Real Estate: కేవలం రూ. 20లక్షలకే సొంతింటి కలను నిజం చేసుకోండి.. హైదరాబాద్ లోని ఈ ప్రాంతంలో హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్న ఇండ్లు..!!

Real Estate: హైదరాబాద్‌ రియల్ ఎస్టేట్ రంగం ప్రస్తుతం దేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతాల్లో ఒకటిగా నిలిచింది. ముఖ్యంగా నగరంలోని పశ్చిమ ప్రాంతాలు అయిన.. గచ్చిబౌలి, కోకాపేట, మాదాపూర్, హైటెక్ సిటీ, నార్సింగి, కొండాపూర్ వంటి ప్రాంతాల్లో ఐటీ కంపెనీలు విస్తరించడంతో భూముల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ ప్రాంతాల్లో అపార్ట్మెంట్ ప్లాట్లు కనీసం ఒక కోటి రూపాయల నుంచి ప్రారంభమవుతుండగా, విల్లాల ధరలు ఐదు కోట్ల నుంచి ఇరవై కోట్ల రూపాయల వరకు పెరిగిపోయాయి.

Written by - Bhoomi | Last Updated : Nov 6, 2025, 08:39 PM IST
Real Estate: కేవలం రూ. 20లక్షలకే సొంతింటి కలను నిజం చేసుకోండి.. హైదరాబాద్ లోని ఈ ప్రాంతంలో హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్న ఇండ్లు..!!

Add Zee News as a Preferred Source

Real Estate: హైదరాబాద్‌ రియల్ ఎస్టేట్ రంగం ప్రస్తుతం దేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతాల్లో ఒకటిగా నిలిచింది. ముఖ్యంగా నగరంలోని పశ్చిమ ప్రాంతాలు అయిన.. గచ్చిబౌలి, కోకాపేట, మాదాపూర్, హైటెక్ సిటీ, నార్సింగి, కొండాపూర్ వంటి ప్రాంతాల్లో ఐటీ కంపెనీలు విస్తరించడంతో భూముల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ ప్రాంతాల్లో అపార్ట్మెంట్ ప్లాట్లు కనీసం ఒక కోటి రూపాయల నుంచి ప్రారంభమవుతుండగా, విల్లాల ధరలు ఐదు కోట్ల నుంచి ఇరవై కోట్ల రూపాయల వరకు పెరిగిపోయాయి.

ఇలాంటి పరిస్థితుల్లో సాధారణ మధ్యతరగతి కుటుంబం హైదరాబాద్‌లో సొంత ఇంటిని కలగా భావించడం కష్టమనిపిస్తుంది. కానీ, ఆ కలను నెరవేర్చుకోవడం అసాధ్యం కాదు. కేవలం 20 లక్షల రూపాయలకే హైదరాబాద్‌లో సొంత ఇంటి కల నిజం చేసుకోవచ్చు. పశ్చిమ హైదరాబాద్‌ రియల్ ఎస్టేట్ బూమ్‌లో ఉండగా, తూర్పు ప్రాంతాలు మాత్రం ఇంకా మధ్యతరగతి ప్రజలకు అందుబాటులోనే ఉన్నాయి. ఉప్పల్, ఎల్‌బీనగర్, కాప్రా, అల్వాల్ వంటి ప్రాంతాల్లో ఇప్పటికీ ఇళ్ల ధరలు చాలా తక్కువగా ఉన్నాయి. ఇక్కడ సింగిల్ బెడ్‌రూమ్ అపార్ట్మెంట్లు కేవలం రూ. 20 లక్షల నుంచి ప్రారంభమవుతాయి.

Also Read: Real Estate: తెలంగాణలో రెండవ అతిపెద్ద నగరం.. మరో గచ్చిబౌలి అవ్వడం పక్కా.. ఈ ప్రాంతం ఇప్పుడు ఇన్వెస్టర్ల ఫేవరెట్.. ఎక్కడో తెలుసా?

వీటి విస్తీర్ణం సాధారణంగా 500 నుండి 600 చదరపు అడుగుల వరకు ఉంటుంది. ఈ అపార్ట్మెంట్లు ఎక్కువగా పాత ప్రాజెక్టుల్లో కనిపిస్తాయి. ఎందుకంటే గతంలో డెవలపర్లు సింగిల్ బెడ్‌రూమ్ యూనిట్లను ఎక్కువగా నిర్మించేవారు. కానీ ప్రస్తుతం కొత్త ప్రాజెక్టుల్లో వీటి నిర్మాణం తగ్గిపోవడంతో, మార్కెట్లో ఇవి ఎక్కువగా రీసేల్ ఫ్లాట్ల రూపంలో లభ్యమవుతున్నాయి. తూర్పు హైదరాబాద్‌ ప్రస్తుతం రవాణా, మౌలిక సదుపాయాలు, మెట్రో కనెక్టివిటీ పరంగా వేగంగా అభివృద్ధి చెందుతోంది. మెట్రో లైన్ విస్తరణ, రింగ్ రోడ్ కనెక్టివిటీ, అలాగే ఐటీ కారిడార్‌కి సమీపంగా ఉండడం వలన ఈ ప్రాంతాలు భవిష్యత్తులో మంచి రాబడి ఇస్తాయని రియల్ ఎస్టేట్ నిపుణులు చెబుతున్నారు.

Also Read: Real Estate: మాజీ సీఎం ఫాంహౌజ్ పక్కన ఒకప్పుడు ఎకరం భూమి రూ. 50వేలు.. ఇప్పుడు ఎంతో తెలిస్తే దిమ్మతిరిగి మైండ్ బ్లాంక్ అవుతుంది..!!

ఇదే సమయంలో, ఇక్కడి జీవన వ్యయం పశ్చిమ హైదరాబాద్‌తో పోల్చితే చాలా తక్కువగా ఉంటుంది. అంటే ఉద్యోగి వేతనంతోనే EMI లేదా అద్దె లాంటి ఖర్చులను సులభంగా నిర్వహించవచ్చు. హైదరాబాద్‌ నగరంలో ప్రైమ్ లొకేషన్లలో గృహ ధరలు కోట్ల రూపాయల స్థాయికి చేరుకున్నప్పటికీ, తూర్పు ప్రాంతాలు మాత్రం సాధారణ కుటుంబాల కలలను సాకారం చేసే అవకాశం ఇస్తున్నాయి. సరైన ప్రణాళికతో, సెకండ్ సేల్స్ మార్కెట్‌ను పరిశీలించి, సరైన స్థలాన్ని ఎంచుకుంటే కేవలం 20 లక్షల పెట్టుబడితో సొంత ఇంటిని కలవచ్చని రియల్ ఎస్టేట్ విశ్లేషకులు సూచిస్తున్నారు.

Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. దయచేసి దీన్ని పెట్టుబడి, ఆర్థిక లేదా వ్యాపార సలహాగా భావించవద్దు. గుర్తుంచుకోండి స్టాక్ మార్కెట్లు, మ్యూచువల్ ఫండ్స్, క్రిప్టోకరెన్సీలు, రియల్ ఎస్టేట్, విలువైన లోహాలు వంటి అన్ని రకాల పెట్టుబడులు మార్కెట్ ఆటు పోటులు రిస్కులకు లోబడి ఉంటాయి. దీని అర్థం, మీరు లాభపడవచ్చు లేదా నష్టపోవచ్చు. మీరు తీసుకునే ఎలాంటి పెట్టుబడి నిర్ణయాలు లేదా వ్యాపార కార్యకలాపాల వల్ల కలిగే నష్టాలు లేదా లాభాలకు మా సంస్థ జీ తెలుగు వెబ్ పోర్టల్ ఎట్టి పరిస్థితుల్లోనూ బాధ్యత వహించదు. ఏదైనా ఆర్థిక నిర్ణయం తీసుకునే ముందు, తప్పకుండా ఒక రిజిస్టర్డ్ లేదా సర్టిఫైడ్ ఆర్థిక నిపుణుడిని సంప్రదించి, వారి సలహా తీసుకోమని పాఠకులకు సిఫార్సు చేస్తున్నాము.

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

About the Author

Bhoomi

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.  

...Read More

Trending News