Senior citizens Scheme: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక ఇబ్బందులు లేని జీవితంగా గడపాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. ఎందుకంటే రిటైర్మెంట్ తర్వాత నెలజీతం రాదు. ఖర్చులు పెరుగుతుంటాయి. వైద్య ఖర్చులు, కుటుంబ అవసరాలు, రోజువారీ ఖర్చులు ఇవన్నీ కూడా కొనసాగుతూనే ఉంటాయి. అలాంటి సమయంలో ఒక స్థిరమైన ఆదాయం ఉంటేనే మనస్సు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంతంగా ఉంటుంది. రిటైర్డ్ వ్యక్తుల కోసం పోస్టాఫీస్ అందిస్తున్న ఓ అద్భుతమైన స్కీమ్ ఉంది. అదే సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్స్.
ఈ పథకం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన భద్రతతో కూడిన పెట్టుబడి మార్గం. ముఖ్యంగా వృద్ధులు ఆర్థికంగా స్వతంత్రంగా ఉండేలా చేయడమే దీని ప్రధాన ఉద్దేశ్యం. SCSSలో మీరు ఒకసారి మొత్తం మొత్తాన్ని డిపాజిట్ చేస్తే, దానిపై వచ్చే వడ్డీ ప్రతి మూడు నెలలకు ఒకసారి మీ పోస్టాఫీస్ సేవింగ్స్ అకౌంట్‌లో ఆటోమేటిక్‌గా జమ అవుతుంది.
అంటే, ఉద్యోగం ముగిసిన తర్వాత కూడా ప్రతి నెలా ఒక స్థిరమైన ఆదాయం లభిస్తుంది. అది కూడా ప్రభుత్వం హామీ ఇచ్చిన రీతిలో వస్తుంది. ప్రస్తుతం ఈ పథకం ద్వారా వార్షికంగా 8.2శాతం వడ్డీ రేటు అందుతోంది. ఉదాహరణకు, మీరు రూ. 30 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే, సంవత్సరానికి సుమారు రూ. 2,46,000 వడ్డీ వస్తుంది. ఈ మొత్తం ప్రతి మూడు నెలలకు రూ. 61,500గా మీ ఖాతాలో జమ అవుతుంది. అంటే నెలకు దాదాపు రూ. 20,500 వరకు మీకు రెగ్యులర్ ఇన్‌కమ్ వస్తుంది. ఇది ఒక సురక్షితమైన, స్థిరమైన ఆదాయ వనరు, రిటైర్మెంట్ తర్వాత కూడా మీ జీవన ప్రమాణాన్ని కొనసాగించేందుకు దోహదపడుతుంది.
ఎలా ఇన్వెస్ట్ చేయాలంటే..
కనిష్ట పెట్టుబడి: రూ. 1,000
గరిష్ట పెట్టుబడి: రూ. 30 లక్షలు
పథకం గడువు: 5 సంవత్సరాలు
ఈ ఐదు సంవత్సరాలు పూర్తయ్యాక, మీరు కోరుకుంటే పథకాన్ని మరిన్ని 3 సంవత్సరాల పాటు పొడిగించుకునే అవకాశం ఉంది. అంటే మీ ఆదాయం మధ్యలో ఎటువంటి విఘాతం లేకుండా కొనసాగుతుంది.
అర్హత ఎవరికీ ఉంది?
60 ఏళ్లు పూర్తయిన ఎవరైనా ఈ స్కీమ్ ప్రారంభించవచ్చు.
55 నుండి 60 సంవత్సరాల మధ్య వయస్సులో స్వచ్ఛంద పదవీ విరమణ (VRS) తీసుకున్నవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
అలాగే రక్షణ సేవల (Defence Services) నుండి 50 నుండి 60 సంవత్సరాల మధ్య వయస్సులో రిటైర్ అయినవారు కూడా దీనికి అర్హులు.
ఈ స్కీమ్ ప్రత్యేకత:
సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ అనేది పూర్తిగా ప్రభుత్వ భరోసా ఉన్న పెట్టుబడి మార్గం. ఇతర ఫిక్స్‌డ్ ఇన్‌కమ్ ఆప్షన్‌లతో పోలిస్తే దీని వడ్డీ రేటు ఎక్కువగా ఉంటుంది. అదే సమయంలో, ప్రతి త్రైమాసికం వడ్డీ రూపంలో డబ్బు లభించడం వలన రిటైర్డ్ వ్యక్తులు తమ రోజువారీ ఖర్చులను సులభంగా నిర్వహించవచ్చు.
రిటైర్మెంట్ తర్వాత స్థిరమైన ఆదాయం అందించే సురక్షితమైన మార్గాన్ని వెతుకుతున్నవారికి SCSS ఒక అద్భుతమైన ఎంపిక అని చెప్పవచ్చు. భద్రత, నమ్మకం, నిరంతర ఆదాయం.. ఈ మూడు లక్షణాల కలయికతో సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ నిజంగా రిటైర్డ్ జీవితానికి ఆర్థిక భరోసానిస్తుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook









