Explained: భారత్ వద్ద ఉక్కు కవచం.. పాకిస్థాన్, చైనాలకు వణుకు పుట్టిస్తున్న S-400 ట్రయంఫ్ యాంటీ మిసైల్ సిస్టమ్ గురించి ఎవరికీ తెలియని సీక్రెట్స్ ఇవే

S-400 Triumph anti-missile system: భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం కమ్ముకుంటున్న నేపథ్యంలో ఇప్పుడు ఇరుదేశాల మధ్య సైనిక  బలాబలాల గురించి సర్వత్ర చర్చ నడుస్తోంది. ఇందులో భాగంగా భారత సైన్యం పాకిస్తాన్ తో  పోల్చి చూసినప్పుడు అన్ని విధాల  పై చేయి సాధిస్తున్నట్లు కనిపిస్తోంది.  

Written by - Bhoomi | Last Updated : Apr 27, 2025, 04:41 PM IST
Explained: భారత్ వద్ద ఉక్కు కవచం.. పాకిస్థాన్, చైనాలకు వణుకు పుట్టిస్తున్న S-400 ట్రయంఫ్ యాంటీ మిసైల్ సిస్టమ్ గురించి ఎవరికీ తెలియని సీక్రెట్స్ ఇవే

S-400 Triumph anti-missile system: భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం కమ్ముకుంటున్న నేపథ్యంలో ఇప్పుడు ఇరుదేశాల మధ్య సైనిక  బలాబలాల గురించి సర్వత్ర చర్చ నడుస్తోంది. ఇందులో భాగంగా భారత సైన్యం పాకిస్తాన్ తో  పోల్చి చూసినప్పుడు అన్ని విధాల  పై చేయి సాధిస్తున్నట్లు కనిపిస్తోంది.  అయితే పాకిస్తాన్ సైన్యం పరంగా బలహీనంగా ఉన్నప్పటికీ న్యూక్లియర్ దేశం కావడంతో  యుద్ధ పరిణామాల విషయంలో  అంతర్జాతీయ సమాజం ఆందోళన పడుతుంది.  అయితే పాకిస్తాన్ ఎలాంటి దుందడుగు చర్యలకు పాల్పడినప్పటికీ అడ్డుకునే  రక్షణ కవచం భారత్ వద్ద ఉంది.  ముఖ్యంగా పాకిస్తాన్ వద్ద అనేక క్షిపణులు ఉన్నాయి. . వాటిని ఎదిరించడానికి  ప్రస్తుతం మన దగ్గర  రష్యా నుంచి దిగుమతి చేసుకున్న అత్యాధునిక ఎయిర్ డిఫెన్స్ సిస్టం, S-400 ట్రయంఫ్ యాంటీ మిసైల్ సిస్టమ్  ఒక గేమ్ చేంజర్ అవుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.  పాకిస్తాన్  ఒకవేళ మిస్సైల్స్ దాడి చేసినట్లయితే దాన్ని ఎదుర్కొనేందుకు  ఈ అత్యాధునికమైనటువంటి S-400 ట్రయంఫ్ యాంటీ మిసైల్ సిస్టమ్  ఉపయోగపడుతుంది. 

Add Zee News as a Preferred Source

 భారత్ తల సరిహద్దు దేశాలైన పాకిస్తాన్ చైనాలతో ఎప్పటికైనా ప్రమాదం పొంచి ఉన్న నేపథ్యంలో 2018లోనే రష్యాతో S-400 ట్రయంఫ్ యాంటీ మిసైల్ సిస్టమ్ కొనుగోలు కోసం ఓ డీల్ సైన్ చేసింది, మొత్తం 5 యూనిట్ల S-400 సిస్టమ్‌లను సుమారు రూ.40,000 కోట్లకు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. 

Also Read:  Success Story: ఆయన పేరే ఒక బ్రాండ్.. 115 ఏళ్ల క్రితం పునాది పడి.. రూ. 70,000 కోట్లకు పడగెత్తిన టీవీఎస్.. సక్సెస్ స్టోరీ ఇదే

S-400 ట్రయంఫ్ యాంటీ మిసైల్ సిస్టమ్ ప్రత్యేకతలు ఇవే..

>>  ఈ యాంటీ మిసైల్ సిస్టం ద్వారా శత్రువుల యుద్ధ విమానాలు, డ్రోన్లు, క్రూయిజ్ మిసైళ్ళు, బ్యాలిస్టిక్ మిసైళ్ళను గాల్లోనే ధ్వంసం చేసే వీలు ఉంటుంది. దీనిని ఐరన్ డోమ్ అని కూడా అంటారు.  ఇజ్రాయిల్ ఇలాంటి సిస్టం తోనే  తమ దేశం పైన జరిగే అన్ని రకాల క్షిపణి దాడులను అడ్డుకుంటుంది

>>  దీని రేంజ్ 400 కిలోమీటర్ల వరకు ఉంటుంది అంటే ఆ రేంజ్ లో ఉండే లక్ష్యాలను అది కనిపెట్టి వాటిపై ఎదురు దాడి చేస్తుంది. 

>>  అలాగే 30 కిలోమీటర్లు ఎత్తు వరకూ  ఇది మిస్సైల్స్ ఎదుర్కొనే  సామర్థ్యం కలిగి ఉంది. 

>>  ఒకేసారి 80 టార్గెట్లను ట్రాక్ చేయడంతో పాటు 36 టార్గెట్లపై  ఒకేసారి దాడి చేయగలరు.

Also Read: Gold Rate: గోల్డ్ లవర్స్ కు సూపర్ బంపర్ న్యూస్.. తులం బంగారం ధర రూ. 27000లు తగ్గుతుందా?  

>>  ఇది ఒక రకంగా చెప్పాలంటే ఉక్కు కవచం అని చెప్పవచ్చు. 

>>  యుద్ధం వంటి పరిస్థితులలో ఇది గగనతల నుంచి వచ్చే దాడులను ఎదుర్కొనేందుకు సర్వసిద్ధంగా ఉంటుంది. 

>>  ప్రస్తుతం  S-400 ట్రయంఫ్ యాంటీ మిసైల్ సిస్టమ్  ఢిల్లీ,  పాకిస్తాన్ వైపు ఉన్న పశ్చిమ సరిహద్దు ప్రాంతాల్లోనూ, అలాగే  చైనా వైపు ఉన్న తూర్పు సరిహద్దు ప్రాంతాల్లో అమర్చినట్లు సమాచారం ఉంది. అయితే  దేశ భద్రత దృష్ట్యా  వీటిని ఎక్కడ స్థాపించారో  గోప్యంగా ఉంచుతారు.

S-400 ప్రపంచంలోనే టాప్ క్లాస్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌ గా పేరుంది. అమెరికా తయారు చేసిన  Patriot సిస్టమ్ ఇది సమర్థవంతమైనదిగా పేరుంది.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

Bhoomi

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.  

...Read More

Trending News