)
RRC Eastern Railway Recruitment 2025: రైల్వే రిక్రూట్మెంట్ సెల్ ఈస్టర్న్ రైల్వేలో 2025-26 సంవత్సరానికి క్రీడా కోటా కింద 50 ఉద్యోగాలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఉద్యోగాలు గ్రూప్ సీ మరియు గ్రూప్ డీ విభాగాల్లో ఉన్నాయి. దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే సెప్టెంబర్ 10న మొదలుకాగా.. అక్టోబర్ 9న ముగియనుంది. అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలు ఆర్చరీ, అథ్లెటిక్స్, బ్యాడ్మింటన్, బాస్కెట్‌బాల్, కబడ్డీ, టేబుల్ టెన్నిస్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, స్విమ్మింగ్, వాలీబాల్ వంటి క్రీడల్లో భర్తీ చేయనున్నారు.
విద్యార్హతలు..
అభ్యర్థులు ఐటీఐ, పదో తరగతి, ఇంటర్ లేదా డిగ్రీ పాసై ఉండాలి. అంతేకాకుండా ఒలింపిక్స్, ప్రపంచ ఛాంపియన్షిప్, ఆసియా క్రీడలు, కామన్వెల్త్ క్రీడలలో భారత్‌కు ప్రాతినిధ్యం వహించి ఉండాలి లేదా జాతీయ, యూనివర్సిటీ స్థాయి పోటీలలో మంచి ర్యాంకులు సాధించి ఉండాలి.
వయోపరిమితి..
అభ్యర్థుల వయసు 2025 జనవరి 1 నాటికి 18 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉండాలి.
దరఖాస్తు చివరి తేది..
అభ్యర్థులు తమ దరఖాస్తులను అక్టోబర్ 9, 2025 సాయంత్రం 6 గంటలలోపు పూర్తి చేయాలి.
దరఖాస్తు ఫీజు ఎంతంటే..
దరఖాస్తు రుసుము జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 500 రూపాయలు.. ఎస్సీ, ఎస్టీ, మహిళలు, మైనారిటీలు, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 250 రూపాయలు. ట్రయల్స్ తర్వాత 400 రూపాయలు తిరిగి ఇస్తారు.
ఎంపిక విధానం..
అభ్యర్థులకు ఎలాంటి రాత పరీక్ష ఉండదు. షార్ట్‌లిస్ట్ చేసిన అభ్యర్థులకు డిసెంబర్ 2025 నుంచి జనవరి 2026 మధ్య క్రీడా సామర్థ్య పరీక్షలు జరుగుతాయి. ఈ పరీక్షలకు 40 మార్కులు, క్రీడా చరిత్రకు 50 మార్కులు, విద్యార్హతలకు 10 మార్కులు ఉంటాయి. తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్, వైద్య పరీక్షలు ఉంటాయి. క్రీడా ట్రయల్స్‌లో అర్హత సాధించినవారిని తదుపరి దశకు పంపిస్తారు.
వేతనం ఎంత..?
ఎంపికైనవారికి పోస్టు ఆధారంగా నెలకు 18,000 నుంచి 45,000 రూపాయల వరకు జీతం ఉంటుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook