారత్ లో పాచికలు పారలేదు. ముఖ్యంగా భారత ప్రజలు జాగ్రత్తగా ఉండటం, అమెరికా కుట్రను అన్ని విధాలుగా భగ్నం చేయడం, అలాంటి శక్తులకు తగిన సమాధానం ఇవ్వాలంటున్నారు విశ్లేషకులు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.