)
Multibagger Share: రైల్వే రంగంలో పనిచేస్తున్న ప్రభుత్వ సంస్థ రైల్‌టెల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఇటీవల బీహార్ ప్రభుత్వంచి భారీ ఆర్డర్లు అందుకుంది. దీంతో సెప్టెంబర్ 9న కంపెనీ షేర్లు గణనీయమైన పెరుగుదల నమోదు చేశాయి. ఒకే రోజులో రైల్‌టెల్ స్టాక్ 4.5 శాతం వరకు పెరిగి పెట్టుబడిదారుల దృష్టిని ఆకర్షించిందని చెప్పవచ్చు.
బీహార్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ కౌన్సిల్ నుంచి వచ్చిన ఆర్డర్ ప్రకారం రాష్ట్రంలోని పాఠశాలల్లో స్మార్ట్ క్లాస్‌రూం లు ఏర్పాటు చేయడానికి అవసరమైన పరికరాలను సరఫరా చేయాల్సి ఉంటుంది. ఈ ఆర్డర్ అంచనా విలువ రూ. 2,62,14,38,750 కాగా, 2026 మార్చి 31 నాటికి ప్రాజెక్ట్ పూర్తి కానుంది. దీనితో పాటు రైల్‌టెల్‌కు మరో రెండు ముఖ్యమైన ఆర్డర్లు కూడా వచ్చాయి. అందులో ఒకటి ఐసిటి ల్యాబ్‌ల సరఫరా, సంస్థాపన, టెస్టింగ్, కమీషనింగ్ కోసం రూ. 44.21 కోట్లుగా ఉంటుంది. అలాగే ప్రభుత్వ పాఠశాలల్లో 1 నుండి 5 తరగతుల విద్యార్థులకు బోధనా సామగ్రి సరఫరా కోసం రూ. 89.91 కోట్లు విలువైన ఎల్ఓఏ ఆర్డర్ కూడా లభించింది.
సెప్టెంబర్ 9న రైల్‌టెల్ షేర్ రూ. 357 వద్ద ప్రారంభమై, రూ. 367.80 గరిష్టాన్ని తాకింది. గత సెషన్లో (సెప్టెంబర్ 8) ఈ షేర్ రూ. 345 వద్ద ముగిసింది. అంటే ఒకే రోజులో గణనీయమైన లాభం సాధించింది. దీర్ఘకాలికంగా చూసుకుంటే, రైల్‌టెల్ షేర్లు ఇన్వెస్టర్ల మంచి సంపదను సృష్టించాయి. గత 5 సంవత్సరాల్లో ఈ స్టాక్ దాదాపు 200 శాతం రాబడిని ఇచ్చింది. ఒకప్పుడు కేవలం రూ. 100 వద్ద ఉన్న ఈ షేర్ ఇప్పుడు రూ. 360 పైగా ట్రేడవుతోంది.
52 వారాల గరిష్టం రూ. 486, కనిష్టం రూ. 265 కాగా, ప్రస్తుతం షేర్ ధర రూ. 360.80 వద్ద కొనసాగుతోంది. అందుకే ఈ రైల్‌టెల్ స్టాక్‌ను మల్టీబ్యాగర్ అని పిలుస్తున్నారు. కాగా ఈ రైల్‌టెల్ కార్పొరేషన్ 2000 సంవత్సరంలో స్థాపించారు. ప్రస్తుతం దీని మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 11,682 కోట్లుగా ఉంది. కంపెనీ ప్రధానంగా బ్రాడ్‌బ్యాండ్, VPN సర్వీసులు, టెలికమ్యూనికేషన్, మల్టీమీడియా నెట్‌వర్క్‌లు అందించడంతో పాటు భారతీయ రైల్వేలో రైలు నియంత్రణ, ఆపరేషన్, భద్రతా వ్యవస్థలను ఆధునీకరించడంలో కీలక పాత్ర పోషిస్తోంది.
తాజా ఆర్డర్లు రైల్‌టెల్ వ్యాపారానికి మరింత ఊతమివ్వడమే కాకుండా, భవిష్యత్తులో షేర్ ధరలకు కూడా మద్దతు ఇవ్వవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. పెట్టుబడిదారులు దీన్ని ఒక సుదీర్ఘకాలిక పెట్టుబడి అవకాశంగా భావిస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.