ATM: వినియోగదారులకు బిగ్ షాక్.. ఎటీఎంలో ప్రతీ ట్రాన్సాక్షన్ కు ఛార్జీల మోత..?

ATM Transaction: ఇప్పటికే బ్యాంకులు వివిధ ఛార్జీల పేరిట సామాన్య వినియోగదారుల నడ్డి విరుస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇప్పటికే ఇండైరెక్ట్ గా వినియోగదారుల జేబులను గుల్ల చేస్తోన్న బ్యాంకులు మరోసారి ఛార్జీల మోత మోగించడానికి రెడీ అవుతోంది.

Written by - TA Kiran Kumar | Last Updated : Mar 25, 2025, 11:41 AM IST
ATM: వినియోగదారులకు బిగ్ షాక్..  ఎటీఎంలో ప్రతీ ట్రాన్సాక్షన్ కు ఛార్జీల మోత..?

ATM Transaction: ATM ద్వారా డబ్బులను  విత్‌ డ్రా చేసుకునే వారికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మోత మోగించబోతుంది. ఒక రకంగా వినియోగదారుల పాలిట  ఇది బ్యాడ్‌ న్యూస్‌ అని చెప్పాలి. అలా ATM ద్వారా క్యాష్‌  విత్‌ డ్రా చేస్తే  వారి అకౌంట్‌లో డబ్బులు తగ్గిపోనున్నాయి.

Add Zee News as a Preferred Source

ఎందుకంటే ATM ద్వారా డబ్బులు విత్‌ డ్రా చేస్తే పడే ఛార్జీలను బ్యాంకులు పెంచనున్నాయి. ఈ పెంపు ఈ ఏడాది మే 1 నుంచి అమల్లోకి రానున్నాయి. ఈ కొత్త ఛార్జీలు  క్యాష్‌ విత్‌ డ్రాకే కాకుండా , అకౌంట్‌లో బ్యాలెన్స్‌ చెక్‌ చేసుకుంటే కూడా  అమలుకానున్నాయి. దీనిపై వినియోగదారులు గగ్గోలు పెడుతున్నారు.

ఇలా బ్యాంకులు ఛార్జీల మోతను నొప్పి తెలియకుండా చేస్తోంది. దీనిపై వినియోగదారులు గుర్రుగా ఉన్నారు. ముఖ్యంగా ఏదో తెలియకుండా..  ఈఎంఐలు సరైన సమయంలో కట్టకపోతే కూడా వినియోగదారుల నడ్డి విరుస్తున్నాయి. మొత్తంగా బ్యాంకులు కొంత మంది పెద్దల విషయంలో చూసీ చూడనట్టు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. వాటిని NPA నాన్ పర్పామెన్స్ అస్సెట్స్ పేరిట క్లోజ్ చేస్తున్నాయి. అలా అని లాగ్ బుక్ లో చూపిస్తున్నారు కానీ.. అలా వసూళు కానీ మొండి బాకీలు చేసిన వ్యక్తులు వ్యక్తిగత ఆస్తులను స్వాధీనం చేసుకుంటోంది. ఇప్పటికే ఈ విషయమై కేంద్రం ఓ చట్టం తీసుకొచ్చింది. అలా నీరవ్ మోడీ, విజయ్ మాల్యాకు సంబంధించి భారత్ లో ఉన్న ఆస్తులను మన బ్యాంకులు ఆ తర్వాత స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే కదా. దీంతో మొండి బాకీలు పెట్టే పెద్దలకు చెమటలు పడుతున్నాయి. కానీ ఇలా చిన్న చిన్న మొత్తాలను జమ చేసుకునే వారిపై బ్యాంకులు ట్రాన్సాక్షన్ పేరిట ఛార్జీల మోత మోగించే విషయంలో కాస్త ఆలోచిస్తే మంచిదంటున్నారు.    

READ ALSO:  Madhuri Dixit: షాకింగ్.. మాధురి దీక్షిత్ అందానికి మై మరిచిపోయి పెదవులను రక్తం కారేలా కొరికేసిన మాజీ ఎంపీ..

READ ALSO: Star Heroine: హిందువుగా పుట్టి.. ముస్లిం వ్యక్తిని పెళ్లి చేసుకొని.. ప్రస్తుతం క్రైస్తవ మతం అనుసరిస్తున్న స్టార్ హీరోయిన్..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

TA Kiran Kumar

కిరణ్ కుమార్ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.

...Read More

Trending News