Stock Market today: స్టాక్ మార్కెట్లు వారాంతంలో (శుక్రవారం) స్వల్ప నష్టాలను నమోదు చేశాయి. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ- సెన్సెక్స్​ 143 పాయింట్లు కోల్పోయి 58,644 వద్దకు చేరింది. నేషనల్​ స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ-నిఫ్టీ 44 పాయింట్ల నష్టంతో 17,516 వద్ద స్థిరపడింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బడ్జెట్ 2022 నేపథ్యంలో ఈ నెల ఆరంభంలో భారీగా లాభాలను గడించాయి సూచీలు. అయితే ఆ లాభాలను వారాంతపు సెషన్​లో సొమ్ము చేసుకునే పనిలో పడ్డారు. బ్యాంకింగ్, ఆటో షేర్లు అధికంగా నష్టాలను నమోదు చేశాయి.


ఈ రోజు సెషన్​ ఎలా సాగిందంటే..


ఇంట్రాడేలో సెన్సెక్స్​ 58,943 పాయింట్ల అత్యధిక స్థాయిని తాకింది. ఒకానొక దశలో 58,446 కనిష్ఠానికి పడిపోయింది.


నిఫ్టీ ఇంట్రాడేలో 17,617 పాయింట్ల అత్యధిక స్థాయిని తాకింది. 17,462 పాయింట్ల కనిష్ఠాన్ని నమోదు చేసింది.


లాభ నష్టాల్లో టాప్​-5 షేర్లు..


బీఎస్​ఈ 30 షేర్ల ఇండెక్స్​లో 11 కంపెనీలు లాభాలను గడించాయి. 19 సంస్థలు నష్టపోయాయి.


సన్​ఫార్మా 1.09 శాతం, ఏషియన్​ పెయింట్స్ 0.97 శాతం, టాటాస్టీల్​ 0.72 శాతం, అల్ట్రాటెక్ సిమెంట్ 0.68 శాతం, ఎల్​&టీ 0.67 శాతం లాభాలను గడించాయి.


ఎస్​బీఐ 1.92 శాతం, ఎం&ఎం 1.92 శాతం, ఎం&ఎం 1.82 శాతం, ఎన్​టీపీసీ 1.72 శాతం, కోటక్ మహీంద్రా 1.38 శాతం, బజాజ్ ఫిన్​సర్వ్​ 1.06 శాతం నష్టపోయాయి.


ఆసియాలో ఇతర మార్కెట్లు..


ఆసియాలో ఇతర ప్రధాన మార్కెట్లను పరిశీలిస్తే.. టోక్యో (జపాన్​), కోస్పీ (దక్షిణ కొరియా), హాంగ్​ సెంగ్​ (హాంకాంగ్​) సూచీలు లాభాలను గడించాయి. షాంఘై (చైనా), థైవాన్​ సూచీలు సెలవులో ఉన్నాయి.


రూపాయి విలువ..


డాలర్​తో పోలిస్తే రూపాయి 16 పైసలు పెరిగింది. ప్రస్తుతం డాలర్​తో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.74.70 వద్ద కొనసాగుతోంది.


Also read: Zuckerberg Net Worth: మార్క్ జుకర్ బర్గ్​కు ఒక్క రోజులో రూ.2.2 లక్షల కోట్ల లాస్​!


Also read: SBI IMPS: ఎస్‌బీఐ ఐఎంపీఎస్ ట్రాన్సాక్షన్ పరిమితి పెంపు.. సర్వీస్ ఛార్జీల వివరాలివే..


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook