)
Subhash Chandra Business Insights : అహంకారం.. అంతా మేమే అనే భావన.. పుర్రెలో పుట్టెడు విషం..ఇవన్నీ నేటి తరంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. కానీ 75ఏండ్ల క్రితం ఓ కూగ్రామంలో ఉన్నత కుటుంబంలో జన్మించిన వ్యక్తి నేడు భారత మీడియా రంగాన్నే కాదు.. బిజినెస్ రంగాన్ని ఏలుతున్నారు. దీన్నంతటికి కారణం ఆయనలో ఉన్న ఓర్పు, పట్టుదల, చిన్న చిన్న అవకాశాలను పట్టుకోవడం.. పెద్దగా ఆలోచించడం.. వైఫల్యాలు ఎదురైనా వాటిని అధిగమించి ముందుకు సాగడం.. సత్సంబంధాలను నిర్మించుకోవడం.. ఇవన్నీ కూడా నేటి తరం.. జీ మీడియా అధినేత, ప్రముఖ వ్యాపారవేత్త సుభాష్ చంద్ర నుంచి నేర్చుకోవాల్సిన గుణపాఠాలు. Essel Group, Zee TV, Essel Packaging వంటి భారీ సంస్థలను నిర్మించిన ఈ మహనీయుడి బిజినెస్ ప్రయాణం నిజంగా స్ఫూర్తిదాయకం.
1. అవకాశాలను పట్టుకోవడం నేర్చుకోండి:
తన కుటుంబ వ్యాపారం దివాలా తీసినప్పుడు కూడా సుభాష్ చంద్ర ఆశలు వదలలేదు. FCIలో పాలిషింగ్ కాంట్రాక్ట్ దొరకడం ఆయన జీవితాన్ని మార్చింది. చిన్న అవకాశం కూడా మీ భవిష్యత్తును మార్చగలదని ఆయన నిరూపించారు. అప్పుల్లో కూరుకుపోయామని దిగులు పడకుండా.. ముందుకు సాగితే అవకాశాలు ఉంటాయన్న స్పూర్తిని ఆయన నుంచి నేర్చుకోవాలి.
2. భవిష్యత్తును ముందుగానే చూడాలి
1992లో ప్రైవేట్ ఛానల్స్ దాదాపుగా అసాధ్యమైన సమయంలో Zee TV ప్రారంభించడం ఆయన దూరదృష్టికే నిదర్శనం. మార్కెట్ లోపాలను గుర్తించి వాటిని అవకాశాలుగా మార్చడంలో సుభాష్ చంద్ర ది ప్రత్యేకమైన సామర్థ్యం. నేటి తరం భవిష్యత్తును ముందుగానే గమనిస్తూనే ఉండాలి. అలా చేస్తే విజయం మీ సొంతం అవుతుంది.
3. వైఫల్యాలను చూసి భయపడొద్దు:
వ్యాపారం కుప్పకూలినప్పుడు, భారీ అప్పులు ఉన్నప్పుడు కూడా ఆయన వెనక్కి తగ్గలేదు. ప్రతి వైఫల్యాన్ని ఒక పాఠంగా తీసుకుని ముందుకు సాగడమే విజయం సాధించడానికి ఆయన పాటించిన నియమం.
4. మానవ సంబంధాలు మీ బలమైన ఆస్తి:
సోవియట్ రష్యాతో రూ.16 కోట్ల భారీ ఒప్పందం సంపాదించడం ఆయన నెట్వర్కింగ్ నైపుణ్యానికి నిదర్శనం. వ్యాపారంలో సంబంధాలు, విశ్వాసం, నిబద్దత ఎంత ముఖ్యమో ఆయన చూపించారు. మానవ సంబంధాలు ఆర్థిక సంబంధాలే అయినప్పటికీ నమ్మకం అనే మాటపై నిలబడి ఉంటే కోట్ల ఆస్తులు సంపాదించుకోవచ్చు.
5. పెద్దగా ఆలోచించండి, చిన్నగా ప్రారంభించండి:
Zee TV, Essel World, Essel Packaging.. ఇవన్నీ కూడా చిన్నగా ప్రారంభించిన వ్యాపారాలే. కానీ సుభాష్ చంద్ర ఆలోచన మాత్రం ఎప్పుడూ పెద్దది. మీరు చిన్న స్థాయిలో ప్రారంభించినా, మీ దృష్టి, నమ్మకం గొప్ప విజయాలకు తీసుకెళ్తాయి.
6. సమాజ సేవే అసలైన గొప్పతనం:
50,000 పైగా పాఠశాలలకు మద్దతు, విపాసన పగోడా నిర్మాణానికి సహాయం..విజయం సాధించడం కంటే సమాజానికి తిరిగి ఇవ్వడమే ముఖ్యమని ఆయన నమ్ముతుంటారు. ఇవన్నీ కూడా ఈతరం యువత ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగితే..ఇలాంటి సుభాష్ చంద్రలు ఎంతో మంది తయారవ్వడం పక్కా.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.