Rapido Planning For Food Delivery: నిమిషాల్లోనే మీకు నచ్చిన ఆహార పదార్థాలను ఇంటికి తెచ్చి ఇస్తుండటంతో ఫుడ్ డెలివరీ విభాగానికి భారీ ఆదరణ పెరుగుతోంది. దీంతో ఈ విభాగంలో అడుగుపెట్టాలని ప్రముఖ క్యాబ్ బుకింగ్ సేవల సంస్థ ర్యాపిడో చూస్తోంది. రానున్న రోజుల్లోనే ఈ తరహా సేవలను బెంగళూరులో ప్రారంభించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
వెస్ట్‌బ్రిడ్జ్ క్యాపిటల్ మద్దతుతో రాపిడో, మెక్‌డొనాల్డ్స్, కెఎఫ్‌సి, పిజ్జా హట్ ఫ్రాంచైజీ ఆపరేటర్లతో పాటు ఇతర క్విక్ సర్వీస్ రెస్టారెంట్లు, క్లౌడ్ కిచెన్ చైన్‌లతో చర్చలు జరుపుతోందని నివేదిక పేర్కొంది.
Also Read: Patanjali: పతంజలి గులాబీ షర్బత్ : లాభం కోసం కాదు, దేశ సేవ కోసం రూపొందించిన ఈ షర్బత్ ప్రత్యేకతలు ఇవే
కాగా ఫుడ్ డెలివరీ విభాగంలో ప్రస్తుతం స్విగ్గీ, జొమాటో ఈరెండు సంస్థలే ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. దీంతో ఈ విభాగంలో గట్టి పోటీ ఇచ్చేందుకు ర్యాపిడూ ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. దీనికోసం కేఎఫ్ సీ,పిజ్జా హట్ తో పాటు క్విక్ సర్వీస్ రెస్టారెంట్లు , క్లౌడ్ కిచెన్స్ తో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. పైలట్ ప్రోగ్రామ్ లో భాగంగా బెంగళూరులోని కొన్ని ప్రాంతాల్లోనే తొలుత ఈ సేవలను అందించనుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









