Trump Tariffs India Today : భారత ప్రధాని మోదీపై కీలక వ్యాఖ్యలు చేశారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. భారత ఉత్పత్తులపై 26శాతం సుంకాలు విధిస్తున్నట్లు ప్రకటించిన ట్రంప్..మోదీ గురించి ప్రస్తావించారు. తనకు మోదీ మంచి స్నేహితుడు అని తెలిపారు. అయితే భారత్ అమెరికాతో సరైన విధంగా వ్యవహరించడం లేదంటూ వ్యాఖ్యాంచారు. 52శాతం సుంకాలను విధిస్తోందన్నారు ట్రంప్. కాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారతదేశంతో సహా అనేక దేశాలపై పరస్పర సుంకాలను ప్రకటించారు. ట్రంప్ ఈ సుంకానికి 'డిస్కౌంటెడ్ రెసిప్రొకల్ టారిఫ్' అని పేరు పెట్టారు.
వాణిజ్య విషయానికి వచ్చినప్పుడు కొన్నిసార్లు స్నేహితుడు కూడా శత్రవు కంటే ప్రమాదకరమని ట్రంప్ ఆరోపించారు. దక్షిణ కొరియాలో తయారు అవుతున్న కార్లు 80శాతం అక్కడే అమ్ముడవుతున్నాయి. జపాన్ లో తయారువుతున్ కార్లు అక్కడే 90శాతం అమ్ముడుపోతాయి. అదే అమెరికాలో తయారువుతన్న కార్లు అక్కడ తక్కువ సంఖ్యలోనే అమ్ముడవుతున్నాయి. అమెరికాకు చెందిన ఫోర్డు కార్లు ఇతర దేశాల్లో చాలా పరిమిత సంఖ్యలో అమ్మకాలు జరుగుతున్నాయి. ఈ అసమతుల్యత అమెరికాకు భారీ నష్టం కలిగిస్తోంది. అందుకే అన్ని విదేశీ ఆటో మొబైల్స్ పై 25శాతం సుంకాలు ఈ అర్థరాత్రి నుంచి విధించనున్నామని ట్రంప్ చెప్పారు.
Also Read: Hyderabad Real Estate: వామ్మో.. ఇది అసలు ఊహించలేదు.. హైదరాబాద్ లో ఇళ్ల అమ్మకాలు ఢమాల్.. 3 నెలల్లో
ఇతర దేశాలు అమెరికాను ఒక చెడు దేశంగా చూస్తున్నాయి. అమెరికా దిగుమతులపై అసమానమైన సుంకాలు విధించాయి. అమెరికాలో ఉత్పత్తులు తయారు చేసే కంపెనీలపై ఎలాంటి పన్నులు వసూలు చేయమని..తాను ప్రతీకార పన్నుల ప్రతిపాదన తేవడంతో అనేక దేశాల రాజులు, రాయబారులు వీటిపై స్పందించారు. పన్నులపై మినహాయింపులు కోరాను. అయితే మీరుసుంకాలు తగ్గిస్తేనే తాను తగ్గిస్తానని చెప్పారు. కరెన్సీని మార్చుకోవద్దని బిలియన్ డాలర్ల అమెరికా వస్తువులను కొనాలని చెప్పానని ట్రంప్ పేర్కొన్నారు.
Also Read: US Tariffs: ప్రపంచంపై ట్రంప్ సుంకాల కొరడా...భారత్ పై ఎంత విధించిందంటే?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









