Jio Free OTT Plans: దేశంలోని ప్రైవేట్ టెలీకం కంపెనీలు ఎయిర్‌టెల్, వోడాఫోన్ ఐడియాలతో పాటు ప్రభుత్వ రంగ సంస్థ బీఎస్ఎన్ఎల్ పోటీగా కొత్త కొత్త ప్లాన్స్ అందిస్తూ మార్కెట్‌లో అగ్రగామిగా ఉంటోంది జియో. ప్రీపెయిడ్ వినియోగదారుల కోసం వివిధ రకాల రీఛార్జ్ ప్లాన్‌లు అందిస్తోంది. ముఖ్యంగా వివిధ రకాల ఓటీటీ సేవలు ఉచితంగా అందిస్తోంది. మీరు కూడా అమెజాన్ ప్రైమ్, నెట్‌ఫ్లిక్స్, జియో హాట్‌స్టార్, జీ5 సేవలు ఉచితంగా పొందాలంటే ఈ ప్లాన్స్ ఓసారి చెక్ చేసుకోండి
ఓటీటీ సేవలు పొందాలనుకునేవారికి జియో 445 రూపాయల ప్లాన్ అద్భుతంగా పనిచేస్తుంది. ఈ ప్లాన్‌లో సోనీలివ్, జీ5 సహా మొత్తం 12 ఓటీటీలు ఉచితంగా వీక్షించవచ్చు. రోజుకు 2 జీబీ డేటాతో పాటు అన్ లిమిటెడ్ కాలింగ్ ఉంటుంది. ఈ ప్లాన్ వ్యాలిడిటీ మాత్రం 28 రోజులు మాత్రమే ఉంటుంది. మరో ప్లాన్ 175 రూపాయలకు లభిస్తుంది. ఇందులో కాల్స్ చేసుకునేందుకు ఉండదు. ఓన్లీ డేటా ప్లాన్ ఇది. 10 ఓటీటీ సేవలు ఉచితంగా లభిస్తాయి. 28 రోజుల వ్యాలిడిటీతో 10 జీబీ డేటా ఉంటుంది.
ఇక జియో 1049 రూపాయల ప్లాన్ అయితే 84 రోజుల వ్యాలిడిటీతో వస్తోంది. జీ5, సోనీలివ్ ఉచితంగా వీక్షించవచ్చు. రోజుకు 2 జీబీ డేటాతో పాటు రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు, 84 రోజుల అన్‌లిమిటెడ్ డేటా పొందవచ్చు. ఇక మరో ప్లాన్ 889 రూపాయలకు అందుబాటులో ఉంది. ఇది 84 రోజుల వ్యాలిడిటీతో పాటు అన్‌లిమిటెడ్ కాలింగ్, రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు ఉంటాయి. రోజుకు 1.5 జీబీ డేటా ఉంటుంది. ఇక 329 రూపాయల ప్లాన్‌లో 28 రోజుల వ్యాలిడిటీ ఉంటుంది. రోజుకు 1.5 జీబీ డేటాతో పాటు అన్‌లిమిటెడ్ కాలింగ్ సౌకర్యం ఉంటుంది.
జియో అమెజాన్ ప్రైమ్ లైట్ ప్లాన్ 1029 రూపాయలకు లభిస్తోంది. రోజుకు 2 జీబీ డేటా, 100 ఎస్ఎంఎస్‌లు 84 రోజుల వ్యాలిడిటీతో వస్తాయి. అమెజాన్ ప్రైమ్ ఉచితంగా వీక్షించవచ్చు. అన్‌లిమిటెడ్ కాలింగ్ ఉంటుంది. జియో 949 రూపాయల ప్లాన్‌లో రోజుకు 2 జీబీ డేటా, 100 ఎస్ఎంఎస్‌లు ఉంటాయి. 84 రోజుల వ్యాలిడిటీతో అన్‌లిమిటెడ్ కాలింగ్ ఉంటుంది. జియో హాట్‌స్టార్ ఉచితంగా వీక్షించవచ్చు.ఇది కాకుండా 100, 195 రూపాయల ప్లాన్స్‌తో కేవలం డేటా మాత్రమే లభిస్తుంది. 90 రోజుల వ్యాలిడిటీ కలిగి ఉంటాయి.
జియో ఫ్రీ నెట్‌ఫ్లిక్స్ ప్లాన్స్ ఉన్నాయి.1799, 1299 రూపాయల ప్లాన్స్‌తో నెట్‌ఫ్లిక్స్ ఉచితంగా వీక్షించవచ్చు. ఈ రెండు ప్లాన్స్‌లో 84 రోజుల వ్యాలిడిటీ ఉంటుంది. రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు ఉంటాయి. అన్‌లిమిటెడ్ కాలింగ్ ఉంటుంది. 1799 రూపాయల ప్లాన్‌లో రోజుకు 3 జీబీ డేటా లభిస్తే 1299 రూపాయల ప్లాన్ లో రోజుకు 2 జీబీ డేటా ఉంటుంది. ఇక స్పోర్ట్స్ కంటెంట్ కోసమైతే 3999 రూపాయల వార్షిక ప్లాన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇది ఏడాది వ్యాలిడిటీతో రోజుకు 2.5 జీబీ డేటా అందిస్తుంది. అన్‌లిమిటెడ్ కాలింగ్ ఉంటుంది.
Also read: New Ration Card: కొత్త రేషన్ కార్డు కోసం ఎలా అప్లై చేయాలి, ఏమేం డాక్యుమెంట్లు కావాలి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి









