)
RBI New Rule Phone Loan: లోన్ మీద ఫోన్ కొనేవారి సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది. EMIలు కట్టకుండా డిఫాల్ట్ అయ్యే వారి కారణంగా బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలు భారీగా నష్టపోతున్నాయి. ఈ సమస్యను నియంత్రించేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్తగా షాకింగ్ రూల్‌ను తీసుకురానుందని సమాచారం. ఇకపై EMI చెల్లించకపోతే మీ ఫోన్ పనిచేయకుండా లాక్ అయ్యే అవకాశం ఉంటుందట.
కొత్త నిబంధన ఏంటి?
భవిష్యత్తులో మీరు లోన్ మీద ఫోన్ కొనుగోలు చేస్తే, ముందే ఒక షరతుకు అంగీకరించాలి. "రుణం తిరిగి చెల్లించకపోతే ఫోన్ లాక్ అవుతుంది" అన్న కండీషన్‌కు మీ అనుమతి తీసుకుంటారు. EMIలు కట్టకపోతే బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలు మీ ఫోన్‌ను రిమోట్‌గా లాక్ చేస్తాయి.
గతంలో ఉన్న విధానం:
ఇది కొత్త విషయం కాదు. గతంలో కూడా కొంతమంది రుణదాతలు ఈ విధానాన్ని వాడేవారు. ఫోన్లో ముందే ఇన్స్టాల్ చేసిన యాప్ ద్వారా, EMIలు కట్టకపోతే ఫోన్‌ను లాక్ చేసేవారు. అయితే డేటా ప్రైవసీ సమస్యల కారణంగా RBI 2023లో ఈ విధానాన్ని నిషేధించింది. ఇప్పుడు మాత్రం కఠినమైన నియమాలతో మళ్లీ అనుమతించే ఆలోచనలో ఉంది.
ఎందుకు మళ్లీ ఈ సిస్టమ్?
2024లో హోమ్ క్రెడిట్ ఫైనాన్స్ చేసిన అధ్యయనంలో దేశంలో తీసుకునే చిన్న రుణాల్లో మూడింట ఒక వంతు రుణాలు ఫోన్లు, ఎలక్ట్రానిక్స్ కొనుగోలుకే వినియోగిస్తున్నారని తేలింది. ముఖ్యంగా మొబైల్ ఫోన్లను EMIలతో కొనుగోలు చేసే వారి సంఖ్య ఎక్కువ. ఈ రుణాలు తిరిగి రాకపోవడంతో బ్యాంకులు, NBFCలు నష్టపోతున్నాయి. అందుకే RBI ఈ కొత్త రూల్‌ను మళ్లీ ఆలోచిస్తోంది.
డేటా సేఫ్టీపై హామీ:
ఫోన్ లాక్ అవుతుందే తప్ప, వినియోగదారుల వ్యక్తిగత డేటా మాత్రం పూర్తిగా సురక్షితంగా ఉంటుందని RBI చెబుతోంది. అంటే ఫోన్ వాడలేని పరిస్థితి వస్తుంది కానీ, ఫోటోలు, కాంటాక్టులు, వాట్సాప్ డేటా బ్యాంకులకు యాక్సెస్ ఉండదు.
బ్యాంకులు, ఫైనాన్స్ కంపెనీలకు లాభం:
ఈ రూల్ అమల్లోకి వస్తే, బజాజ్ ఫైనాన్స్, డీఎంఐ ఫైనాన్స్, చోళమండలం ఫైనాన్స్ వంటి పెద్ద సంస్థలకు రుణ వసూళ్లు సులభమవుతాయి. ముఖ్యంగా లక్ష రూపాయల లోపు ఇచ్చే చిన్న రుణాలను వసూలు చేయడం సులభమవుతుంది. కస్టమర్లను ఆకర్షించేందుకు ఇప్పటికే చాలామంది జీరో కాస్ట్ EMIలు, స్పెషల్ ఆఫర్లు ఇస్తున్నారు. ఈ కొత్త రూల్ వలన డిఫాల్టర్లకు చెక్ పడుతుంది.
వినియోగదారులపై ప్రభావం:
ఈ నిర్ణయం వలన వినియోగదారుల హక్కులపై ప్రభావం పడుతుందని కొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఫోన్ లాక్ అయితే, ఉపాధి, విద్య, బ్యాంకింగ్ సేవలు దెబ్బతినే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. కానీ రుణ డిఫాల్టులు పెరుగుతున్న నేపధ్యంలో బ్యాంకులకు అనుకూలంగా RBI ఈ నిర్ణయం తీసుకునే అవకాశముంది.
వినియోగదారులకు అలర్ట్:
మీరు కొత్తగా ఫోన్ కొనాలని అనుకుంటే, ముందు డబ్బులు కూడబెట్టుకొని నేరుగా కొనుగోలు చేయడం మంచిది. ఒకవేళ EMIలో కొనుగోలు చేస్తే, ప్రతి నెలా డ్యూతేదీకి తప్పకుండా చెల్లించండి. లేకపోతే మీ ఫోన్ పనిచేయకుండా లాక్ అయ్యే ప్రమాదం తప్పదు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.