Stock market: రెండు నెలల తర్వాత దుమ్ములేపిన నిఫ్టీ.. చాలా రోజుల తర్వాత స్టాక్ మార్కెట్‎కి గుడ్ న్యూస్

Stock market: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీగా లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలకు తోడు దేశీయంగా ఫైనాన్షియల్, మెటల్ స్టాక్స్ లో కొనుగోళ్ల మద్దతు సూచీలకు బాగా కలిసివచ్చింది. దీంతో వరుసగా రెండో రోజూ సూచీలు లాభపడ్డాయి. సెన్సెక్స్ ఇంట్రాడేలో 1200 పాయింట్ల మేర లాభపడింది.

Written by - Bhoomi | Last Updated : Mar 18, 2025, 05:18 PM IST
 Stock market: రెండు నెలల తర్వాత దుమ్ములేపిన నిఫ్టీ.. చాలా రోజుల తర్వాత స్టాక్ మార్కెట్‎కి గుడ్ న్యూస్

Stock market: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీగా లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలకు తోడు దేశీయంగా ఫైనాన్షియల్, మెటల్ స్టాక్స్ లో కొనుగోళ్ల మద్దతు సూచీలకు బాగా కలిసివచ్చింది. దీంతో వరుసగా రెండో రోజూ సూచీలు లాభపడ్డాయి. సెన్సెక్స్ ఇంట్రాడేలో 1200 పాయింట్ల మేర లాభపడింది. దీంతో నిఫ్టీ 22,800 ఎగువన ముగిసింది. అన్ని రంగాల షేర్లు లాభాల్లో ముగిశాయి. మదుపర్ల సంపదగా భావించే బీఎస్ లో నమోదిత కంపెనీల మొత్తం విలువ ఒక్క సెషన్ లో రూ. 6. 85లక్షల కోట్లు పెరిగి రూ. 400.03 లక్షల కోట్లకు చేరుకుంది. 

Add Zee News as a Preferred Source

సెన్సెక్స్ ఉదయం 74,608.66 పాయింట్ల వద్ద లాభాల్లో ప్రారంభం అయ్యింది. ఆద్యంతం లాభాల్లోనే కొనసాగింది. ఇంట్రాడేలో 75,385.76 గరిష్టాన్ని తాకింది. చివరికి 1131.31 పాయింట్లు లాభపడి 75,301.26 వద్ద ముగిసింది. నిఫ్టీ కూడా 325.55పాయింట్ల లాభంతో 22,834.30 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ 27 బలపడి 86.54గా నమోదు అయ్యింది. 

Also Read: Red Cells: శరీరంలో ఎర్ర రక్త కణాల పాత్ర ఏమిటీ? అవి పెరగాలంటే ఏం తినాలి?

సెన్సెక్స్ 30 సూచీలో జొమాటో, ఐసీఐసీఐ బ్యాంక్ , మహీంద్రా అండ్ మహీంద్రా, టాటా మోటార్స్, ఎల్ అండ్ టీ షేర్లు ప్రధానంగా లాభపడ్డాయి. బజాజ్ ఫిన్ సర్వ్, భారతీ ఎయిర్ టెల్, టెక్ మహీంద్రా, రిలయన్స్ ఇండస్ట్రీస్ నష్టాలు చవిచూశాయి. అంతర్జాతీయ విపణిలో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 72.11 డాలర్ల వద్ద కొనసాగుతుండగా..బంగారం ఔన్సు ధర 3034 డాలర్ల దగ్గర ట్రేడ్ అవుతోంది. 

నిన్నటి అమెరికా మార్కెట్లతోపాటు నేడు ఆసియా మార్కెట్లలో ర్యాలీ కారణంగా దేశీయ స్టాక్ మార్కెట్లలోనూ అతి ప్రతిబింబించింది. చైనా ఉద్దీపన చర్యల కారణంగా హాంకాంగ్ హాంగ్ సెంగ్ 2శాతం మేర లాభంతో మూడేళ్ల గరిష్టానికి చేరుకుంది. 

-అమెరికాలో కొనసాగుతున్న వాణిజ్య యుద్ధాల నేపథ్యంలో చైనా తీసుకున్న ఉద్దీపన చర్యలకు దిగింది. వినియోగాన్ని పెంచేందుకు అక్కడి ప్రభుత్వం కృషి చేస్తోంది. దీంతో ఆ దేశం నుంచి మెటల్ కు డిమాండ్ పెరుగుతుందనే అంచనాలతో ఆ రంగ స్టాక్స్ లాభ పడ్డాయి. 

Also Read: Bumper Bonanza: ఐపీఎల్‌ బంపర్‌ బొనాంజా.. మ్యాచ్‌లకు ఉచిత ప్రయాణం

-వాణిజ్య యుద్ధ భయాలతో చాలాకాలంగా మార్కెట్లు నష్టాల్లోనే ట్రేడ్ అయ్యాయి. వరుస నష్టాల నేపథ్యంలో చాలా కంపెనీల స్టాక్స్ ఆకర్షణీయంగా ఉన్నాయని విశ్లేషకులు తమ అభిప్రాయాలు వ్యక్తం చేయడం మార్కెట్ కు కలిసి వచ్చింది. 

-భారత వాణిజ్య లోటు మూడున్నర ఏళ్ల కనిష్టానికి దిగడం మార్కెట్ కు సెంటిమెంట్ ను బలపరిచింది. 2025 ఆర్థిక ఏడాదిలో క్యూ3లో జీడీపీ వృద్ధి 6.2శాతం నమోదు కావడం, పారిశ్రామిక ఉత్పత్తిలో 5.1 శాతం పెరుగుదల, స్థూల పన్ను వసూళ్లలో 16శాతం పెరుగుదల, రిటైల్ ద్రవ్యోల్బణం 3.6శాతానికి తగ్గడం సానుకూల అంశాలు మార్కెట్ ర్యాలీకి కారణమని విశ్లేషకులు పేర్కొంటున్నారు. 

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

About the Author

Bhoomi

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.  

...Read More

Trending News