)
Penny Stock: స్మాల్ క్యాప్ కేటగిరీకి చెందిన ట్రేడింగ్ సెక్టార్ స్టాక్ ప్రాధిన్ లిమిటెడ్ షేర్హోల్డర్లకు గుడ్ న్యూస్ చెప్పబోతోంది. తాజాగా కంపెనీ ప్రకటించిన వివరాల ప్రకారం.. సెప్టెంబర్ 7వ తేదీన జరగబోయే బోర్డు సమావేశంలో బోనస్ షేర్ల జారీకి సంబంధించిన ప్రతిపాదనపై చర్చించి ఆమోదం తెలిపే అవకాశం ఉంది.
బోనస్ షేర్స్ ప్రతిపాదన:
కంపెనీ ఎక్స్చేంజ్ ఫైలింగ్ ప్రకారం.. 10:1 రేషియోలో బోనస్ షేర్లు ఇవ్వబోతున్నారు. అంటే ఎవరైతే ప్రస్తుతం రూ. 1 ఫేస్ వ్యాల్యూ ఉన్న 1 ఈక్విటీ షేర్ కలిగి ఉంటారో.. వారికి అదనంగా 10 కొత్త ఈక్విటీ షేర్లు బోనస్‌గా లభిస్తాయన్నమాట. ఈ వార్తతో ఇన్వెస్టర్లలో మరింత ఉత్సాహం పెరిగింది.
షేర్ ప్రదర్శన:
ఈరోజు ట్రేడింగ్ సెషన్లో ప్రాధిన్ లిమిటెడ్ షేర్ ధర 2.7శాతం లాభపడి అప్పర్ సర్క్యూట్‌ను తాకింది. ప్రస్తుతం ఈ షేరు రూ. 0.38 వద్ద ట్రేడ్ అవుతోంది. ఈ షేరు గత నెలలోనే 27శాతం లాభాన్ని షేర్హోల్డర్లకు అందించింది. అయితే దీర్ఘకాలంలో చూస్తే ఈ షేరు ఎక్కువ నష్టాలను కూడా చవిచూసింది. గత ఆరు నెలల్లో 94శాతం నష్టం, ఏడాదిలో 97శాతం నష్టం, ఐదేళ్లలో 96శాతం నష్టం నమోదైంది.
క్వార్టర్ 1 ఫైనాన్షియల్స్:
2026 ఆర్థిక సంవత్సరానికి చెందిన జూన్ త్రైమాసిక ఫలితాలు మిశ్రమంగా ఉన్నాయి. కంపెనీ నికర లాభం గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 20శాతం పెరిగి రూ. 7.17 కోట్లు నమోదైంది. కానీ మరోవైపు ఆపరేటింగ్ రెవెన్యూ భారీగా తగ్గింది. గత ఏడాది రూ. 132.12 కోట్లుగా ఉన్న రెవెన్యూ, ఈ ఏడాది అదే త్రైమాసికంలో 91.2శాతం పడిపోతూ రూ. 11.62 కోట్లు మాత్రమే నమోదైంది.
మార్కెట్ అవుట్‌లుక్:
ప్రస్తుతం ఈ కంపెనీ మార్కెట్ క్యాప్ సుమారు రూ. 37 కోట్లు మాత్రమే. షార్ట్ టర్మ్‌లో షేరు అప్పర్ సర్క్యూట్లు తాకుతూ లాభాలను ఇస్తున్నప్పటికీ, దీర్ఘకాలంలో రిస్క్ ఎక్కువగా ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయినా, బోనస్ షేర్ల ప్రతిపాదన కారణంగా ఇన్వెస్టర్ల దృష్టి ఇప్పుడు పూర్తిగా ప్రాధిన్ లిమిటెడ్పైనే కేంద్రీకృతమైంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.