Jio Recharge plans: జియో నుంచి కొత్తగా చీప్ అండ్ బెస్ట్ రీఛార్జ్ ప్లాన్స్ ఇవే

Jio Recharge plans: దేశంలో అతిపెద్ద ప్రైవేట్ టెలీకం కంపెనీ రిలయన్స్ జియో కస్టమర్ల కోసం వివిధ రకాల రీఛార్జ్ ప్లాన్స్ అందుబాటులో తీసుకొచ్చింది. అత్యంత చౌక ప్లాన్స్‌తో ఎప్పటికప్పుడు యూజర్లను ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగానే మరో మూడు చీప్ అండ్ బెస్ట్ ప్లాన్స్ ప్రకటించింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Mar 19, 2025, 06:47 PM IST
Jio Recharge plans: జియో నుంచి కొత్తగా చీప్ అండ్ బెస్ట్ రీఛార్జ్ ప్లాన్స్ ఇవే

Jio Recharge plans: రిలయన్స్ జియో కస్టమర్లకు గుడ్‌న్యూస్. జియో మరో మూడు రీఛార్జ్ ప్లాన్స్ ప్రకటించింది. అత్యంత తక్కువ ఖర్చుతో డేటా, వాయిస్ కాలింగ్, ఎస్ఎంఎస్ ప్రయోజనాలు అందించే ప్లాన్స్ ఇవి. యూజర్లకు అందుబాటులో ఉండే ఈ మూడు ప్లాన్స్ గురించి వివరంగా తెలుసుకుందాం.

Add Zee News as a Preferred Source

దేశంలోని ప్రైవేట్ టెలీకం కంపెనీలు రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్, వోడాఫోన్ ఐడియాలలో జియో స్థానం ప్రత్యేకమైంది. ఎప్పటికప్పుడు కొత్త కొత్త రీఛార్జ్ ప్లాన్స్, ఆఫర్లతో యూజర్లను నిలబెట్టుకోవడం లేదా ఆకట్టుకోవడం చేస్తుంటుంది. ట్రాయ్ ఆదేశాలకు అనుగుణంగా ఇటీవలే వాయిస్ కాలింగ్ ప్లాన్స్ కూడా ప్రవేశపెట్టింది. ఇప్పుడు మరో మూడు చీప్ అండ్ బెస్ట్ రీఛార్జ ప్లాన్స్ తీసుకొచ్చింది. వీటిలో 189 రూపాయల రీఛార్జ్ ప్లాన్ తీసుకుంటే 28 రోజుల వ్యాలిడిటీ కలిగి ఉంటుంది. 2 జీబీ డేటా, అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్, 300 ఎస్ఎంఎస్‌లు ఉంటాయి. ఈ ప్లాన్‌‌తో జియో టీవీ, జియో క్లౌడ్ యాక్సెస్ ఉంటుంది. 

ఇక రెండవ చీప్ అండ్ బెస్ట్ రీఛార్జ్ ప్లాన్ 198 రూపాయలు. ఇందులో రోజూ 2 జీబీ డేటా లభిస్తుంది. వ్యాలిడిటీ మాత్రం 14 రోజులు ఉంటుంది. అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్, రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు ఉంటాయి. 5జి ఫోన్ అయితే అన్‌లిమిటెడ్ 5జి డేటా లభిస్తుంది. జియో టీవీ, జియో క్లౌడ్ యాక్సెస్ ఉచితంగా లభిస్తుంది. 

ఇక మూడవ ప్లాన్ జియో 199 ప్లాన్. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 18 రోజులు ఉంటుంది. రోజుకు 1.5 జీబీ డేటా లభిస్తుంది. డేటా అవసరమైనవారికి బెస్ట్ ప్లాన్ ఇది. ఇందులో కూడా అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్, ఉచిత ఎస్ఎంఎస్‌లు ఉంటాయి.

Also read: Heat Waves Alert: ఏపీకు వడగాలుల హెచ్చరిక, 58 మండలాల్లో తీవ్ర ప్రభావం వృద్ధులు చిన్నారులు జాగ్రత్త

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

About the Author

Trending News