)
Smart TV Offer in Flipkart: మీరు కొత్త స్మార్ట్ టీవీ కొనాలని ఆలోచిస్తూ, బడ్జెట్ తక్కువగా ఉండాలని ఆలోచిస్తున్నారా? అయితే మీకు ఈ వార్త మీకు చాలా ముఖ్యం. దీపావళికి ముందు స్మార్ట్ టీవీలపై గణనీయమైన తగ్గింపులు, ఆఫర్లను ప్రకటించారు. పండుగ సీజన్ ఆఫర్లతో బ్రాండెడ్ టీవీలు కూడా సరసమైన ధరలకు అందుబాటులో ఉన్నాయి. పండుగ డీల్‌లో భాగంగా మీరు ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ ఫ్లిప్‌కార్ట్‌లో రూ.6,000 కంటే తక్కువ ధరకు 24-అంగుళాల స్క్రీన్ సైజు థామ్సన్ ఆల్ఫా సిరీస్ స్మార్ట్ టీవీని కొనుగోలు చేయవచ్చు.
ఈ రోజుల్లో స్మార్ట్ టీవీలను ప్రజలు ఎక్కువగా ఇష్టపడుతున్నారు . ఎందుకంటే అవి OTT యాప్‌లకు సపోర్ట్ చేస్తాయి. చాలా మంది వినియోగదారులు ఇప్పుడు ఆన్లైన్ ప్లాట్‌ఫామ్‌లలో షోలు, సినిమాలను చూడటానికి ఇష్టపడతారు. కాబట్టి పాత మోడళ్లకు బదులుగా పాపులర్ బ్రాండ్ నుండి స్మార్ట్ టీవీని కొనుగోలు చేయడం మంచిది. థామ్సన్ అనేది ఫేమస్ బ్రాండ్ పేరు. ఈ టీవీ ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో సగం ధరకే అందుబాటులో ఉంది.
సగం ధరకే స్మార్ట్ టీవీలు:
పండుగ సీజన్ డిస్కౌంట్ కింద.. మీరు ఫ్లిప్‌కార్ట్‌లో థామ్సన్ ఆల్ఫా HD రెడీ LED స్మార్ట్ లైనక్స్ టీవీ (24Alpha001)ని కేవలం రూ.5,799కే కొనుగోలు చేయవచ్చు. సాధారణంగా, ఈ టీవీ ధర మార్కెట్లో రూ.9,999గా ఉంది. అంతేకాకుండా.. ఈ ఆఫర్‌తో మీరు ఎంపిక చేసిన బ్యాంక్ కార్డుల ద్వారా కొనుగోలు చేస్తే మీకు అదనంగా 10 శాతం తగ్గింపు లభిస్తుంది. అప్పుడు ఈ టీవీ ధర దాదాపు రూ.5,000 వరకు తగ్గుతుంది.
మీరు మీ పాత పరికరాన్ని మార్పిడి చేసుకుంటే, మీరు రూ. 1,900 వరకు అధిక తగ్గింపును పొందవచ్చు. కానీ ఈ విలువ పాత టీవీ మోడల్, స్థితిపై ఆధారపడి ఉంటుంది . ఇప్పుడు అన్ని తగ్గింపులను కలిపితే, ఈ టీవీని
కేవలం రూ. 3,100 కు కొనుగోలు చేయవచ్చు.
థామ్సన్ స్మార్ట్ టీవీ ఫీచర్లు:
థామ్సన్ స్మార్ట్ టీవీ 24-అంగుళాల HD రెడీ డిస్ప్లే (1366x768 పిక్సెల్స్) 60Hz రిఫ్రెష్ రేట్‌తో ఉంటుంది. ఈ టీవీ Linux ఆపరేటింగ్ సిస్టమ్‌పై నడుస్తుంది. ప్రైమ్ వీడియో, యూట్యూబ్ వంటి ప్రసిద్ధ OTT యాప్‌లకు మద్దతు ఇస్తుంది. ఇది అద్భుతమైన సౌండ్ క్వాలిటీ కోసం డ్యూయల్ 20W స్పీకర్లను కలిగి ఉంది. ఈ స్మార్ట్ టీవీ 1-సంవత్సరం వారంటీతో వస్తుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook