Jio Recharge plan: జియో నుంచి అత్యంత చౌక రీఛార్జ్ ప్లాన్, రోజుకు 2జీబీ డేటాతో

Jio Recharge plan: రిలయన్స్ జియో కస్టమర్ల కోసం ఎప్పటికప్పుడు కొత్త ప్లాన్స్ ప్రవేశపెడుతుంటుంది. యూజర్ల అవసరాలకు అనుగుణంగా రీఛార్జ్ ప్లాన్స్ అందించడంలో జియో అందె వేసిన చేయి. ఇప్పుడు అలాంటిదే మరో ప్లాన్ ప్రకటించింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Feb 4, 2025, 07:12 PM IST
Jio Recharge plan: జియో నుంచి అత్యంత చౌక రీఛార్జ్ ప్లాన్, రోజుకు 2జీబీ డేటాతో

Jio Recharge plan: రిలయన్స్ జియో అందిస్తున్న ఈ ప్లాన్ డేటా అధికంగా వినియోగించేవారికి లాభదాయకంగా ఉంటుంది. ఎందుకంటే అన్‌లిమిటెడ్ 5జి డేటా అతి తక్కువ ధరకే అందుబాటులో ఉంటుంది. ఈ ప్లాన్ పూర్తి వివరాలు తెలుసుకుందాం.

Add Zee News as a Preferred Source

రిలయన్స్ జియో కొత్తగా చీప్ అండ్ బెస్ట్ బడ్జెట్ ప్లాన్ ప్రవేశపెట్టింది. అటు డేటా వినియోగం ఇటు అన్‌లిమిటెడ్ కాలింగ్ కావల్సినవారికి ఇది ప్రయోజనకరం. ఈ ప్లాన్‌లో రోజుకు 2 జీబీ డేటా లభిస్తుంది. అందుకే మీ కోసం బెస్ట్ ప్లాన్ కావచ్చు. ఈ ప్లాన్‌‌ అన్‌లిమిటెడ్ 5జి డేటా రోజూ ఉంటుంది. ఈ ప్లాన్ ధర కూడా నెలకు 198 రూపాయలు మాత్రమే. జియో యూజర్లకు ఈ ప్లాన్ కచ్చితంగా నచ్చుతుంది. అందరికీ అనుకూలంగా ఉండే రీఛార్జ్ ప్లాన్ ఇది. డేటా అధికంగా వినియోగించేవారిని దృష్టిలో ఉంచుకుని ఇది చాలా ఉపయోగపడుతుంది. రోజుకు 2 జీబీ డేటా లభిస్తుంది. ఇంకా ఇతర ప్రయోజనాలు ఏమున్నాయో చెక్ చేద్దాం.

జియో 198 ప్రీ పెయిడ్ ప్లాన్

రిలయన్స్ జియో అందిస్తున్న వివిధ రకాల ప్లాన్స్‌లో ఇది బెస్ట్ ప్లాన్ కాగలదు. తక్కువ వ్యవధిలో ఎక్కువ డేటా వినియోగించుకునేవారికి లబ్ది చేకూరుతుంది. ఇందులో అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్ ఉంటుంది. రోజుకు 2 జీబీ హైస్పీడ్ డేటా లభిస్తుంది. 5జీ డేటా కావడంతో బ్రౌజింగ్, స్ట్రీమింగ్ ఇతర ప్రయోజనాలకు లాభదాయకం. రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు పంపించుకోవచ్చు. జియో టీవీ, జియో సినిమా, జియో క్లౌడ్ వంటి సేవలు ఉచితంగా పొందవచ్చు. 

ఈ ప్లాన్‌తో అన్‌లిమిటెడ్ 5జి డేటా రోజూ 2 జీబీ చొప్పున లభిస్తుంది. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 14 రోజులు ఉంటుంది. మొత్తం 28 జీబీ లభిస్తుంది. ఇక మరో ప్లాన్ కూడా ఉంది. ఈ ప్లాన్ టారిఫ్ 349 రూపాయలు. వ్యాలిడిటీ 28 రోజులు ఉంటుంది. మొత్తం డేటా 56 జీబీ ఉంటుంది. 

Also read: PPF Updates: పీపీఎఫ్ పధకంతో నెలకు 39 వేల జీరో ట్యాక్స్ ఆదాయం, ఎలాగో తెలుసా

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

About the Author

Trending News