Psychology Facts: ఒంటరితనం కూడా ఓ వ్యసనమే? ఎక్కువసేపు ఒంటరిగా ఉండటం 15 సిగరెట్లు కాల్చడంతో సమానం.. ఈ షాకింగ్ ఫ్యాక్ట్స్ తెలుసుకోండి..!!

Psychology Facts: మన మనస్సు, అలవాట్లు, ప్రవర్తనల గురించి మనస్తత్వశాస్త్రం అనేక ఆసక్తికరమైన నిజాలను వెల్లడిస్తుంది. మానవ మనస్సు ఎలా పనిచేస్తుందో అర్థం చేసుకోవడానికి, భావోద్వేగాలు ఎలా ఏర్పడతాయో తెలుసుకోవడానికి ఇది ఒక శాస్త్రీయ అధ్యయనమని చెప్పాలి. మనం ఎందుకు ఒక విధంగా ప్రవర్తిస్తాము..  ఆ ప్రవర్తన వెనుకున్న కారణాలేమిటో, మన లోపల దాగి ఉన్న భావోద్వేగాలేమిటో అర్థం చేసుకోవడంలో మనస్తత్వశాస్త్రం కీలక పాత్ర పోషిస్తుంది.

Written by - Bhoomi | Last Updated : Nov 16, 2025, 11:54 AM IST
Psychology Facts: ఒంటరితనం కూడా ఓ వ్యసనమే? ఎక్కువసేపు ఒంటరిగా ఉండటం 15 సిగరెట్లు కాల్చడంతో సమానం.. ఈ షాకింగ్ ఫ్యాక్ట్స్ తెలుసుకోండి..!!

Psychology Facts: మన మనస్సు, అలవాట్లు, ప్రవర్తనల గురించి మనస్తత్వశాస్త్రం అనేక ఆసక్తికరమైన నిజాలను వెల్లడిస్తుంది. మానవ మనస్సు ఎలా పనిచేస్తుందో అర్థం చేసుకోవడానికి, భావోద్వేగాలు ఎలా ఏర్పడతాయో తెలుసుకోవడానికి ఇది ఒక శాస్త్రీయ అధ్యయనమని చెప్పాలి. మనం ఎందుకు ఒక విధంగా ప్రవర్తిస్తాము..  ఆ ప్రవర్తన వెనుకున్న కారణాలేమిటో, మన లోపల దాగి ఉన్న భావోద్వేగాలేమిటో అర్థం చేసుకోవడంలో మనస్తత్వశాస్త్రం కీలక పాత్ర పోషిస్తుంది. ఇది చేతన,  అపస్మారక, మనస్సుల్ని పరిశీలించి మన ఆలోచనల లోతులను గుర్తిస్తుంది. మనకు ప్రియమైన వారు.. స్నేహితులు, బంధువులు, కుటుంబ సభ్యులు.. వీరిని కౌగిలించుకున్నప్పుడు, ఆ స్పర్శ మన మెదడులో సహజ నొప్పి నివారణలాంటిది పనిచేస్తుందని పరిశోధనలు చెబుతున్నాయి. అంటే ఒక సాధారణ కౌగిలింత కూడా మనసుకు ఆత్మస్థైర్యం, భద్రత, సాంత్వనను అందించే శక్తివంతమైన భావోద్వేగ ప్రభావం కలిగి ఉంటుంది. కానీ ఒంటరితనం కూడా ఒక వ్యసనమే అని చెబుతోంది. ఎక్కువసేపు ఒంటరిగా ఉండటం అనేది 15 సిగరెట్లు కాల్చడంతో సమానమని పేర్కొంది. ఈ షాకింగ్ ఫ్యాక్ట్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 

Add Zee News as a Preferred Source

- ప్రపంచంలోని దాదాపు 99 శాతం మంది ప్రజలకు ప్రయాణించడం అంటే ఇష్టం. కొందరికి పర్వతాలు అంటే ఇష్టం..మరికొందరికి అడవులు, నదులు లేదా కొత్త ప్రదేశాలను అన్వేషించడం ఇష్టం. ప్రయాణం మనసుకు కొత్త అనుభూతులు, సంతోషం అందిస్తుందని మనస్తత్వశాస్త్రం చెబుతోంది.

- దాదాపు 90 శాతం మంది తమ భావాలను మాటలతో చెప్పలేకపోతారు. అందుకే వారు సందేశాలు, నోట్స్ లేదా లేఖల ద్వారా తమ భావోద్వేగాలను సులభంగా వ్యక్తపరుస్తారు.

- మీకు ఒక పాట ఎందుకు చాలా ఇష్టం ఉంటుందో తెలుసా? ఆ పాట మీ జీవితంలోని ఒక సంఘటన, భావోద్వేగం లేదా ప్రత్యేక జ్ఞాపకంతో ముడిపడి ఉండే అవకాశం ఉంది. అందుకే ఆ పాట విన్నప్పుడు మళ్లీ ఆ క్షణంలోకి మనసు ప్రయాణిస్తుంది.

- ఎవరినైనా చాలా మిస్ అవుతున్నప్పుడు, ప్రత్యేక కారణం లేకపోయినా మనసుకు బాధగా అనిపిస్తుంది. ఇది భావోద్వేగ అనుబంధం బలంగా ఉన్న సంకేతం.

- మనుషులు మొదటగా ఒకరి ముఖం వైపు చూస్తారు. ఆ తరువాత, వారు ధరించిన బూట్లు, దుస్తులు వంటి విషయాలను గమనిస్తారు. ఇది మొదటి ఇంప్రెషన్ ఎలా ఏర్పడుతుందో చూపిస్తుంది.

- రెండు ఎంపికలు ఉన్నప్పుడు, మనం ముందుగా అనిపించిన ఎంపికే ఎక్కువగా సరైనదై ఉంటుంది. ఎందుకంటే అది మన అంతర్మనస్సు ఇచ్చే సహజ స్పందన.

- మనస్తత్వశాస్త్రం ప్రకారం, ఒక వ్యక్తి కేవలం నాలుగు నిమిషాల్లోనే ప్రేమలో పడవచ్చు. అంటే ఆకర్షణ, భావోద్వేగ అనుబంధం చాలా వేగంగా చోటుచేసుకుంటాయి.

- మనం ఎవరితో ఎక్కువ సమయం గడుపుతామో, వారి అలవాట్లు, ప్రవర్తనలను మనం తెలియకుండానే అలవర్చుకుంటాము. ఇది మనిషి సహజ మిమిక్రీ నైపుణ్యం.

Also Read: Business Ideas: నవంబర్-డిసెంబర్ మధ్య ఈ పంట సాగు చేస్తే.. ఎకరాకు రూ. 2 లక్షల లాభం..!!  

- మన ముక్కు 50,000 రకాల వాసనలను గుర్తుంచుకోగలదు. ఇది మన శరీరంలోని అత్యంత శక్తివంతమైన గుర్తింపులలో ఒకటి.

- మీరు కొత్త లేదా ఇష్టమైన దుస్తులు ధరించినప్పుడు సహజంగానే మంచి ఫీలింగ్ వస్తుంది. ఎందుకంటే అది మన ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది.

- ఎక్కువ అబద్ధాలు చెప్పే వ్యక్తులు, ఇతరుల అబద్ధాలను సులభంగా గుర్తించగలరు. ఎందుకంటే వారు అబద్ధం చెప్పే పద్ధతులను బాగా తెలుసుకుని ఉంటారు.

- మీ ప్రాణ స్నేహితునితో (సోల్‌మేట్‌తో) వివాహం చేసుకుంటే విడాకుల అవకాశాలు 70 శాతం తగ్గుతాయి. ఎందుకంటే భావోద్వేగ అనుబంధం బలంగా ఉంటుంది.

- మీ ఆలోచనలు రాయడం ద్వారా ఒత్తిడిని తగ్గిస్తుంది. రాయడం మనసులోని భారం బయటకు వచ్చే ప్రక్రియ.

- ఒక మనిషి ఒకేసారి కేవలం మూడు విషయాలనే స్పష్టంగా గుర్తుంచుకోగలడు. ఇది మెదడులోని తాత్కాలిక జ్ఞాపకశక్తి పరిమితి.

- తమతో తాము మాట్లాడుకునే వ్యక్తులు తెలివైనవారిగా భావించుకుంటారు. ఎందుకంటే వారు తమ ఆలోచనలను సక్రమంగా ప్రాసెస్ చేస్తుంటారు.

- మన కోసం ఖర్చు చేసేదానికంటే, ఇతరుల కోసం ఖర్చు చేస్తే ఎక్కువ ఆనందం లభిస్తుంది. ఇచ్చే సంతోషం సహజంగా ఎక్కువ.

- హాస్యప్రియులు, కామెడీన్స్ వంటి వారు బయటకు నవ్వినా, లోపల ఎక్కువ నిరాశను ఎదుర్కొంటారు. ఇది ‘సాడ్ క్లౌన్ సిండ్రోమ్’ గా కూడా పిలుస్తారు.

- ఒక వ్యక్తి రాత్రి ఆలస్యంగా ఎవరితోనైనా మాట్లాడితే, ఎక్కువగా నిజమైన మాటలే బయటకు వస్తాయి. ఎందుకంటే ఆ సమయంలో మనసు బలహీనంగా, నిజాయితీగా ఉంటుంది.

Also Read:  Gold Discovery: డ్రాగన్ చేతిలో బంగారు పర్వతం..1000 టన్నులకుపైగా నిల్వలు.. పసిడి ప్రపంచంలో ఆధిపత్యం దిశగా చైనా..!!

- ఇతరులను సంతోషపెట్టడానికి ఎల్లప్పుడూ ప్రయత్నించే వ్యక్తులు చివరికి ఒంటరితనం, అసంతృప్తిని అనుభవిస్తారు. ఎందుకంటే తమ భావాలను అణచిపెట్టుకుంటారు.

- ప్రజలు నిజమైన వార్తలకన్నా పుకార్లను వేగంగా నమ్ముతారు. ఇది మనసు సహజంగా నెగటివ్ సమాచారాన్ని ఎక్కువగా పట్టుకోవడమే కారణం.

-ఎక్కువగా నవ్వే వ్యక్తులు నిజానికి ఎక్కువగా బాధను భరించగల శక్తి కలిగి ఉంటారు. నవ్వు వారి భావోద్వేగ కవచం.

- ఏడు సంవత్సరాల కన్నా ఎక్కువ కాలం స్నేహం కొనసాగితే, అది జీవితాంతం నిలిచే అవకాశం చాలా ఎక్కువ.

- ఎక్కువసేపు ఒంటరిగా ఉండటం రోజుకు 15 సిగరెట్లు కాల్చినంత హానికరం. ఇది మానసిక, శారీరక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

About the Author

Bhoomi

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.  

...Read More

Trending News