Trump Tariffs and US Recession: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏప్రిల్ 2న పరస్పర సుంకాలను ప్రకటించినప్పటి నుండి, అమెరికాతో సహా ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లలో భూకంపం సంభవించింది. శుక్రవారం అమెరికన్ స్టాక్ మార్కెట్ కుప్పకూలింది. ట్రంప్ 'లిబరేషన్ డే' సుంకాల తర్వాత మార్కెట్ పతనం కారణంగా పెట్టుబడిదారులు దాదాపు 6 ట్రిలియన్ డాలర్లు (సుమారు రూ. 500 లక్షల కోట్లు) నష్టపోయారని AFP నివేదిక తెలిపింది. కోవిడ్ యుగం తర్వాత ఇది అతిపెద్ద వారపు క్షీణత, కానీ ట్రంప్ మార్కెట్ గందరగోళం వల్ల ప్రభావితం కాలేదని, తన నిర్ణయంపై దృఢంగా ఉన్నారని తెలుస్తోంది.
ఆర్థిక వినాశనాన్ని పట్టించుకోకుండా తన ట్రూత్ సోషల్‌లో దీనిని "ధనవంతులు కావడానికి ఒక సువర్ణావకాశం"గా అభివర్ణించాడు. "అమెరికాలో భారీగా పెట్టుబడులు పెట్టిన పెట్టుబడిదారులకు నా విధానాలు ఎప్పటికీ మారవని నేను చెప్పాలనుకుంటున్నాను. ఇది ధనవంతులు కావడానికి గొప్ప సమయం.. గతంలో కంటే ధనవంతులు కావడానికి ఇది చాలా బాగుంది అని ఆయన రాశారు.
తన టారిఫ్ ప్లాన్ ద్వారా అమెరికా ఎలా ధనవంతులవుతుందో డోనాల్డ్ ట్రంప్ తప్ప మరెవరూ ఇంకా అర్థం చేసుకోలేదు . అమెరికాకు చెందిన ప్రధాన ఆర్థిక సంస్థ జెపి మోర్గాన్ కూడా ఇప్పుడు ప్రపంచ మాంద్యం ప్రమాదాన్ని 40శాతం నుండి 60శాతానికి పెంచింది. బ్లూమ్‌బెర్గ్ నివేదిక ప్రకారం, జెపి మోర్గాన్ చీఫ్ ఎకనామిస్ట్ బ్రూస్ కాస్మాన్ తన నివేదికకు దేర్ విల్ బి బ్లడ్ అని పేరు పెట్టారు. అమెరికా స్థూల దేశీయోత్పత్తిపై తీవ్ర ప్రభావం చూపే ప్రమాదం ఉందని జేపీ మోర్గాన్ కు చెందిన ఆర్థిక వేత్త మైఖేల్ ఫెరోలి వెల్లడించారు.
ప్రపంచ దేశాలపై ట్రంప్ విధించి ప్రతీకార సుంకాలే దీనికి ప్రధాన కారణమని..ఆర్థిక మాంద్యంతో అమెరికాలో నిరుద్యోగ రేటు 5.3శాతానికి పెరగనుందని మైఖేల్ ఫెరోలి అంచనా వేశారు. నిరుద్యోగ సమస్య ఏర్పాడే ప్రమాదం ఉందని అన్నారు. బ్యూరో ఆఫ్ లేబర్ స్టాటిస్టిక్స్ రిపోర్టు ప్రకారం మార్చిలో నిరుద్యోగ రేటు 4.2శాతంగా ఉన్నట్లు మైఖేల్ ఫెరోలి చెప్పారు. మార్చిలో ఉద్యోగ నియామకాలు బలంగా ఉన్నప్పటికీ కార్పొరేట్ మార్జిన్లు, వినియోగదారుల డిమాండ్ పై ట్రంప్ ప్రతీకార సుంకాల ప్రభావంతో ఉద్యోగ నియామకాలు తగ్గే ప్రమాదం ఉందని ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు. రాబోయే రోజుల్లో నిత్యావసర వస్తువుల ధరలు పెరగడం నుంచి వ్రుద్ధిరేటు మందగిస్తుందని చెప్పారు. ఆర్థిక వ్యవస్థను గాడినపెట్టేందుకు ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ వడ్డీరేట్లను తగ్గించే ఛాన్స్ ఉందని ఆర్థిక వేత్తలు కూడా అంచనా వేస్తున్నారు.
ప్రపంచదేశాల నుంచి అమెరికాకు దిగుమతి అయ్యేవస్తువులు 20శాతం కంటే ఎక్కువగనే తగ్గనున్నట్లు మరో ఆర్థిక వేత్త జోనాథన్ పింగిల్ అంచనా వేశారు. రాబోయే త్రైమాసికాల్లో అమెరికా జీడీపీలో దిగుమతులు 1986కు ముందు స్థాయిలకు తగ్గే ప్రమాదం ఉందన్నారు. భారత్ సహా అన్ని ప్రపంచదేశాలపై ప్రతీకార సుంకాలతో విరుచుకుపడ్డారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తమతో వాణిజ్య లావాదేవీలు ఉన్న దేశాలన్నింటిపైనా ఆయన టారిఫ్స్ విధించారు. భారత్ 26శాతం, వియాత్నం 46శాతం, ఇజ్రాయెల్ 17శాతం టారిఫ్స్ వేశారు. అన్నిదేశాల వారు కూడా తమ ఉత్పత్తులను అమెరికా మార్కెట్లో అమ్ముకోవచ్చు కానీ 10శాతం సుంకం చెల్లించాలని ట్రంప్ స్పష్టం చేశారు. భారత్ కు విధించిన మొత్తం 27శాతం టారిఫ్ లో 10శాతం సుంకం ఏప్రిల్ 5నుంచి అమల్లోకి రానుండగా..మిగతాది ఏప్రిల్ 10 నుంచి విధించనున్నట్లు సమాచారం. ట్రంప్ప చేసిన ప్రకటనతో స్టాక్ మార్కెట్లు కుదేలయ్యాయి. అమెరికాతోపాటు అన్ని ప్రధాన మార్కెట్లు పతనమవుతున్నాయి.
Also Read: Trump Tariff War: ట్రంప్ టారిఫ్ వార్‌పై కేంద్రం స్పెషల్ ఫోకస్.. నెక్ట్స్ ఏం జరగనుంది?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి









