)
Real Estate: దేశంలోనే అత్యంత వేగంగా డెవలప్ అవుతున్న మెట్రో నగరాల్లో హైదరాబాద్ కూడా ఒకటిగా నిలిచింది. నగరంలోని పశ్చిమ ప్రాంతం గచ్చిబౌలి, హైటెక్ సిటీ, నానకరాంగూడ, కోకాపేట్ వంటి ప్రాంతాలు.. ఐటీ పరిశ్రమ విస్తరణతో రియల్ ఎస్టేట్ కేంద్రాలుగా మారాయి. ఈ ప్రాంతాల్లో భూముల ధరలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. సాధారణ మధ్యతరగతి ప్రజలకు ఇల్లు కొనుగోలు చేయడం దాదాపు అసాధ్యమనే చెప్పాలి. అయినా కూడా హైదరాబాద్ తూర్పు ప్రాంతం మాత్రం ఇప్పటికీ అందుబాటులో ఉన్న ధరలతో సొంతింటి కలను నెరవేర్చుకునే అవకాశాన్ని కల్పిస్తోంది.
తూర్పు హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ అభివృద్ధి వేగంగా జరుగుతున్నా.. పశ్చిమ ప్రాంతంతో పోలిస్తే ఇక్కడ భూముల ధరలు తక్కువగానే ఉన్నాయని. ఈ ప్రాంతంలో కేవలం రూ. 25 లక్షలతోనే ఒక చిన్న ఇల్లు లేదా ఫ్లాట్‌ను కొనుగోలు చేయవచ్చు. దీనివల్ల మధ్యతరగతి కుటుంబాలకు కూడా సొంత ఇంటి కల సాకారం చేసుకోవచ్చు. రియల్ ఎస్టేట్ నిపుణుల ప్రకారం, తూర్పు ప్రాంతంలో అభివృద్ధి వేగంగా జరుగుతుండటంతో, ఇక్కడ పెట్టుబడి పెడితే భవిష్యత్తులో మంచి లాభాలు దక్కే అవకాశం ఉందని చెబుతున్నారు.
ఇటీవల హైదరాబాద్ నగరంలోని రాయదుర్గం ప్రాంతంలో ప్రభుత్వం నిర్వహించిన భూవేలంలో ఒక ఎకరం భూమి రూ.177 కోట్లకు అమ్ముడుపోయిన సంగతి తెలిసిందే. ఇది దేశంలోనే అత్యధిక ధరగా రికార్డు క్రియేట్ చేసింది. ఇది నగరంలో భూములపై ఉన్న విపరీతమైన డిమాండ్‌ను స్పష్టంగా చూపిస్తోంది. రియల్ ఎస్టేట్ ధరలు పెరగడానికి ప్రధాన కారణంగా ఐటీ రంగం విస్తరణ, ఉద్యోగ అవకాశాల పెరుగుదల, మౌలిక సదుపాయాల అభివృద్ధి, నగరంలోకి పెద్ద సంఖ్యలో ప్రజల వలస అని నిపుణులు చెబుతున్నారు.
అయితే, ఇక హైదరాబాద్‌లో సామాన్యులు ఇల్లు కొనలేరా? అన్న ప్రశ్నకు ఇది సమాధానం కాదు. ఇప్పటికీ తూర్పు హైదరాబాద్‌లో అందుబాటులో ఉన్న పాత అపార్ట్మెంట్లు, సెకండ్ సేల్ ఫ్లాట్లు ద్వారా తక్కువ పెట్టుబడితో సొంత ఇల్లు కల సాధ్యమే. ఈ పాత అపార్ట్మెంట్లలో ప్రధానంగా 1-BHK (సింగిల్ బెడ్రూమ్) ఫ్లాట్లు అమ్మకానికి అందుబాటులో ఉన్నాయి. వీటి విస్తీర్ణం సుమారు 600 చదరపు అడుగుల నుంచి ప్రారంభం అవుతుంది. ధరలు రూ.25 లక్షల నుండి మొదలవుతాయి.
వీటిని ముఖ్యంగా విజయవాడ హైవే, వరంగల్ హైవే, కరీంనగర్ హైవే పరిసర ప్రాంతాల్లో కొనుగోలు చేయవచ్చు. ఈ హైవేలకు సమీపంలో ఉన్న కాలనీలు నగరానికి దగ్గరగా ఉండటంతో పాటు రవాణా సౌకర్యాలు కూడా మెరుగ్గా ఉన్నాయి. రాబోయే కొన్నేళ్లలో ఈ ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ భారీగా పెరుగుతాయని అంచనా వేస్తున్నారు. అందువల్ల ఇప్పుడు ఇలాంటి ప్రాపర్టీల్లో పెట్టుబడి పెడితే అది భవిష్యత్తులో మంచి రాబడిని అందించే అవకాశం ఉందని రియల్ ఎస్టేట్ విశ్లేషకులు అంటున్నారు.
మొత్తం మీద, తూర్పు హైదరాబాద్ ప్రాంతం తక్కువ పెట్టుబడితో సొంత ఇల్లు కలను నెరవేర్చుకునే ఆర్థికంగా చౌకైన ఎంపికగా నిలుస్తోంది. నగరంలోని రియల్ ఎస్టేట్ వేగంగా విస్తరిస్తున్న సమయంలో, ఈ ప్రాంతం మధ్యతరగతి కుటుంబాలకు ఒక గోల్డెన్ ఛాన్స్ అని చెప్పవచ్చు.
Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. దయచేసి దీన్ని పెట్టుబడి, ఆర్థిక లేదా వ్యాపార సలహాగా భావించవద్దు. గుర్తుంచుకోండి స్టాక్ మార్కెట్లు, మ్యూచువల్ ఫండ్స్, క్రిప్టోకరెన్సీలు, రియల్ ఎస్టేట్, విలువైన లోహాలు వంటి అన్ని రకాల పెట్టుబడులు మార్కెట్ ఆటు పోటులు రిస్కులకు లోబడి ఉంటాయి. దీని అర్థం, మీరు లాభపడవచ్చు లేదా నష్టపోవచ్చు. మీరు తీసుకునే ఎలాంటి పెట్టుబడి నిర్ణయాలు లేదా వ్యాపార కార్యకలాపాల వల్ల కలిగే నష్టాలు లేదా లాభాలకు మా సంస్థ జీ తెలుగు వెబ్ పోర్టల్ ఎట్టి పరిస్థితుల్లోనూ బాధ్యత వహించదు. ఏదైనా ఆర్థిక నిర్ణయం తీసుకునే ముందు, తప్పకుండా ఒక రిజిస్టర్డ్ లేదా సర్టిఫైడ్ ఆర్థిక నిపుణుడిని సంప్రదించి, వారి సలహా తీసుకోమని పాఠకులకు సిఫార్సు చేస్తున్నాము.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook