Jio Welcome Plan: రిలయన్స్ జియో కొత్తగా న్యూ ఇయర్ వెల్కమ్ 2025 ప్లాన్ ప్రకటించింది. ఈ కొత్త ప్లాన్ యూజర్లకు భారీ ప్రయోజనాలు అందించనుంది. ఈ ప్లాన్ లో అత్యధిక వ్యాలిడిటీతో పాటు అన్ లిమిటెడ్ 5జి నెట్ వర్క్, పెద్దఎత్తున డేటా లభించనుంది. న్యూ ఇయర్ వెల్కమ్ ప్లాన్ 2025 అందించే పూర్తి ప్రయోజనాలు తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

న్యూ ఇయర్ వెల్కమ్ ప్లాన్ 2025 డిసెంబర్ 11 నుంచి జనవరి 11 వరకు అందుబాటులో ఉంటుంది. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 200 రోజులుంటుంది. అన్ లిమిటెడ్ 5జి కాలింగ్ సౌకర్యం లభిస్తుంది. అంతేకాకుండా రోజుకు 2.5 జీబీ డేటా చొప్పున 500 జీబీ డేటా అందుతుంది. ఈ ప్లాన్ ప్రకారం అన్ లిమిటెడ్ కాలింగ్, ఎస్ఎంఎస్ సౌకర్యం ఉంటుంది. దీంతోపాటు 2150 రూపాయల విలువైన పార్టనర్ కూపన్స్ లభిస్తాయి. 


పార్టనర్ కూపన్స్ ప్రత్యేకతలు


న్యూ ఇయర్ వెల్కమ్ 2025 ప్లాన్ తీసుకుంటే పార్టనర్ బెనిఫిట్ ప్రకారం 500 రూపాయల ఎజియో కూపన్ లభిస్తుంది. ఎజియో స్టోర్ లో 2500 రూపాయలు అంతకంటే ఎక్కువ కొనుగోలుపై వర్తిస్తుంది. ఇక 150 రూపాయల స్విగ్గీ కూపన్ లభిస్తుంది. 499 రూపాయల మినిమం ఆర్డర్ చేస్తే ఈ కూప్ వాడవచ్చు. 1500 రూపాయలు ఈజీ మనీ ట్రిప్ డిస్కౌంట్ లభిస్తుది. ఫ్లైట్ బుకింగ్స్ లో వినియోగించవచ్చు. 


రిలయన్స్ జియో అందిస్తున్న న్యూ ఇయర్ వెల్కమ్ 2025 నెలరోజులే అందుబాటులో ఉంటుంది. డిసెంబర్ 11 నుంచి జనవరి 11 వరకు ఈ ఆఫర్ వర్తిస్తుంది. జియో వెబ్ సైట్ లేదా యాప్ లేదా అధీకృత రిటైలర్స్ వద్ద ఈ ప్లాన్ లభిస్తుంది. 


Also read: YCP India Alliance: ఇండియా కూటమిలో వైసీపీ, మమత నాయకత్వానికి మద్దతు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.