Jio Recharge plans: గత ఏడాది జూన్‌లో టారిఫ్ రేట్లు పెంచిన తరువాత రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్, వోడాఫోన్ ఐడియా కంపెనీలకు షాక్ తగిలింది. వేలాదిగా సబ్‌స్క్రైబర్లు తగ్గిపోయారు. బీఎస్ఎన్ఎల్ వైపు మొగ్గు చూపించారు. అయితే ఆ తరువాత యూజర్లను ఆకట్టుకునేందుకు వివిధ రకాల ప్లాన్స్తో రిలయన్స్ జియో తిరిగి యూజర్లను సంపాదించుకుంటోంది.
ఇటీవల ట్రాయ్ టెలీకం కంపెనీలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. డేటా అవసరం లేనివారికి కేవలం వాయిస్ కాలింగ్ ప్లాన్స్ అందుబాటులో ఉంచాలని సూచించింది. దాంతో అన్ని కంపెనీలు ఆ దిశగా ప్లాన్స్ ప్రవేశపెడుతున్నాయి. మీరు రిలయన్స్ జియో కస్టమర్ అయితే మీ కోసం కొన్ని చీప్ అండ్ బెస్ట్ ప్లాన్స్ అందిస్తున్నాం. ముఖ్యంగా జియో ఫోన్ కస్టమర్లు వాయిస్ కాలింగ్, డేటా, ఎస్ఎంఎస్ మూడూ ఎంజాయ్ చేయవచ్చు. ఈ ఫోన్లలో కేవలం జియో సిమ్ మాత్రమే పనిచేస్తుంది. అంటే ఈ ప్లాన్స్ కేవలం జియో ఫోన్ యాజర్లకే పనిచేస్తాయి.
జియో ఫోన్ 895 ప్లాన్
ఈ ప్లాన్ లాంగ్ వ్యాలిడిటీతో వస్తోంది. ఏకంగా 336 రోజుల కాల వ్యవధి కలిగిన రీఛార్జ్ ప్లాన్ ఇది. ఈ ప్లాన్‌లో 28 రోజులకు కలిపి 2 జీబీ డేటా 50 ఎస్ఎంఎస్‌లు ఉంటాయి. డేటా 2జీబీ పూర్తయితే నెట్ స్పీడ్ పూర్తిగా తగ్గిపోతుంది. ఈ ప్లాన్‌తో పాటు జియో టీవీ, జియో క్లౌడ్ ఉచితంగా యాక్సెస్ ఉంటుంది.
జియో ఫోన్ 223 ప్లాన్
ఈ ప్లాన్ 28 రోజుల వ్యాలిడిటీతో అందుబాటులో ఉంది. ఇందులో అన్‌లిమిటెడ్ కాలింగ్, రోజుకు 100 ఎస్ఎంఎస్లు ఉంటాయి. రోజుకు 2 జీబీ డేటా వినియోగించవచ్చు. రోజూ డేటా అవసరమైనవారికి ఇది బెస్ట్ ప్లాన్. డేటా లిమిట్ అయిపోతే ఇంటర్నెట్ స్పీడ్ తగ్గిపోతుంది. జియో టీవీ, జియో క్లౌడ్ యాక్సెస్ ఉంటుంది.
జియో ఫోన్ 186 ప్లాన్
ఈ ప్లాన్ 28 రోజుల వ్యాలిడిటీతో వస్తోంది. ఇందులో కూడా అన్‌లిమిటెడ్ కాలింగ్, రోజుకు 100 ఎస్ఎంఎస్లు ఉంటాయి. రోజూ 1 జీబీ డేటా లభిస్తుంది. జియో టీవీ, జియో క్లౌడ్ ఉచితంగా యాక్సెస్ లభిస్తుంది.
జియో ఫోన్ 152 ప్లాన్
ఈ ప్లాన్ 28 రోజుల వ్యాలిడిటీతో వస్తోంది. అన్‌లిమిటెడ్ కాలింగ్, 300 ఎస్ఎంఎస్ సౌకర్యం ఉంటుంది. రోజుకు 0.5 జీబీ డేటా వాడుకోవచ్చు. జియో టీవీ, జియో క్లౌడ్ యాక్సెస్ ఉంటుంది.
జియో ఫోన్ 125 ప్లాన్
ఈ ప్లాన్ వ్యాలిడిటీ కేవలం 23 రోజులు. ఇందులో కూడా అన్‌లిమిటెడ్ కాలింగ్, 300 ఎస్ఎంఎస్ సౌకర్యం లభిస్తుంది. డేటా రోజుకు 0.5 జీబీ మాత్రమే ఉంటుంది.
జియో ఫోన్ 91 ప్లాన్
ఈ ప్లాన్ వ్యాలిడిటీ 28 రోజులుంటుంది. కానీ రోజుకు 100 ఎంబీ డేటా మాత్రమే ఉంటుంది. మొత్తం 50 ఎస్ఎంఎస్‌లు పంపించుకోవచ్చు. అదనంగా 200 ఎంబీ డేటా వాడుకోవచ్చు.
జియో ఫోన్ 75 ప్లాన్
ఈ ప్లాన్ 23 రోజులే పనిచేస్తుంది. ఇందులో అన్‌లిమిటెడ్ కాలింగ్ ఉంటుంది. ఇక మొత్తం 50 ఎస్ఎంఎస్‌లు ఉంటాయి. రోజుకు 100 ఎంబీ డేటా వాడుకోవచ్చు. జియో టీవీ, జియో క్లౌడ్ యాక్సెస్ లభిస్తుంది.
Also read: Delhi CAG Report: ఆప్‌ను వెంటాడుతున్న మద్యం పాలసీ, 2 వేల కోట్ల నష్టం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి









