SBI Home Loans EMI: ఎస్బిఐ ఖాతాదారులకు గుడ్ న్యూస్.. నేటి నుంచి తగ్గనున్న హోంలోన్ ఈఎంఐలు..!!

Big Relief for SBI Customers: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన ఖాతాదారులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఎస్బిఐలో హోంలోన్స్ తీసుకున్నవారికి వడ్డీరేట్లలో కోత విధించింది. దీంతో హోంలోన్స్ ఈఎంఐలు కాస్త తగ్గనున్నాయి. ఈ నెలలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెపోరేటును 0.25బేసిస్ పాయింట్ల మేర తగ్గింది. దీంతో ఎస్బిఐ కూడా తన లోన్ రేట్లను 25బేసిస్ పాయింట్లను తగ్గింది. ఈ తగ్గింపు నేటి నుంచి అంటే డిసెంబర్ 15, 2025 నుంచి అమల్లోకి వచ్చింది. అయితే బ్యాంక్ కొన్ని ఎఫ్డీ రేట్లను తగ్గించింది.

Written by - Bhoomi | Last Updated : Dec 15, 2025, 09:43 AM IST
SBI Home Loans EMI: ఎస్బిఐ ఖాతాదారులకు గుడ్ న్యూస్.. నేటి నుంచి తగ్గనున్న హోంలోన్ ఈఎంఐలు..!!

Add Zee News as a Preferred Source

Big Relief for SBI Customers: దేశంలోనే అతిపెద్ద బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వడ్డీరేట్లను తగ్గించిన సంగతి తెలిసిందే. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పాలసీ రెపోరేటును 25బేసిస్ పాయింట్లు తగ్గించిన తరుణంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా లోన్స్ పై వడ్డీ రేట్లలో కోతను విధించింది. ఈ నిర్ణయంతో కొత్త కస్టమర్లతోపాటు ఇప్పటికే ఉన్న రుణ గ్రహీతలకు కూడా ఈ లోన్స్ మరింత చౌకగా మారుతాయి. సవరించిన వడ్డీ రేట్లు నేటి నుంచి డిసెంబర్15,2025 నుంచి అమల్లోకి వచ్చాయి. తాజా తగ్గింపుతో ఎస్బిఐ ఎక్స్ టర్నల్ బెంచ్ మార్కెట్ లింక్డ్ రేట్ 7.90శాతానికి తగ్గింది. ఆర్థిక వ్రుద్ధికి మద్దతు ఇవ్వాలన్న ఉద్దేశంతోనే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ సంవత్సరం నాలుగవ సారి రెపో రేటును తగ్గించడంతో బ్యాంకులు కూడా ఈ రుణ రేట్లను తగ్గిస్తున్నాయి.

ఎస్బిఐ అన్ని కాలపరిమితుల కోసం మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్ లో 5 బేసిస్ పాయింట్ల కోత విధించిన విషయం తెలిసిందే. ముఖ్యంగా ఒక ఏడాది ఎంసీఎల్ఆర్ 8.75శాతం నుంచి 8. 70శాతానికి తగ్గింది. ఆవిధంగానే బ్యాంక్ బేస్ రేట్ లేదా బీపీఎల్ఆర్ ను 10శాతం నుంచి 9.90శాతానికి తగ్గింది. ఈ సవరించిన రేట్లు కూడా నేటి నుంచి అమల్లోకి వచ్చాయి. ఇక డిపాజిట్ల విషయానికొస్తే రూ. 3 కోట్ల కంటే తక్కువ ఉన్న చాలా రిటైల్ టర్మ్ డిపాజిట్ రేట్లు మారలేదు. ఇది పెట్టుబడిదారులకు చాలా అవధులలో స్థిరమైన రాబడిని అందిస్తుంది. అయితే SBI దాని ప్రసిద్ధ 444-రోజుల 'అమృత వర్ష' టర్మ్ డిపాజిట్ పథకంపై వడ్డీ రేటును మునుపటి 6.60శాతం నుండి 6.45శాతానికి తగ్గించింది. ఇది పెట్టుబడిదారులకు దెబ్బ అనే చెప్పాలి. సీనియర్ సిటిజన్లకు.. అన్ని అవధులలో రేట్లు ఎక్కువగానే ఉన్నాయి. అయినప్పటికీ 2-3 సంవత్సరాల డిపాజిట్ స్లాబ్‌లో 6.95శాతం నుండి 6.90శాతానికి స్వల్ప తగ్గించింది. సాధారణ ఖాతాదారులకు అదే అవధి రేటు 6.45శాతం నుండి 6.40శాతానికి తగ్గించింది.

Also Read: Traffic Challan: వాహనదారులకు గుడ్ న్యూస్.. ట్రాఫిక్ చలాన్స్ పెండింగ్ లో ఉన్నాయా? లోక్ అదాలత్‎లో ఇలా క్లియర్ చేసుకోండి..!!

-7-45 రోజులు: సాధారణ ఖాతాదారులకు 3.50శాతం, సీనియర్ సిటిజన్లు 3.55శాతం

-46-179 రోజులు: సాధారణులకు 4.90శాతం, సీనియర్ సిటిజన్లకు 5.40శాతం

-180-210 రోజులు : సాధారణులకు 5.65శాతం, సీనియర్ సిటిజన్లకు 6.15శాతం

-211రోజులు-ఏడాదిలోపు : సాధారణులకు 5.90శాతం సీనియర్ సిటిజన్లకు 6.40శాతం

-ఏడాది నుంచి 2ఏండ్లు: సాధారణులకు 6.25శాతం, సీనియర్ సిటిజన్లకు 6.75శాతం

-2ఏళ్ల నుంచి 3ఏళ్లు: సాధారణులకు 6.40శాతం, సీనియర్ సిటిజన్లకు 6.90శాతం

-3 నుంచి 5ఏళ్లు : సాధారణులకు 6.30శాతం, సీనియర్ సిటిజన్లకు 6.80శాతం

-5 నుంచి 10ఏళ్లు: సాధారణులకు 6.05శాతం, సీనియర్ సిటిజన్లకు 7.05శాతం

Also Read:  Basmati vs Texmati: భారత్‎తో పెట్టుకుంటే భవిష్యత్ లేకుండా పోతావ్ ట్రంప్.. టెక్స్‎మతి కంటే బాస్మతికే జై కొడుతున్న NRIలు.. సుంకాల పేరుతో బెదిరిస్తే భయపడతామా..?

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.

 

About the Author

Bhoomi

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.  

...Read More

Trending News