
Rohit Sharma Emotional: టీమిండియా స్టార్ ప్లేయర్ రోహిత్ శర్మ అనూహ్యంగా టెస్టు క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించడం క్రీడా ప్రపంచాన్ని షాక్ కు గురిచేసింది. రోహిత్ టెస్టులకు గుడ్ బై చెప్పడం తన అభిమానులకు కూడా నచ్చలేదు. అయితే ఈ నిర్ణయం అభిమానులనేకాదు..హిట్ మ్యాన్ తండ్రిని కూడా బాధపెట్టిందట. తన తండ్రి వన్డే, టీ20 ఫార్మాట్ కంటే టెస్టు క్రికెట్ ఎంతో ఇంట్రెస్ట్ అట. ఈ విషయాన్ని రోహిత్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. అందుకే ఈ రిటైర్మెంట్ తో తన తండ్రి నిరాశచెందినట్లు తెలిపాడు.
మా నాన్న ట్రాన్స్ పోర్టు కంపెనీలో పని చేశారు. మా కెరీర్ కోసం ఆయన ఎన్నో త్యాగాలు చేశారు. ఆయనకు టెస్టు క్రికెట్ అంటే చాలా ఇష్టమని..నేను 264 పరుగులు చేసినా మా నాన్న నన్ను పెద్దగా ప్రశంసించలేదని తెలిపారు. అది నాకు ఇప్పటికీ గుర్తిందని చెప్పారు. కానీ టెస్టు క్రికెట్లో తక్కువగా పరుగులు చేసిన సందర్భాల్లో ఆ ఇన్నింగ్స్ గురించి నాతో కచ్చితంగా మాట్లాడేవారు. ఆయన టెస్టు ఫార్మాట్ పై ప్రేమ ఉండదనేందుకు ఇదే నిదర్శనమని చెప్పారు. అందుకే నేను టెస్టు రిటైర్మెంట్ అనౌన్స్ చేయడం ఆయనకు పెద్దగా నచ్చలేదు. కానీ తర్వాత ఆయన నా నిర్ణయాన్ని అంగీకరించారంటూ రోహిత్ శర్మ ముంబైలో పాల్గొన్న ఈవెంట్లో వివరించాడు. కాగా 2014లో శ్రీలంకపై వన్డే మ్యాచులో రోహిత్ 264పరుగులు చేసి హిస్టరీ క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే.
కాగా రోహిత్ గతనెల 07న టెస్టుల నుంచి తప్పుకుంటున్నట్లు ఆకస్మాత్తుగా ప్రకటించాడు. ఈ నెలలో ఇంగ్లండ్ పర్యటనకు వెళ్తాడని భావించిన క్రమంలో రోహిత్ నిర్ణయం అందర్నీ ఒకింత షాక్ కు గురి చేసింది. 2013లో టెస్టుల్లో అరంగేట్రం చేసిన హిట్ మ్యాన్ 12ఏళ్లు టీమిండియాకు ప్రాతినిధ్యం వహించాడు.
సుదీర్ఘ టెస్టు కెరీర్ లో భారత్ తరపున రోహిత్ శర్మ 67 మ్యాచులు ఆడాడు. అందులో 40.58 సగటున 4301 పరుగులు చేసిండు. ఇందులో 12 సెంచరీలు, 18 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 88 సిక్సులు కొట్టాడు. గత ఏడాది డిసెంబర్ లో ఆస్ట్రేలియాపై చివరి టెస్టు ఆడాడు. 2024లో టీ20లకు కూడా రిటైర్మెంట్ ఇచ్చాడు. ఇక నుంచి వన్డేల్లోనే కనిపించనున్నాడు రోహిత్.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook