SBI Server Down: SBI సర్వర్‌ మళ్లీ ఆగిపోయింది.. ఇన్నిసార్లు ఇలా ఆగిపోతే బిల్‌ ఎలా కట్టాలి బ్రో!

SBI Server Down: దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన ఎస్బిఐ కస్టమర్లు డిజిటల్ ట్రాన్సాక్షన్స్ చేయడంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. యూపీఐ చెల్లింపులు సహా అన్ని రకాల డిజిటల్ ట్రాన్సాక్షన్స్ నిలిచిపోయాయి. సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ ఎక్స్ లో కోట్లాది మంది కస్టమర్లు దీనిపై కంప్లైంట్ చేస్తున్నారు. దీనిపై స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా స్పందించింది. డిజిటల్ లావాదేవీల్లో కస్టమర్లు ఎందుకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో కూడా బ్యాంకు వివరించింది.   

Written by - Bhoomi | Last Updated : Apr 1, 2025, 01:56 PM IST
SBI Server Down: SBI సర్వర్‌ మళ్లీ ఆగిపోయింది.. ఇన్నిసార్లు ఇలా ఆగిపోతే బిల్‌ ఎలా కట్టాలి బ్రో!

SBI Server Down: దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన ఎస్బిఐ కస్టమర్లు డిజిటల్ ట్రాన్సాక్షన్స్ చేయడంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. యూపీఐ చెల్లింపులు సహా అన్ని రకాల డిజిటల్ ట్రాన్సాక్షన్స్ నిలిచిపోయాయి. సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ ఎక్స్ లో కోట్లాది మంది కస్టమర్లు దీనిపై కంప్లైంట్ చేస్తున్నారు. దీనిపై స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా స్పందించింది. డిజిటల్ లావాదేవీల్లో కస్టమర్లు ఎందుకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో కూడా బ్యాంకు వివరించింది. 

Add Zee News as a Preferred Source

ఎక్స్ లో ఒక పోస్ట్ లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వార్షిక నిర్వహణ కార్యకలాపాల కారణంగా ఏప్రిల్ 1 మధ్యాహ్నం 1గంట నుంచి సాయంత్రం 4 గంటల వరకు అన్ని డిజిటల్ సేవలు మూసివేసి ఉంటాయని పేర్కొంది. యూపీఐ లైట్, ఏటీఎం ఛానెల్స్ ను ఉపయోగించమని తమ కస్టమర్స్ ను అభ్యర్థిస్తున్నామని పేర్కొన్నారు. ఎస్బిఐ ద్వారా యూపీఐ చెల్లింపులు చేయడం ఉదయం నుంచి సమస్యలు వస్తున్నాయి. అయితే డిజిటల్ సేవలు మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం 4 గంటల వరకు పూర్తిగా బంద్ అవుతాయని బ్యాంక్ తెలిపింది. 

Also Read:  Multibagger stock: కనక వర్షం కురిపించిన మల్టీబ్యాగర్ స్టాక్.. ఐదేళ్లలో లక్షకు రూ. 15లక్షల లాభం   

UPI లైట్ అనేది చిన్న లావాదేవీలను సులభతరం చేయడానికి,  వేగవంతం చేయడానికి NPCI అభివృద్ధి చేసిన కొత్త డిజిటల్ చెల్లింపు వ్యవస్థ. ప్రత్యేకత ఏమిటంటే ఇది యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్ (UPI) యొక్క తేలికపాటి వెర్షన్. దీని సహాయంతో, ఇంటర్నెట్ కనెక్షన్ లేకుండా కూడా చెల్లింపు చేయవచ్చు.

UPI యాప్‌కి వెళ్లండి (PhonePe, Google Pay, Paytm, BHIM మొదలైనవి).

UPI లైట్‌ని ఎనేబుల్ చేసి, దానికి బ్యాంక్ నుండి బ్యాలెన్స్ జోడించండి (ప్రస్తుతం ₹2,000 వరకు)

తరువాత, QR ను స్కాన్ చేయండి లేదా మీ మొబైల్ నంబర్‌ను నమోదు చేసి చెల్లింపు చేయండి.

ఏప్రిల్ 1న బ్యాంకుల వార్షిక ఖాతా ముగింపు కారణంగా మంగళవారం కరెన్సీ, బాండ్ మార్కెట్లు కూడా మూసి ఉంటాయి. 

Also Read: Minimum Bank Balance: సామాన్యులకు షాకింగ్ న్యూస్.. ఏప్రిల్ 1 నుంచి మినిమం బ్యాలెన్స్ పేరుతో బ్యాంకుల బాదుడే బాదుడు   

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.FacebookTwitter

About the Author

Bhoomi

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.  

...Read More

Trending News