)
Rupee Weakness Results: ఫారెన్ ఇన్వెస్టర్లు భారత స్టాక్ మార్కెట్ నుంచి డబ్బును ఉపసంహరించుకోవడంతో రూపాయి ఒత్తిడిలో పడింది. దిగుమతులు మరింత ఖరీదైనవిగా మారడంతో ఈ క్షీణత సాధారణ ప్రజలపై ప్రభావం చూపనుంది. దీని ఫలితంగా పెట్రోల్, డిజిల్, ఎలక్ట్రానిక్స్, విదేశీ ప్రయాణాల ధరలకు రెక్కలు రానున్నాయి. 2025లో ఫారెన్ ఇన్వెస్టర్లు 18 బిలియన్ డాలర్ల విలువైన భారతీయ షేర్లను విక్రయించిన సంగతి తెలిసిందే.
డిసెంబర్ 16న డాలర్ తో పోలిస్తే భారత రూపాయి విలువ 91.02కి పడిపోయింది. ఇప్పటి ఇప్పటి వరకు ఉన్న అత్యల్ప స్థాయి. భారత స్టాక్ మార్కెట్ నుంచి విదేశీ పెట్టుబడిదారులు ఉపసంహరించుకోవడంతో రూపాయిపై భారీ ఒత్తిడిని పడింది. రూపాయి బలహీనపడం సామాన్య ప్రజలపై ప్రత్యక్ష ప్రభావం చూపుతుంది. దిగుమతులు మరింత ఖరీదుగా మారుతాయి. పెట్రోల్, డీజిల్, మొబైల్ ఫోన్లు, ల్యాప్ టాప్స్ లేదా విదేశాలకు ప్రయాణించే ఖర్చులు భారీగా పెరుగుతాయి.
రూ. 91.02 – డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ ఆల్ టైమ్ కనిష్ట స్థాయికి చేరుకుంది. 20శాతం – ఏప్రిల్ 2022 నుండి రూపాయి క్షీణతకు గురైంది. 6శాతం – 2025లోనే పతనమయ్యింది. ఆసియాలోనే ఇది అత్యధికంగా 18 బిలియన్ డాలర్లకు పడిపోయింది. 2025లో ఇప్పటి వరకు విదేశీ పెట్టుబడిదారులు భారతీయ స్టాక్స్ నుంచి 50శాతం పెట్టుబడులను ఉపసంహరించుకున్నారు. అయితే కొన్ని భారతీయ ఉత్పత్తులపై అమెరికా సుంకాలు విధించింది.
మొత్తానికి రూపాయికి కష్టకాలం వచ్చిందనే చెప్పాలి. సోమవారం కనిష్ట స్థాయికి చేరుకుని కొత్త రికార్డుకు చేరుకుంది. 2025లో రూపాయి ఆసియాలో అత్యంత చెత్త పనితీరు కనబర్చిన కరెన్సీగా మారింది. థాయిలాండ్, దక్షిణకొరియా ఇండోనేషియా కరెన్సీల కంటే దారుణంగా పడిపోయింది. ఈ క్షీణత ఇప్పుడు ప్రారంభమైంది కాదు. 2022 ఏప్రిల్ నుంచి క్షీణిస్తుంది. అప్పటి నుంచి డాలర్ తో పోలిస్తే దాదాపు 20శాతం, యూరోతో పోలిస్తే 29శాతం, బ్రిటిష్ పౌండ్ తో పోలిస్తే 23శాతం బలహీనపడింది.
రూపాయి ఎందుకు బలహీనపడుతోంది అనేదానికి కారణం ఏంటంటే.. భారత్ నుంచి దిగుమతి చేసుకునే అనేక వస్తువులపై అమెరికా 50శాతం వరకు సుంకాలను విధించింది. దీంతో భారతదేశపు అతిపెద్ద ఎగుమతి మార్కెట్ కు దెబ్బతగిలినట్లయ్యింది. ఇండో అమెరికా వాణిజ్య చర్చలను నిలిపివేసింది. ఇదొక కారణం అయితే రెండో కారణం కూడా ఉంది. అమెరికా, ఇతర మార్కెట్లో మెరుగైన రాబడిని చూసి ఫారెన్ ఇన్వెస్టర్లు భారత మార్కెట్ నుంచి డబ్బును ఉపసంహరించుకుంటున్నారు 2025లో ఇఫ్పటి వరకు విదేశీ పెట్టుబడిదారులు 18 బిలియన్ డాలర్ల విలువైన భారతీయ ఈక్విటీలను విక్రయించారు. డిసెంబర్ లో 500బిలియన్ డాలర్లకు పైగా బాండ్ పెట్టుబడులను ఉపసంహరించుకున్నారు. ఈ భారీ తరలింపు అనేది రూపాయిపై భారీ ఒత్తిడిని కలిగించింది.
సామాన్యులపై ఎలాంటి ప్రభావ చూపనుంది?
రుపాయి బలహీనపడుతుందంటే... దిగుమతులు ఖరీదుగా మారుతాయి. భారత్ తన చమురు అవసరాల్లో 80శాతానికిపైగా విదేశాలపైనే ఆధారపడుతుంది. పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరిగే అవకాశం ఉంటుంది. అంతేకాదు మొబైల్స్, ల్యాప్ టాప్స్, ఐఫోన్స్ వంటి ఎలక్ట్రానిక్స్ వస్తువుల ధరలు కూడా పెరుగుతాయి డాలర్, యూర్, పౌండ్ తో పోలిస్తే రూపాయి బలహీనంగా మారడంతో విదేశీ ప్రయాణాలు కూడా మరింత ప్రియం అవుతాయి.
రూపాయి బలహీన పడితే ఎవరు ప్రయోజనం పొందుతారు?
రూపాయి బలహీనపడటం వల్ల ఎగుమతి కంపెనీలు లాభం పొందుతాయి. ఐటీ కంపెనీలు, ఔషధ తయారీదారు కంపెనీలు తమ ఆదాయంలో ఎక్కువ భాగాన్ని డాలర్ల రూపంలోనే సంపాదిస్తాయి. కాబట్టి రూపాయి బలహీనపడితే వారి ఆదాయం గణనీయంగా పెరుగుతుంది.
డాలర్ కు 95 రూపాయల వరకు చేరుకునే ఛాన్స్:
డాలర్ బలంగా ఉండి.. ఫారెన్ ఇన్వెస్టర్లు అమ్మకాలను కొనసాగిస్తే.. రూపాయి విలువ డాలర్ కు 92 నుంచి 95కి చేరుకునే అవకాశం ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఆర్బిఐ డాలర్లను అమ్మడం ద్వారా క్షీణతను అరికట్టేందుకు ప్రయత్నాలు చేసింది. కానీ దాని పరిధి అనేది పరిమితంగా ఉంటుంది.
ద్రవ్యోల్బణాన్ని పెంచే ప్రమాదం ఉందా?
రూపాయి బలహీనత ఇక నుంచి కేవలం కరెన్సీ సమస్య మాత్రమే కాదు.. ద్రవ్యోల్బణాన్ని పెంచే ప్రమాదం కూడా ఉంటుంది. విదేశీ పెట్టుబడిదారుల విశ్వాసం దెబ్బతినే ఛాన్స్ ఉంటుంది. భారత దేశ ఆర్ధికాభివ్రుద్ధి అంచనాల కంటే మెరుగ్గా ఉన్నా.. రూపాయి పడిపోవడం వల్ల ఈ మొత్తం వ్రుద్ధి కథకు భారీ సవాల్ విసురుతోంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.