Share Market: షేర్ మార్కెట్ ప్రపంచ కుబేరుల స్థానాల్ని అటూ ఇటూ మారుస్తుంటుంది. షేర్ మార్కెట్ గత 24 గంటల్లో ప్రపంచంలోని టాప్ 10 ధనవంతుల్లో 7 మందికి తీవ్ర నష్టాలు కొందరికి మాత్రం అమితమైన లాభాల్ని అందించింది. అందులో ఒకరు రిలయన్స్ జియో అధినేత ముఖేష్ అంబానీ.
శుక్రవారం షేర్ మార్కెట్ ముగిసే సమయానికి భారీగా కుదుపులు కన్పించాయి. కొందరికి లాభాలు కురిపిస్తే మరి కొందరికి నష్టాలు మిగుల్చింది. బ్లూమ్‌బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం ముఖేష్ అంబానీకు చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు 3 శాతం పెరగడంతో ఆయన నికర విలువ 24 గంటల్లో ఏకంగా 25 వేల కోట్లకు పెరిగింది. 24 గంటల్లో ఎలాన్ మస్క్ 558 మిలియన్ డాలర్లు అంటే 5 వేల కోట్లు నష్టపోయారు. గత 24 గంటల్లో ఒరాకిల్ సాఫ్ట్ వేర్ కంపెనీ ఛైర్మన్ లారీ ఎల్లిసన్ 2.39 బిలియన్ డాలర్లు సంపాదించి మొదటి స్థానంలో నిలవగా 2.92 బిలియన్ డాలర్లతో ముఖేష్ అంబానీ రెండో స్థానంలో ఉన్నారు. ఇక డెల్ టెక్నాలజీస్ అధినేత మైఖేల్ డెల్ 24 గంటల్లో 2.53 డాలర్లతో మూడో స్థానంలో ఉన్నారు.
ఈ స్థానాలు గత 24 గంటల్లో అత్యధికంగా సంపాదించిన బిలియనీర్స్ జాబితా. భారీ నష్టాలు ఎదుర్కొన్నవారిలో ఎలాన్ మస్క్‌తో పాటు మార్క్ జుకర్ బర్గ్, జెఫ్ బెజోస్, బెర్నార్డ్ ఆర్నాల్డ్, బిల్గేట్స్, వారెన్ బఫెన్ ఉన్నారు. ప్రపంచంలోని టాప్ 10 కుబేరుల్లో ఉన్న వీరి సంపద క్షీణించగా టాప్ 10 జాబితాలోని మరో ముగ్గురు లారీ ఎల్లిసన్, లారీ పేజ్, సెర్గీ బ్రిన్ మాత్రం లాభపడ్డారు.
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ ఇప్పుడు 88.1 బిలియన్ డాలర్లతో ప్రపంచంలో 17వ స్థానంలో ఉన్నారు. ఆసియాలో టాప్ 1లో ఉండగా రెండో స్థానంలో గౌతమ్ అదానీ ఉన్నారు.
Also read: 7th Pay Commission DA Hike: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు హోలీ నజరానా, 3 శాతం పెరగనున్న డీఏ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి









