Stocks To Watch: HCL టెక్ (HCLTech): ఈ ప్రముఖ ఐటీ సంస్థ మార్చి నెలతో ముగిసిన క్వార్టర్లీ ఫలితాల్లో రూ. 4,307 కోట్ల కన్సాలిడేట్ లాభం నమోదు చేసినట్లు ప్రకటించింది. గత క్వార్టర్ తో పోలిస్తే 7.81 శాతం ఇది అధికంగా ఉండటం విశేషం. కాగా ఈ కంపెనీ కార్యకలాపాలపై వచ్చే ఆదాయం 6.1 శాతం వృద్ధి చెందింది. ఇది రూ.30,246 కోట్లుగా నమోదు చేసింది.
హ్యాత్‌వే కేబుల్ & డాటాకామ్ (Hathway Cable & Datacom) : ఈ కేబుల్ ఇంటర్నేట్ సర్వీస్ కంపెనీ క్యూ 4 ఫలితాల్లో రూ. 34.8 కోట్ల లాభాన్ని నమోదు చేసింది. కంపెనీ కార్యకలాపాల ద్వారా ఆదాయం రూ. 513.15 కోట్లు వచ్చింది.
ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ (AU Small Finance Bank) : రాజస్థాన్ కేంద్రంగా పనిచేసే ఈ ప్రైవేటు బ్యాంక్ గత త్రైమాసికంలో రూ. 504 కోట్ల లాభాన్ని నమోదు చేసింది. ఇది గత ఏడాది కన్నా 18 శాతం అధికం. వడ్డీ ఆదాయం సహా ఇతర అన్ని రకాలుగా బ్యాంకు చక్కటి వృద్ధిని నమోదు చేసింది.
హవెల్స్ ఇండియా (Havells India): ఈ సంస్థ Q4 ఫలితాల్లో మొత్తం రూ. 518 కోట్ల లాభం నమోదు చేసింది. గత క్వార్టర్ తో పోల్చి చూస్తే ఈ మొత్తం 16 శాతం ఎక్కువగా నమోదు చేసింది. కంపెనీ ఆపరేషన్స్ ద్వారా ఆదాయం 20.2 శాతం పెరిగి రూ. 6,544 కోట్లకు నమోదైంది.
టాటా కమ్యూనికేషన్స్ (Tata Communications) : టాటా గ్రూపునకు చెందిన ఈ ప్రముఖ కమ్యూనికేషన్స్ ఈ సంస్థ మార్చి త్రైమాసికంలో రూ. 336 కోట్ల లాభాన్ని ప్రకటించింది, గత క్వార్టర్ తో పోలిస్తే 15 శాతం అధికం. డేటా సంబంధిత సేవలు నుంచి ఈ ఆదాయం పెరిగింది.
అంబుజా సిమెంట్స్ (Ambuja Cements): అదానీ గ్రూప్ లో చెందిన ఈ సంస్థ ఒరియెంట్ సిమెంట్ లిమిటెడ్ లో 37.8 శాతం ప్రమోటర్ వాటా కొనుగోలు చేశారు.
జెన్సోల్ ఇంజినీరింగ్ (Gensol Engineering): పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ (Power Finance Corporation) జెన్సోల్ ఇంజినీరింగ్ పై ఫేక్ డాక్యుమెంట్ల ద్వారా లోన్ పొందినట్లు ఆర్థిక నేర నిరోధక శాఖలో ఫిర్యాదు చేసింది.
ముత్తూట్ ఫిన్‌కార్ప్ (Muthoot Fincorp): కంపెనీ డిజిటల్ ప్లాట్‌ఫాం బలోపేతం కోసం రూ. 15 కోట్లతో BankBazaarలో సుమారు 1 శాతం వాటా కొనుగోలు చేసింది.
Also Read: Gold Rate: వామ్మో.. వాయ్యో.. లక్ష మార్క్‌ను టచ్ చేసిన బంగారం.. ధర ఇంకా పెరుగుతుందా?
భారతి ఎయిర్‌టెల్ (Bharti Airtel) :ఎయిర్ టెల్ అలాగే, దాని అనుబంధ సంస్థ భారతి హెక్సాకామ్ లిమిటెడ్ (Bharti Hexacom) ఇటీవల అదానీ డేటా నెట్‌వర్క్స్ లిమిటెడ్ (Adani Data Networks) తో 26 GHz స్పెక్ట్రం వినియోగించుకునేలా ఒప్పందం కుదుర్చుకున్నట్లు ప్రకటన చేశాయి.
వరుణ్ బెవరేజెస్ (Varun Beverages) : కంపెనీ తాజాగా యూపీలోని ప్రయాగ్‌రాజ్ వద్ద ఉన్న ప్లాంట్‌లో వాణిజ ఉత్పత్తులను తయారు చేస్తున్నట్లు తెలిపింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









