PPF Account Closure: పీపీఎఫ్ ఎక్కౌంట్ మెచ్యూరిటీ కంటే ముందే క్లోజ్ చేయడం ఎలా

PPF Account Closure: ఉద్యోగులకు ఈపీఎఫ్ ఎక్కౌంట్ ఎలా ఉంటుందో సాధారణ ప్రజలకు పబ్లిక్ ప్రోవిడెంట్ ఫండ్ అలాంటిది. భవిష్యత్ సంరక్షణకు అద్భుతంగా ఉపయోగపడుతుంది. అయితే పీపీఎఫ్ ఎక్కౌంట్ ఎలా క్లోజ్ చేయాలి, ఎప్పుడు క్లోజ్ చేయాలనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Feb 24, 2025, 09:11 PM IST
PPF Account Closure: పీపీఎఫ్ ఎక్కౌంట్ మెచ్యూరిటీ కంటే ముందే క్లోజ్ చేయడం ఎలా

PPF Account Closure: పబ్లిక్ ప్రోవిడెంట్ ఫండ్ అనేది ఓ నిర్దిష్ట వ్యవధికై ఉంటుంది. ఒకవేళ ఎవరైనా క్లోజ్ చేయాలని అనుకుంటే అందుకు సంబంధించి నిబంధనలు ఉంటాయి. పీపీఎఫ్ ఎక్కౌంట్ క్లోజ్ చేయాలంటే కనీసం ఐదేళ్లు ఆగాల్సిందే. పీపీఎఫ్ ఎక్కౌంట్ ఎలా క్లోజ్ చేయాలో తెలుసుకుందాం.

Add Zee News as a Preferred Source

పబ్లిక్ ప్రోవిడెంట్ ఫండ్‌కు ఆదరణ ఎక్కువ. ఎలాంటి రిస్క్ లేకుండా అధిక రిటర్న్స్ అందించే పధకం ఇది. అందుకే చాలామంది ఆసక్తి చూపిస్తుంటారు. పీపీఎఫ్ ఎక్కౌంట్‌లో వడ్డీ 7.10 ఉంటుంది. 15 ఏళ్ల నిర్దిష్ట కాల వ్యవధి ఉంటుంది. ఈ సమయంలో విత్‌డ్రాయల్ అనేది సాధ్యం కాదు. ముందుగా ఎక్కౌంట్ క్లోజ్ చేసేందుకు వీలుండదు. ఒకవేళ విత్‌ డ్రాయల్ ఉన్నా చాలా తక్కువ అవకాశాలు ఉంటాయి. పీపీఎఫ్ ఎక్కౌంట్ ఒకసారి ఓపెన్ చేశాక కనీసం ఐదేళ్ల వరకూ క్లోజ్ చేయడానికి ఉండదు. పీపీఎఫ్ ఎక్కౌంట్ క్లోజ్ చేయాలంటే ఫామ్ 5 ఇతర డాక్యుమెంట్లు సమర్పించాల్సి ఉంటుంది. ప్రీ క్లోజర్ అనేది కొన్ని షరతులకు లోబడి, ఎక్కౌంట్ ఓపెన్ చేసిన ఐదేళ్ల తరువాతే అవుతుంది. 

పీపీఎఫ్ ఎక్కౌంట్ క్లోజ్ చేయడం ఎలా

ముందుగా మీ పీపీఎఫ్ ఎక్కౌంట్ ఎక్కడ ఉందో అక్కడికి బ్యాంక్ లేదా పోస్టాఫీసుకు వెళ్లాలి. పీపీఎఫ్ ఎక్కౌంట్ క్లోజర్‌కు సంబంధించి ఫామ్ 5 ఫిల్ చేసి ఇవ్వాలి. మీరు ముందస్తుగా పీపీఎఫ్ ఎక్కౌంట్ ఎందుకు క్లోజ్ చేయాలనుకుంటున్నారో వివరించాలి. అందుకు సంబంధించిన కాగితాలు సమర్పించాల్సి ఉంటుంది. మెడికల్ ఎమర్జెన్సీ అయితే ఆసుపత్రి లేదా మెడికల్ బిల్స్ సమర్పించాలి. ఉన్నత చదువులకు అయితే ఫీజు రిసీప్ట్ ఇవ్వాలి. ఎన్ఆర్ఐలు రెసిడెన్స్ స్టేటస్ మార్చితే వీసా లేదా పాస్‌పోర్ట్ ఇవ్వాలి. వెరిఫికేషన్ తరువాత బ్యాంక్ లేదా పోస్టాఫీసు మీ దరఖాస్తును ప్రోసెస్ చేస్తుంది. మీ సమాచారం కచ్చితంగా ఉండే పీపీఎఫ్ ఎక్కౌంట్ క్లోజ్ అవుతుంది. ఒకసారి క్లోజ్ అయిన తరువాత మీ డబ్బులు మీ సేవింగ్ ఎక్కౌంట్‌కు బదిలీ అవుతాయి. మొత్తం ప్రక్రియ పూర్తయ్యేందుకు వారం నుంచి పది రోజులు పడుతుంది. 

Also read: SLBC Tunnel Project: SLBC ప్రాజెక్టు ఎందుకు ఆలస్యమౌతోంది, ఈ ప్రాజెక్టు అవసరమేంటి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

About the Author

Trending News