)
FPI sales in August: భారత స్టాక్ మార్కెట్లో ఫారెన్ ఇన్వెస్టర్లు భారీగా పెట్టుబడులను ఉపసంహరించుకుంటున్నారు. భారత్, అమెరికా వాణిజ్య ఉద్రిక్తతలు, బలహీనమైన రూపాయి, నిరాశ పరిచిన క్యూ1 రిజల్ట్స్ దీనికి కారణమని తెలుస్తోంది. ఎఫ్ఐఐలు ఈక్విటీ షేర్లను అమ్మడంతో మార్కెట్ నష్టాల్లో ఉంది.
భారత స్టాక్ మార్కెట్ ర్యాలీలో ఎంతో కీలకమైన ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ఈనెలలో ఇప్పటి వరకు ఏకంగా రూ. 18వేల కోట్ల విలువైన ఈక్విటీ షేర్స్ ను ఉపసంహరించుకున్నారు. భారత్, అమెరికా మధ్య పెరుగుతున్న వాణిజ్య ఉద్రిక్తతలు, అలాగే బలహీన పడుతున్న రూపాయి విలువ, అదేవిధంగా నిరాశపరిచిన కార్పొరేట్ కంపెనీల క్యూ1 ఫలితాల కారణంగా ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ భారతీయ స్టాక్ మార్కెట్స్ నుంచి దూరంగా ఉంటున్నారు.
2025లో ఇప్పటి వరకు ఏకంగా రూ. 1.13 లక్షల కోట్ల విలువైన ఈక్విటీ షేర్స్ ను ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ఉపసంహరించుకుంటున్నట్లు డిపాజిటరీ డేటా వెల్లడించింది. రానున్న వారంలో అమెరికా భారత్ మధ్య వాణిజ్య చర్యలు ముఖ్యమైన అంశాలుగా మారనున్నాయని మార్కెట్ నిపుణులు కూడా అంచనా వేస్తున్నారు. కేవలం ఈ నెలలోనే కాకుండా జులై నెలలో కూడా ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ రూ. 17,741 కోట్ల విలువైన ఈక్విటీస్ ను ఉపసంహరించుకున్నారు. మార్చి నుంచి జూన్ వరకు ఏకంగా రూ. 38, 673 కోట్ల విలువైన ఈక్విటిస్ ను అమ్మేశారు.
ఈ పరిస్థితి రావడానికి ముఖ్య కారణం అమెరికా భారత్ మధ్య ముదురుతున్న వాణిజ్య ఉద్రిక్తతలతోపాటు బలహీనపడుతున్న రూపాయి, అదేవిధంగా దేశంలోని ప్రముఖ కార్పొరేట్ కంపెనీలు నిరాశాజనకమైన క్యూ1 ఫలితాలను ప్రకటించడమేనని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మొదట్లో మన దేశం నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై అమెరికా 25శాతం సుంకాన్ని విధించిన సంగతి తెలిసిందే. తర్వాత ఈ సుంకాన్ని మరో 25శాతం పెంచి 50శాతం చేయడంతో భయాందోళనకు గురైన ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ భారతీయ ఈక్విటీస్ ను భారీగా విక్రయిస్తున్నారు.
ఒకవేళ పరిస్థితులు అదుపులోకి వచ్చి భారత్ అమెరికా మధ్య వాణిజ్య చర్చలు సఫలం అయినట్లయితే ..ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు తిరిగి భారత స్టాక్ మార్కెట్స్ లో పెట్టుబడులు పెట్టే ఛాన్స్ ఉందని..దీని కారణంగా మార్కెట్లు తిరిగి పుంజుకునే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు అభిప్రాయ పడుతున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook