షేర్ మార్కెట్‌లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించలేం. కొన్ని దీర్ఘకాలికంగా ప్రయోజనాలు అందిస్తే..మరికొన్ని తక్కువ వ్యవధిలోనే లాభాల్ని అందిస్తుంటాయి. స్మార్ క్యాప్ షేర్స్ కూడా ఈ కోవకు చెందినవే. రిస్క్ కాస్త ఉన్నా..ఇన్వెస్టర్లకు అమితమైన లాభాల్ని ఇస్తాయి. ఆ వివరాలు మీ కోసం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

షేర్ మార్కెట్‌లో మల్టీ బ్యాగర్ స్టాక్స్ లేదా స్మాల్ క్యాప్ షేర్స్‌కు క్రేజ్ ఉంటుంది. కారణం తక్కువ వ్యవధిలో ఎక్కువ లాభాల్ని ఆర్జిస్తాయి. వీటిలో రిస్క్ కాస్త ఉన్నా..లాభాల్ని ఇవ్వడం మొదలెడితే ఊహించని లాభాలుంటాయి. రిస్క్ తీసుకోవడం ఇష్టమైతే..ఇలాంటి షేర్లలో పెట్టుబడితో ఎక్కువ లాభాలు ఆర్జించవచ్చు. ఈ విధమైన షేర్లకు దూరంగా ఉండాలని షేర్ మార్కెట్ నిపుణులు సూచిస్తుంటారు. ఎందుకంటే ఇందులో రిస్క్ కూడా ఉంటుంది. స్మాల్ క్యాప్ షేర్లలో నష్టపోయేందుకు ఎక్కువ అవకాశాలుంటాయి. కానీ లాభాలిస్తే మాత్రం ఊహించని విధంగా ఉంటాయి.


1 వేయికి 25 వేలు


స్మాల్ క్యాప్ షేర్లకు ఉదాహరణ ఇయాంత్రా వెంచర్స్. ఈ కంపెనీ తన ఇన్వెస్టర్లకు ఇటీవల భారీగా లాభాల్ని ఆర్జించిపెట్టింది. ఈ వెంచర్ షేర్ గత 6 నెలల్లో ఇన్వెస్టర్లకు 25 లక్షల వరకూ రిటర్న్స్ అందించింది. కేవలం 1 లక్ష రూపాయల ఇన్వెస్ట్‌మెంట్‌తో ఇన్వెస్టర్లకు లాభాల్ని అందించింది. ఇయాంత్రా వెంచర్స్ తన షార్ట్ టర్మ్‌లో ఇన్వెస్టర్లకు 3.42 రూపాయలు షేర్‌కు 86.15 రూపాయల చొప్పున రిటర్న్ అందించింది. అంటే సెప్టెంబర్ 5న బీఎస్ఈలో 3.43 రూపాయలకు లిస్ట్ అయిన ఈ కంపెనీ షేర్..పెరిగి గత 6 నెలల్లో 86.15 రూపాయలకు చేరుకుంది. గత ఆరు నెలల్లో ఈ కంపెనీ స్టాక్ 2411.66 శాతం పెరిగింది. 


ఇయంత్రా వెంచర్స్‌లో పెట్టుబడితో లక్షాధికారులుగా


ఇయాంత్రా వెంచర్స్ స్మాల్ క్యాప్ కంపెనీ. మొత్తం మార్కెట్ విలువ 12.41 కోట్ల రూపాయలు. బీఎస్ఈలో గత 5 రోజుల్లో ఈ కంపెనీ షేర్లలో 21 శాతం పెరుగుదల కన్పించింది. శుక్రవారం కూడా ఈ స్టాక్ తన గరిష్ట ధర 86.15 రూపాయలకు చేరుకుంది. ఫలితంగా ఇన్వెస్టర్లకు ఊహించని లాభాలు ఎదురయ్యాయి. అంటే ఆరు నెలల క్రితం ఈ కంపెనీ షేర్లలో 1 లక్ష రూపాయలు పెట్టుబడి పెట్టుంటే..ఆ షేర్ విలువ ఇప్పుడు 25 లక్షల రూపాయలయ్యేది. అంటే దాదాపు 25 వందల రెట్లు మీ పెట్టుబడి పెరిగింది.


Also read: Earn Money Idea: మీ దగ్గర ఈ నోటు ఉంటే జాక్‌పాట్ కొట్టేసినట్లే.. మీ తలరాతను మార్చే ఐడియా..!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook