)
PM E-Drive Scheme 2026: ప్రస్తుతం మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాల సందడి భారీగా పెరిగింది. మరోవైపు ఆటోలు టాక్సీలు కూడా ఎలక్ట్రిక్ వాహనాలు వైపు మొగ్గు చూపుతున్నాయి. ఈ సందర్భంలో కేంద్ర ప్రభుత్వం ఒక పథకాన్ని నిరుద్యోగ యువత కోసం అందుబాటులోకి తెచ్చింది దీని ద్వారా ఎలక్ట్రిక్ వాహనాలను సబ్సిడీ రేటు పైన తీసుకోవచ్చు. PM E-Drive Scheme 2026.. EV Vehicle Subsidy పథకం ద్వారా ఎలక్ట్రిక్ వాహనాలను తక్కువ ధరకు పొంది చక్కగా వ్యాపార అవకాశాలను అందిపుచ్చుకోవచ్చు. ఈ పథకం కింద ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేసినప్పుడు సబ్సిడీ ఎలా పొందవచ్చో వివరంగా ఇప్పుడు మనం తెలుసుకుందాం
PM E-Drive Scheme 2026 పథకం లక్ష్యం:
దేశంలో ఎలక్ట్రానిక్ వాహనాల (EVs) వాడకాన్ని పెంచడం, పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించడం, ఈవీ వాహనాలను తక్కువ ధరలకు ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం. దీని ప్రధాన ఉద్దేశ్యంగా చెప్పవచ్చు.
సబ్సిడీ వివరాలు:
కేంద్ర ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చిన ఈ స్కీం ప్రకారం ఎలక్ట్రిక్ వాహనాల పైన సబ్సిడీ పొందవచ్చు అది ఎలాగో తెలుసుకుందాం.
>>ఎలక్ట్రిక్ టూ వీలర్స్ (E2W): బ్యాటరీ కెపాసిటీని బట్టి ఒక్కో వాహనానికి గరిష్టంగా రూ. 10,000 వరకు సబ్సిడీ వస్తుంది.
>>ఎలక్ట్రిక్ త్రీ వీలర్స్ (E3W): గరిష్టంగా రూ. 50,000 వరకు సబ్సిడీ లభిస్తుంది.
>>ఎలక్ట్రిక్ బస్సులు (E-Buses): గరిష్టంగా రూ. 35 లక్షల వరకు సబ్సిడీ వస్తుంది.
>>ఎలక్ట్రిక్ ట్రక్కులు (E-Trucks): గరిష్టంగా రూ. 1.25 కోట్లు వరకు సబ్సిడీ లభిస్తుంది (ఎక్స్-ఫ్యాక్టరీ ప్రైస్ పైన 10% డిస్కౌంట్ తో పాటు).
ఈ పథకం ద్వారా ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుకు కూడా ప్రభుత్వం మద్దతు అందించడం దీని ప్రత్యేకతగా చెప్పవచ్చు.
సబ్సిడీని ఇలా పొందవచ్చు:
>> ఎలక్ట్రిక్ వాహనాలపై సబ్సిడీని PM E-Drive డిజిటల్ వోచర్ ద్వారా పొందవచ్చు. ఈ వోచర్ ఆధార్ అథెంటికేషన్ ద్వారా లభిస్తుంది.
>> ముందుగా ఈ స్కీమ్ అందుబాటులో ఉన్న ఆథరైజ్డ్ షోరూమ్‌కు వెళ్లి మీ అవసరాలకు తగిన వాహనాన్ని ఎంచుకోవాలి.
>> ఆ తర్వాత వాహన డీలర్ PM E-Drive పోర్టల్ ద్వారా సబ్సిడీ ప్రాసెస్ ప్రారంభిస్తారు.
>> యాప్ ద్వారా ఫోటో, ఆధార్ స్కాన్ చేసి, ఆధార్ బేస్డ్ e-KYC పూర్తి చేస్తారు.
>> రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు వచ్చిన లింక్ ద్వారా డిజిటల్ వోచర్ డౌన్లోడ్ చేసుకోవాలి.
>> వోచర్‌పై సంతకం చేసి డీలర్‌కు ఇవ్వాలి. డీలర్ దానిని పోర్టల్‌లో అప్లోడ్ చేస్తారు. సబ్సిడీ మొత్తం ఇన్‌స్టంట్‌గా వెహికల్ ధర నుండి డిడక్ట్ అవుతుంది, మిగిలిన బ్యాలెన్స్ మాత్రమే మనం చెల్లించాలి.
ఈ స్కీం కోసం అర్హతలు ఇవే:
>> భారతీయ పౌరుడై ఉండాలి.
>> వాహనాన్ని ఆథరైజ్డ్ డీలర్ వద్ద మాత్రమే కొనాలి.
>> EV వాహన తయారీదారు PM E-Drive స్కీమ్ కింద రిజిస్టర్ అయి ఉండాలి.
>> వాహనంలో అడ్వాన్స్డ్ బ్యాటరీ ఉండాలి.
>> ఒక ఆధార్‌పై ఒక కేటగిరీలోని వాహనానికి మాత్రమే సబ్సిడీ వస్తుంది.
>> మొబైల్ నంబర్ ఆధార్‌తో లింక్ అయి ఉండాలి.
>> వాహనం తప్పనిసరిగా RTO తో రిజిస్టర్ అయి ఉండాలి.
సబ్సిడీకి అర్హత లేని వాహనాలు ఇవే:
>> ప్రైవేట్ ఎలక్ట్రిక్ కార్లు.
>> ప్రభుత్వ శాఖలు కొనుగోలు చేసే వాహనాలు.
>> సెకండ్ హ్యాండ్ లేదా రీసేల్ వాహనాలు (కేవలం కొత్త వాహనాలకు మాత్రమే).
సబ్సిడీ ఉన్న EV బైక్‌ల వివరాలు (Eligible EV Bike Models):
PM E-Drive పోర్టల్ AY ఏ బైక్‌లకు సబ్సిడీ ఉందో తెలుసుకోవచ్చు. Ola (రోడ్‌స్టర్ ఎక్స్‌ప్రెస్, S1 ప్రో, S1), Ather (450 SHR) వంటి మోడళ్లకు సబ్సిడీ యాక్టివ్‌గా ఉంది.
పూర్తి వివరాల కోసం https://pmedrive.heavyindustries.gov.in సైటును సంప్రదించండి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
.Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి