RBI Statement: రూ.100, రూ.200 నోట్లపై ఆర్బీఐ సంచలన ప్రకటన.. ఏం చెప్పిందో తెలుసా?

RBI Big Decision On Rs 100 RS 200 Currency Notes: భారత కరెన్సీ నోట్లపై రిజర్వ్‌ బ్యాంక్‌ కీలక ప్రకటన చేసింది. రూ.100, రూ.200 నోట్లపై బ్యాంకులు.. ఏటీఎం సరఫరాదారులకు కొత్త ఆదేశాలు ఇచ్చింది. ఆ ఆదేశాలు సెప్టెంబర్‌ 30 నుంచి అమల్లోకి రానున్నాయి.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Apr 29, 2025, 06:59 PM IST
RBI Statement: రూ.100, రూ.200 నోట్లపై ఆర్బీఐ సంచలన ప్రకటన.. ఏం చెప్పిందో తెలుసా?

Indian Currency Notes: చలామణీలో ఉన్న రూ.100, రూ.200 నోట్లపై భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ కీలక ప్రకటన జారీ చేసింది. ఆర్బీఐ తీసుకున్న పెద్ద నిర్ణయంతో నోట్ల సరఫరాపై కీలక ప్రభావం చూపనుంది. తాజాగా తీసుకున్న కీలక నిర్ణయం ఈ ఏడాది సెప్టెంబర్ 30వ తేదీ అమల్లోకి రానుంది. ఈ మేరకు ఆర్‌బీఐ ఆదేశాలు ఇచ్చింది. ఆర్‌బీ తాజా నోటిఫికేషన్‌తో నోట్ల చలామణీ మరింత పెరగనుంది. ప్రజల మధ్య నోట్లు అందుబాటులోకి రానున్నాయి. అన్ని ఏటీఎమ్‌లలో 75 శాతం కనీసం ఒక క్యాసెట్ నుంచి రూ.100 లేదా రూ.200 నోట్లను పంపిణీ చేయాలని ఆదేశించింది.

Add Zee News as a Preferred Source

Also Read: RTC Employees: ఆర్టీసీ ఉద్యోగులకు జాక్‌పాట్.. 'ఆ ఉద్యోగులు తిరిగి విధుల్లోకి'

ప్రస్తుతం అందరూ డిజిటల్‌ పేమెంట్లు చేస్తున్నా కూడా ప్రజలకు నగదు అనేది అవసరమే. కానీ నగదు అవసరమైన సమయంలో అందుబాటులో లేకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అలాంటి పరిస్థితి లేకుండా తాజాగా ఆర్‌బీఐ కీలక ప్రకటన చేసింది. ప్రధాన బ్యాంకులకు రిజర్వుబ్యాంక్‌ కీలక సూచన చేసింది. మార్కెట్‌లో నగదు కొరత తీవ్రమవుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఏటీఎమ్‌లలో రూ.100, రూ.200 నోట్లను పంపిణీ చేసేలా చూడాలని సూచించింది.

Also Read: DA Hike: ప్రభుత్వ ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్లు.. డీఏ పెంపుతోపాటు 8 భారీ కానుకలు

బ్యాంకులు, వైట్‌ లేబుల్‌ ఏటీఎం ఆపరేటర్లు దశలవారీగా రూ.100, రూ.200 నోట్లను అందుబాటులోకి తీసుకురావాలనే ప్రతిపాదను అమలులోకి తేవాలని ఆర్బీఐ స్పష్టం చేసింది. ప్రస్తుతం మార్కెట్‌లో తరచుగా వినియోగించే నోట్లను విరివిగా అందుబాటులో ఉంచాలని ఆర్‌బీఐ ఆదేశించింది. నోట్ల చలామణీని పెంపొందించే ప్రయత్నంలో భాగంగా అన్ని బ్యాంకులు, వైట్‌ లేబుల్‌ ఆపరేటర్లు తమ ఏటీఎంలలో రూ.100, రూ.200 నోట్లను క్రమం తప్పకుండా పంపిణీ చేసేలా చూడాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. సెప్టెంబర్‌ 30, 2025 నాటికి దేశవ్యాప్తంగా ఉన్న 75 శాతం ఏటీఎంల్లో ఈ నోట్లలో కనీసం ఒక్క నోట్‌నైనా పంపిణీ చేయాలని పేర్కొంది.

ఆర్‌బీఐ ఆదేశాలు

  • సెప్టెంబర్ 30, 2025 నాటికి అన్ని ఏటీఎమ్‌లలో 75 శాతం కనీసం ఒక క్యాసెట్ నుంచి రూ.100, రూ.200 డినామినేషన్ నోట్లను పంపిణీ చేయాలి.
  • మార్చి 31, 2026 నాటికి అన్ని ఏటీఎంలలో 90 శాతం కనీసం ఒక క్యాసెట్ నుంచి రూ.100, రూ.200 డినామినేషన్ నోట్లను పంపిణీ చేయాలి.

రిజర్వ్ బ్యాంక్ నోట్ల రద్దు చేసిన తర్వాత 2017లో రూ.200 నోట్లను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఆ తర్వాత నోట్ల వినియోగం తగ్గినా కూడా మార్కెట్‌లో మాత్రం నోట్లు అవసరం.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

About the Author

Ravi Kumar Sargam

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News